ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత చేతుల మీదుగా వీజే స‌న్నీ సౌండ్ పార్టీ చిత్రం పోస్ట‌ర్ లాంచ్‌!!

Must Read

ఫుల్ మూన్ మీడియా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై, ప్రొడక్షన్ నెం. 1, వి.జె.స‌న్నీ హీరోగా, హ్రితిక శ్రీనివాస్ హీరోయిన్ గా న‌టిస్తున్న నూతన చిత్రం, ‘సౌండ్ పార్టీ’. రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మాత‌లు. జయ శంకర్ సమర్పణ. సంజ‌య్ శేరి ద‌ర్శ‌కుడు. ఈ చిత్రం ఇటీవ‌ల షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట‌ర్ ను ఈ రోజు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా క‌ల్వ‌కుంట్ల క‌విత మాట్లాడుతూ…సౌండ్ పార్టీ` టైటిల్, పోస్ట‌ర్ ఎంతో ఇంట్ర‌స్టింగ్ గా ఉన్నాయి. కాన్సెప్ట్ కూడా ఎంతో ఎంట‌ర్టైనింగ్ గా ఉండ‌బోతున్న‌ట్లు టైటిల్ చూస్తే అర్థ‌మ‌వుతోంది. ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించి ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు , న‌టీన‌టుల‌కు, సాంకేతిక నిపుణుల‌కు మంచి పేరు రావాల‌ని కోరుకుంటున్నా అన్నారు.

నిర్మాత ర‌వి పోలిశెట్టి మాట్లాడుతూ…ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్‌లో వ‌స్తోన్నమా మొద‌టి సినిమా `సౌండ్ పార్టీ` పోస్ట‌ర్ ను నిజామాబాద్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత గారు లాంచ్ చేయ‌డం ఎంతో ఆనందంగా, ప్సోత్సాహ‌క‌రంగా ఉంది. ప్ర‌త్యేకంగా మా `సౌండ్ పార్టీ` యూనిట్ అంద‌రి త‌ర‌ఫున క‌విత గారికి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాం. ఇటీవ‌ల విడుద‌ల చేసిన సౌండ్ పార్టీ టైటిల్ కు వ‌చ్చిన స్పంద‌నే పోస్ట‌ర్ కు కూడా వ‌స్తోంది. మా చిత్రం షూటింగ్ విజ‌య‌వంతంగా పూర్త‌యి ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మా యూనిట్ అంతా ఎంతో శ్ర‌మించి అనుకున్న దానికన్నా అద్భుతంగా చిత్రాన్ని తెర‌కెక్కించారు. త్వ‌ర‌లో విడుద‌ల తేదీ ప్ర‌క‌టిస్తాం. మాకు స‌హ‌క‌రిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు అన్నారు.

హీరో వీజే స‌న్ని మాట్లాడుతూ…మా సౌండ్ పార్టీ` చిత్రం పోస్ట‌ర్ క‌విత గారు లాంచ్ చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన టైటిల్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. షూటింగ్ అంతా పూర్త‌యింది. సినిమా అనుకున్న దానిక‌న్నా చాలా బాగొచ్చింది అన్నారు.

ద‌ర్శ‌కుడు సంజ‌య్ శేరి మాట్లాడుతూ…సౌండ్ పార్టీ` టైటిల్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. ఈ రోజు క‌విత గారి చేతుల మీదుగా మా చిత్రం పోస్ట‌ర్ లాంచ్ చేశాము. పోస్ట‌ర్ లాంచ్ చేసి క‌విత గారు మా టీమ్ అంద‌రికీ బ్లెస్సింగ్స్ అందించ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి అన్నారు.

చిత్ర స‌మ‌ర్ప‌కుడు జ‌య‌శంక‌ర్ మాట్లాడుతూ…మేము ఏ ఉద్దేశ్యంతో టైటిల్ పెట్టామో దానికి రీచ్ అయ్యాము. టైటిల్ విన్న వారంతా కూడా చాలా బావుంది అంటున్నారు. ఈ రోజు మా సినిమా పోస్ట‌ర్ లాంచ్ చేసిన క‌విత గారికి ధ‌న్య‌వాదాలు. మా నిర్మాత‌లు ఇచ్చిన స‌పోర్ట్ తో ఎక్క‌డా రాజీ ప‌డ‌కుండా సినిమాను గ్రాండ్ గా పిక్చ‌రైజ్ చేశాము. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సంబంధించిన విష‌యాలు వెల్ల‌డిస్తాం అన్నారు.

శివన్నారాయణ, అలీ, సప్తగిరి, థర్టీ ఇయర్స్ పృథ్వి, ‘మిర్చి’ ప్రియ, మాణిక్ రెడ్డి, అశోక్ కుమార్, కాదంబరి కిరణ్, ‘జెమిని’ సురేష్, భువన్ సాలూరు, ‘ఐ డ్రీమ్’ అంజలి, ఇంటూరి వాసు, చలాకి చంటి, ప్రేమ్ సాగర్, ఆర్.జె. హేమంత్, శశాంక్ మౌళి, త్రినాధ్, కృష్ణ తేజ త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : శ్రీనివాస్ రెడ్డి, ఎడిటర్ : జి. అవినాష్ ; సంగీతం: మోహిత్ రెహమానిక్ ; ప్రొడక్షన్ డిజైనర్ : రాజీవ్ నాయర్ ; కో – రైటర్స్ : పటేల్ నందుర్క, సుందర్ పాలుట్ల ; లిరిక్స్ : పూర్ణ చారి ; చీఫ్ కో-డైరెక్టర్ : చిన్న‌ ; కో-డైరెక్టర్ : బి. సంతోష్ కృష్ణ ; అసోసియేట్ డైరెక్టర్స్ : యశ్వంత్ వలబోజు, కృష్ణ చైతన్య. టి ; అసిస్టెంట్ డైరెక్టర్స్ : యష్, దిలీప్ కుమార్ రాజు, యువన్ ఫణీంద్ర. యస్ ; పి. ఆర్. ఓ. : జీ కె మీడియా ; లైన్ ప్రొడ్యూసర్ : శివకాంత్ వంగ ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భువన్ సాలూరు. నిర్మాతలు : రవి పోలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర ; సమర్పణ : జ‌య‌శంక‌ర్‌ ; రచన – ద‌ర్శ‌కత్వం : సంజ‌య్ శేరి

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News