ఫుల్ ఫన్ రైడ్‌గా ఆద్యంతం ఆకట్టుకునేలా ‘లైలా’ ట్రైలర్*

Must Read

*‘లైలా’ చూసి మీ ఛాతీ చపాతీ అవుతుంది: ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌లో హీరో విశ్వక్ సేన్*

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘లైలా’. ఈ సినిమాను దర్శకుడు రామ్ నారాయణ్ పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యింది.  విశ్వక్ సేన్ తొలిసారి ఈ సినిమాలో లేడీ గెటప్‌లో కనిపిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ఈ అంచనాలను పెంచాయి. సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో చేస్తున్న టీమ్ తాజాగా ట్రైలర్‌ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ట్రిపుల్ ఏ మాల్‌గా చాలా గ్రాండియర్‌గా నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో ట్రైలర్ రిలీజ్ చేసి ఆడియన్స్‌లో మరింత హైప్ పెంచేసింది.

ట్రైలర్ విషయానికి వస్తే.. లేడీస్ బ్యూటీ పార్లర్ నడుపుతున్న సోనూ  మోడల్(విశ్వక్) అనుకోకుండా స్థానిక ఎమ్మెల్యే హత్య కేసులో ఇరుక్కున్నట్లు తెలుస్తుంది. దీంతో ఎమ్మెల్యే మ‌నుషులు అతడు దొరికితే చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ పరిస్థితిలో తన ప్రాణాలను రక్షించుకోవడానికి, సోనూ లైలాగా మారిపోతాడు. అయితే, లేడీ గెటప్‌లో మారిన విశ్వక్‌కు ఎదురైన అనేక సంఘటనలు ఏంటి? ఎమ్మెల్యే హత్య కేసుకు, సోనూకి సంబంధం ఏంటి? అనే విషయాలు సినిమాలో ఆసక్తికరంగా ఉండనున్నాయి. సోను మోడల్ పాత్రలో విశ్వక్ సేన్ యాక్టింగ్.. అతడు చేసే కామెడీ ఆకట్టుకోనుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ మొత్తం ఎట్రాక్టింగ్ డైలాగ్‌లతో నింపారు. ఈ ట్రైలర్ ఆద్యంతం ఫన్ రైడ్‌‌గా ఉంది. లేడీ పాత్రలో విశ్వక్ సేన్ చేసే అల్లరి థియేటర్లలో ప్రేక్షకులు పడిపడి నవ్వేలా చేస్తుందనడంలో సందేహం లేదు. అటు హీరోయిన్ ఆకాంక్ష శర్మ తన గ్లామర్ షోతో యూత్‌ను ఆకట్టుకోనుంది. లియోన్ జేమ్స్ సంగీతం మేజర్ అసెట్‌గా రానున్న ఈ సినిమాపై ఈ ట్రైలర్ అంచనాలను రెట్టింపు చేసింది.

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ..‘‘ట్రైలర్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా.  థియేటర్లలో మీరు నవ్వి నవ్వి మీ ఛాతీ చపాతీ కావాలని డిసైడ్ అయ్యాం. కచ్చితంగా లైలా మిమ్మల్ని బాగా నవ్విస్తుంది. ట్రైలర్ బయటకు వచ్చింది కాబట్టి.. నాకంటే ట్రైలర్ ఎక్కువ మాట్లాడాలని అనుకుంటున్నా. ప్రీరిలీజ్ ఈవెంట్ ఉంది కాబట్టి అక్కడ మాట్లాడుతా. లైలా నుంచి నెక్ట్స్ అటక్ పటక్ రిలీజ్ అవుతుంది. ఆ సాంగ్  నేనే రాశా. అది కూడా మీకు నచ్చుతుంది. ఫిబ్రవరి 14న అందరూ థియేటర్లలో కలుద్దాం.’’ అని చెప్పారు.

అనంతరం మీడియా అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు టీమ్ సమాధానాలిచ్చారు

డైరెక్టర్ రామ్ నారాయణ్: పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.

విశ్వక్ సేన్: నేను ఈ సినిమాలో లేడీ గెటప్ వేసింది ఎంటర్‌టైన్ చేయడానికి. మా ఇంటెన్షన్ కేవలం మిమ్మల్ని నవ్వించడమే. అందులో భాగంగానే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. యూత్‌కు పవర్‌ప్యాక్డ్‌గా సినిమా ఉంటుంది.

సాయంత్ర పూట ఇంట్లో ఒక్కడినే ఉండడం కష్టం అయింది. ప్యాంట్, షర్ట్ వేసుకుని ఈ గెటప్‌లో బయటకు వెళ్లడం కుదరలేదు. ఈ గెటప్ కోసం రోజూ రెండు గంటలు పట్టేది.

ప్రతీ సినిమా ఒకేలా తీయలేం కదా.. ఇదొక వెరైటీ సినిమా..

నటి కామాక్షి భాస్కర్ల: ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది.  అందుకే టీజర్, ట్రైలర్‌లో ఎక్కడా చూపించలేదు. కామాక్షి అంటే చాలా ఇంటెన్స్ రోల్స్ చేస్తుందనే మార్క్ ఉంది. ఆ మార్క్‌కు తగ్గట్లే ఇందులో నా పాత్ర ఉంటుంది. ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ రామ్ నారాయణ్‌దే.

డాన్స్ మాస్టర్ భాను: ఈ సినిమాలో అన్ని పాటలు నేను చేశాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన విశ్వక్ గారికి థ్యాంక్స్. ఫస్ట్ సాంగ్ సోనూ మోడల్ పెద్ద హిట్ అయింది. అలాగే లాస్ట్ సాంగ్ కోయి కోయిని కూడా హిట్ చేశారు. ప్రతి సాంగ్ సందర్భానుసారం ఉంటుంది. సినిమా మొత్తం బ్లాక్‌బస్టర్‌గా ఉంటుంది.

నటీనటులు: విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ

తారాగణం:

బ్యానర్: షైన్ స్క్రీన్స్

నిర్మాత: సాహు గారపాటి

దర్శకుడు: రామ్ నారాయణ్

రచయిత: వాసుదేవ మూర్తి

సంగీత దర్శకుడు: లియోన్ జేమ్స్

సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్

ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి

పీఆర్వో: వంశీ-శేఖర్

మార్కెటింగ్: ఫస్ట్ షో

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News