టాలీవుడ్

‘విజయానంద్’… ట్రైలర్ విడుదల

ఎంటైర్ ఇండియాలో అతి పెద్ద‌దైన క‌మ‌ర్షియ‌ల్ వెహిక‌ల్స్ కంపెనీ వీఆర్ఎల్ కంపెనీ వ్య‌వ‌స్థాకుడు.. ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత విజ‌య్ శంకేశ్వ‌ర్ బ‌యోపిక్ ‘విజయానంద్’. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా డిసెంబ‌ర్ 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. శ‌నివారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను బెంగుళూరులో విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే సామాన్యుడిగా జీవితాన్ని ప్రారంభించిన విజ‌య్ శంకేశ్వ‌ర్‌… దేశంలోనే అతి పెద్ద‌దైన క‌మ‌ర్షియ‌ల్ వాహ‌నాల కంపెనీని అధినేత‌గా ఎదిగిన ప్ర‌యాణంలో ఆయ‌న ఎదిగిన తీరు.. ఆయ‌నకు ఎదురైన స‌వాళ్లు.. బాధ‌లు వాటిని ఆయ‌న అధిగ‌మించిన తీరు అన్నింటినీ చ‌క్క‌గా చూపించారు.

ప్రేక్ష‌కుడు సినిమాలో ఎలాంటి అంశాల‌ను ఉండాల‌ని కోరుకుంటాడో, అలాంటి ఎలిమెంట్స్‌ను క‌ల‌గలిపి సినిమాను రూపొందించారు. లెగ‌సీని ముందుకు న‌డిపించిన వ్యక్తిగానే కాకుండా బిజినెస్ టైకూన్‌గా మారిన‌ స్ఫూర్తిదాయ‌క‌మైన ప్ర‌యాణాన్ని కూడా ట్రైల‌ర్‌లో చూపించారు.

అద్భుత‌మైన బ్యాగ్రౌండ్ స్కోర్‌, ఎక్స్‌ట్రార్డిన‌రీ విజువ‌ల్స్ ప్రేక్ష‌కుల‌కు చాలా పెద్ద ప్ర‌భావాన్ని చూపాయి. నిహాల్ ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్‌ను అందించి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు.

విజయానంద్ చిత్రంలో టైటిల్ పాత్ర‌ను నిహాల్ రాజ్‌పుత్ పోషించారు. విజ‌య్ శంకేశ్వ‌ర్ తండ్రి పాత్ర బి.జి.శంకేశ్వ‌ర్‌గా ప్ర‌ముఖ న‌టుడు అనంత నాగ్ న‌టిన‌టించారు. విజ‌య్ భార్య పాత్ర‌ధారిగా సిరి ప్ర‌హ్లాద్‌..కుమారుడు ఆనంద్‌గా భ‌ర‌త్‌ బోప‌న న‌టించారు. వీరితో పాటు వి.ర‌విచంద్ర‌న్‌, షైన్ శెట్టి, అర్చ‌న కొట్టిగే, విన‌య ప్ర‌సాద్ త‌దితరులు ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.

వి.ఆర్‌.ఎల్ సంస్థ వి.ఆర్‌.ఎల్‌.ఫిలింస్ సంస్థ‌ను  స్థాపించి విజ‌యానంద్ పేరుతో తొలి చిత్రాన్ని భారీగా తెర‌కెక్కించింది. రిషికా శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో ఆనంద్ శంకేశ్వ‌ర్ ఈ సినిమాను నిర్మించారు. కీర్త‌న్ పూజారి సినిమాటోగ్ర‌ఫీతో ఎడిటర్‌గా వ‌ర్క్ చేసిన ఈ చిత్రానికి జాతీయ అవార్డ్ గ్ర‌హీత గోపీ సుంద‌ర్ సంగీతాన్ని అందించారు.

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

3 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago