”దాస్ కా ధమ్కీ” ప్రీరిలీజ్ ఈవెంట్ లో ఎన్టీఆర్

Must Read

* తారక్ అన్న తోడుగా వచ్చారు. నాకు బ్లాక్ బస్టర్ స్టార్ట్ అయిపొయింది: విశ్వక్ సేన్  

డైనమిక్ హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం ‘దాస్ కా ధమ్కీ’. విశ్వక్ సేన్ ఈ చిత్రానికి కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి. ఇటివలే విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ 2.0 సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది. ‘దాస్ కా ధమ్కీ’ ఈ నెల 22న ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలౌతుంది. ఈ సందర్భంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా మాసీవ్ ప్రిరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. భారీగా తరలివచ్చిన అభిమానుల సమక్షంలో ‘దాస్ కా ధమ్కీ’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ చిత్రం ఈ రోజు ప్రపంచ పటంలో నిలబడిందంటే, ఆస్కార్ అవార్డ్ ని సొంతం చేసుకుందంటే,  దానికి కీరవాణి గారు, రాజమౌళి గారు, చంద్రబోస్ గారు, పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, కోరియోగ్రఫర్ ప్రేమ రక్షిత్ ఎంత కారకులో.. వీరందరితో పాటు తెలుగు చిత్ర సీమ, భారత చిత్ర సీమ అంతే కారణం. యావత్ భారతదేశపు ప్రేక్షక దేవుళ్ళు అంతే కారణం. అలాగే యావత్ మీడియా ఇది మన సినిమాని అక్కున చేర్చుకొని ముందుకు తీసుకెళ్ళింది. వారందరితో పాటు మీ అభిమానం ముఖ్య కారణం. ఆ అవార్డ్ సాధించింది ఆ చిత్రానికి పని చేసిన మేము కాదు మా అందరితో పాటు మీరు సాధించారు. మీ అందరి బదులు మేము అక్కడ నిలుచున్నాం. మా అందరికి బదులు కీరవాణి గారు బోస్ గారు అక్కడ నిలిచున్నారు. వారిద్దరిని అక్కడ చూస్తుంటే ఇద్దరు భారతీయలు కనిపించారు. ఇద్దరు తెలుగు వాళ్ళు కనిపించారు. వేదిక తెలుగుదనంతో ఒట్టిపడింది. ఈ రెండు కళ్ళతో ఆ దృశ్యం చూడటం ఒక పండగలా అనిపించింది. ఇలాంటి పండగని మళ్ళీ  పొందుతాం. ఆర్ఆర్ఆర్ ఇచ్చిన ఉత్సాహంతో తెలుగు సినిమా, ఇండియన్ సినిమా ఇంకా ముందుకు సాగాలని దేవుణ్ణి మనసార కోరుకుంటున్నాను.

విశ్వక్ సేన్ మైక్ లో మాట్లాడిననట్లు నేను ఎప్పుడూ మాట్లాడలేను(నవ్వుతూ) మనోడికి వున్న కాన్ఫిడెన్స్ ఇంపాజిబుల్. తను ఎనర్జీ బాల్. ఈ వేడుకకు రావడం నా భాద్యత. ఈ నగరానికి ఏమైయింది సినిమాలో విశ్వక్ ని చూస్తూ వుండిపోవచ్చు. ఒక నటుడిగా కామెడీ చేయకుండా కామెడీ పండించడం చాలా కష్టం. దీనికి చాలా కాన్ఫిడెన్స్ వుండాలి. తర్వాత తను దర్సకుడిగా చేసిన ఫలక్ నామా దాస్ చూశాను. తర్వాత అశోక వనంలో అర్జున కళ్యాణం చూసి నిజంగా షాక్ అయ్యా. చాలా గొప్ప చేంజ్ ఓవర్ కనిపించింది. హిట్ అనే మూవీ చూసి ఇంకా షాక్ అయ్యాను. ఇంత తక్కువ సమయంలో అంత పరిణితి అందరికీ సాధ్యపడదు. ఇది విశ్వక్ పూర్వజన్మ సుకృతం. అభిమానులు ఆశీస్సులు. తనని తాను ప్రూవ్ చేసుకోవాలని భావించే నటుడు విశ్వక్. ఇప్పుడు తన దర్శకత్వంలో దాస్ కా ధమ్కీ’ చేస్తున్నాడు. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఎందుకంటే తను దర్శకత్వం ఆపేయాలని కోరుకుంటున్నాను. బయట చాలా మంది దర్శకులు వున్నారు. కొత్తకొత్త వాళ్లకి విశ్వక్ లాంటి వారు అవకాశాలు ఇవ్వాలి. అలాంటి వాళ్ళని చూసి మేము వాళ్ళతో సినిమాలు చేయాలి. అందుకే ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి దర్శకత్వం ఆపేయాలి(నవ్వుతూ). తెలుగు సినిమా ఆల్ టైం టాప్ లో వుంది. ఈ టాప్ ఎప్పుడూ తగ్గిపోకూడదు. మనమంతా కలసికట్టుగా ముందుకు వెళ్లి తెలుగు చిత్ర సీమని ప్రపంచ పటంలో  పడనీయకుండా అలానే నిలబెట్టాలి. మేము ఇద్దరం కలసి భోజనం చేస్తున్నపుడు ‘’అన్నా ఈ సినిమా కోసం ఉన్నదంతా పెట్టశాను.. మీరు రావాలి’’ అని విశ్వక్ అన్నప్పుడు నాకు చాలా బాధేసింది. అదే సమయంలో మంచి సినిమా చేయాలనే తన పిచ్చి కూడా అర్ధమైయింది. ఇలాంటి జీల్ వుండే పిచ్చి తగ్గిపోకూడదు. ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. ఇలాంటి వాళ్ళ సినిమాలు ఆడాలి. అప్పుడే మనం ఇంకా ముందుకు వెళ్తాం. 22న ఉగాది రోజు ఈసినిమా విడుదలౌతుంది. ఉగాది మన తెలుగు వాళ్ళ పండగ. పండగ రోజు విశ్వక్ కి నిజమైన పండగ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాకి పని చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. లియాన్ జోన్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని విశ్వక్  భవిష్యత్ లో ఇంకా మంచి సినిమాలు చేయడానికి ఇది తొలి మెట్టు కావాలి కోరుకుంటున్నాను. అభిమానుందరికీ కృతజ్ఞతలు.’ తెలిపారు.  

హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ గారు ఇక్కడికి వచ్చింది నా ఒక్కడి కోసం కాదు. ఆయన అభిమాని కోసం ఇచ్చిన మాట కోసం. సరిగ్గా నిద్రలేకపోయినా సరే వచ్చారు. ఆయన చేసింది నా ఒక్కడి కోసం కాదు. నాలో ప్రతి ఒక్క అభిమానిని చూసి చేసింది. రెండు నెలల క్రితం అన్న ఇంటికి పిలిచి తమ్ముడికి భోజనం పెట్టినట్లు పెట్టారు. ధమ్కీ సినిమా ఈవెంట్ కి రావాలన్నా అని అడిగాను. ‘మాట ఇచ్చాను’ అన్నారు. ఇటివలే అన్న వాళ్ళ ఇంట్లో ఒక సంఘటన జరిగింది. ఇలాంటి సమయంలో ఆయన్ని ఫేవర్ అడగొద్దని సైలెంట్ గా వుండిపోయా. ఆయన ఇంట్లో కార్యక్రమాలు అయిపోయాగానే ఈవెంట్ ఎప్పుడో కనుక్కోమని నాకు కబురు పంపించారు. అప్పుడు ఆయన ఆస్కార్ కాదు .. అంతకంటే ఎక్కువ అనిపించింది. ఆయన మ్యాన్ అఫ్ వర్డ్. ‘రావడం నా భాద్యత’’ అని ఆయన మెసేజ్ పెట్టిన వెంటనే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.  ఇండియాని గర్వంగా చేసిందుకు థాంక్స్ అన్నా. ఇండియాలో బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే ఎన్టీఆర్ అని ఎప్పుడో చెప్పా. 17 ఏళ్లకు బాంబులు వేసి తొడగొట్టారు.. మళ్ళీ అది రిపీట్ కాదు. ఇప్పటి వరకూ చూసింది తారక్ అన్న టీజరే. ఇప్పుడు నుంచి అసలు సినిమా మొదలైయింది. నేను పడిపోతే బావుండు. నవ్వుదామని చాలా మంది వుంటారు. దేవుడు ఇవన్నీ చూస్తున్నాడని అనుకుంటా. అందుకే నాకు తోడుగా అన్నని పంపించాడు. నాకు బ్లాక్ బస్టర్ స్టార్ అయిపొయింది. నందమూరి అభిమానులందరికీ కృతజ్ఞతలు.  దాస్ కా ధమ్కీ’ 22న ఉగాది రోజు వస్తోంది. ఐదేళ్ళ తర్వాత మళ్ళీ డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది. నేను యాక్టింగ్ చేస్తే మూడు సినిమాలు చేసే వాడిని. కానీ నా ప్రాణం, డబ్బులన్నీ పెట్టి చేసిన సినిమా ఇది. ఫస్ట్ హాఫ్ లో పాటలు కామెడీ ఫైట్లు ఎంజాయ్ చేస్తారు. ఇంటర్ వెల్ లో ప్యాక్ అవుతుంది. సెకండ్ హాఫ్ చుప్ చాప్ గా చూస్తారు. గుండెలు బరువౌతాయి. హాట్ రేట్ పెరుగుతుంది. చివర్లో ఒక సర్ ప్రైజ్ ఎలిమెంట్ వుంది. మిమ్మల్ని నిరాశ పరచను. ఇది జస్ట్ ఫిల్మ్ కాదు..  విశ్వక్ సేన్ 2. 0. ఉగాది రోజున ప్రతి ఒక్కడి సీట్ షేక్ అవ్వుద్ది. అందరం థియేటర్ లో కలుద్దాం’’ అన్నారు.      

నివేదా పేతురాజ్ మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకుల మనసుని గెలుచుకున్నారు. సౌత్ ప్రేక్షకుల మనసుని గెలుచుకున్నారు. ఇండియన్ ప్రేక్షకుల మనసుని గెలుచుకున్నారు. ఈ రోజు ప్రపంచ ప్రేక్షకుల మనసుని గెలిచిన ఎన్టీఆర్ గారు.. వెల్ కమ్ బ్యాక్. మిమ్మల్ని చూసి దేశం గర్వపడుతుంది. విశ్వక్ ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఈ రోజు నుంచి దాస్ కా ధమ్కీ’ కి బ్లాక్ బస్టర్ స్టార్ట్ అయ్యింది’’ అన్నారు.

కరాటే రాజు మాట్లాడుతూ.. ‘దాస్ కా ధమ్కీ’ 22న ఉగాది రోజున విడుదలౌతుంది. మా సినిమాకి ఎన్టీఆర్ గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి కొంచెం బాగాలేకపోవడంతో మేము టచ్ చేయనప్పటికీ ఆయనే స్వయంగా మీరు ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు నేను వస్తానని  మా బాబు కి మెసేజ్ పెట్టి తన భాద్యత మా సినిమాకి సపోర్ట్ చేయడం ఎంతో ఆనందంగా వుంది. మొదట ఫలక్ నామా దాస్ తీశాం. సినిమా రిలీజ్ కి ముందే స్టార్ డమ్ తెచ్చుకున్నాడు మా అబ్బాయి. ఈ సినిమా కోసం కూడా చాలా కష్టపడుతున్నాడు. పదిహేను నెలలుగా అన్నీ తానే అయ్యి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు.  దీనితో పాటు ఆస్కార్ అవార్డ్ తీసుకొచ్చిన ఎన్టీఆర్ గారు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు కృతజ్ఞతలు’’ తెలిపారు.    

ప్రసన్న కుమార్ బెజవాడ మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ రామ్ చరణ్ అన్న అల్లూరి గెటప్ లో వున్నపుడు ఒక లైట్ పడుతుంది. స్కై లెవల్ ఎలివేషన్ వస్తుంది. ఈ సినిమాకి ఈవెంట్ కి ఎన్టీఆర్ గారు రావడమే ఆ లైట్. ఈ నిమిషం నుంచి ఈ సినిమా వేరే లెవల్ కి వెళుతుంది. ఆస్కార్ అవార్డ్ పట్టుకొని ఆంధ్ర గుమ్మానికి కట్టేసిన ఆర్ఆర్ఆర్ టీం అందరికీ కృతజ్ఞతలు. ‘దాస్ కా ధమ్కీ’ 22న విడుదలౌతుంది. ఫస్ట్ హాఫ్ ఎంత నవ్వుకొని చూశారో సెకండ్ హాఫ్ అంత పిన్ డ్రాప్ సైలెన్స్ తో చూపిస్తారు. అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’’ తెలిపారు.

హను రాఘవపూడి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పుకోవడానికి చాలా గర్వంగా వుంది. ఇప్పటివరకూ ఆయన నుంచి వచ్చిన సినిమాలన్నీ ఒక టీజర్ మాత్రమే. ఇప్పుడు ఆసలు సినిమా మొదలైయింది. ఇప్పుడు ఆయన గ్లోబల్ స్టార్. విశ్వక్ ని నేను పెద్ద ఫ్యాన్ ని. విశ్వక్ డైరెక్ట్ చేసిన మొదటి సినిమా చూసి పిచ్చెక్కిపోయాను. దర్శకుడిగా చేయడమే కష్టం. అలాంటిది దర్శకుడు హీరో నిర్మాతగా ఈ సినిమా చేశారు. ఖచ్చితంగా అద్భుతంగా చేసి వుంటారు. విశ్వక్ లో ఆ ప్యాషన్ వుంది. ఈ వేడుక వంద రోజుల పండగలా వుంది. ఈ సినిమా డీవోపీ దినేష్ సీతారామం సినిమాలో ఒక ఫేజ్ కి పని చేసి పెట్టారు. దినేష్ కి థాంక్స్. పాటలు, ట్రైలర్ అన్నీ బావున్నాయి. టీం అందరికీ అభినందనలు’’ తెలిపారు.

హైపర్ ఆది మాట్లాడుతూ.. విశ్వక్ సేన్ మన బాలకృష్ణ గారి లాంటి భోళా మనిషి. విశ్వక్ సేన్ ఏం చేసిన ట్రెండ్ క్రియేట్ చేస్తుంది. మీ అందరూ ఈ సినిమా 22న చూసి ఎంజాయ్ చేయాలి. నందమూరి తారక రామారావు గారు ఆ పేరు పెట్టుకోవాలంటే చాలా ధైర్యం కావాలి అది నిలబెట్టుకోవాలంటే ఇంకా ధైర్యం కావాలి. దాన్ని నిలబెట్టి తొడగొట్టి దటీజ్ ఎన్టీఆర్ అని నిరూపించారు ఎన్టీఆర్.  ఆయన యంగ్ కాబట్టి మనందరికీ జూ. ఎన్టీఆర్. ఒక డెబ్బై ఏళ్ల తర్వాత ఆయనే మనకి సీనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ రామ్ చరణ్ దేశం మీసం తిప్పే సినిమా చేశారు. ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ , రాజమౌళి గారు లాంటి వారు వుండటం మన అదృష్టం’’ అన్నారు.

సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్ లో అవకాశం ఇచ్చిన విశ్వక్ సేన్ గారికి కృతజ్ఞతలు. ‘దాస్ కా ధమ్కీ’ రోలర్ కోస్టర్ రైడ్.  దాస్ కా ధమ్కీ’  కంప్లీట్ ఎంటర్ టైనర్. మీ అందరూ 22న థియేటర్ కి వచ్చి దాస్ కా ధమ్కిని ఎంజాయ్ చేస్తారాని కోరుకుంటున్నాను.  

దీవోపీ దినేష్ కె బాబు మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచిన విశ్వక్ సేన్ గారికి కృతజ్ఞతలు. కరాటే రాజు గారికి కృతజ్ఞతలు. 22న సినిమాని అందరూ థియేటర్ లో చూసి ఎంజాయ్ చేయాలి’’ అని కోరారు.
థర్టీ ఇయర్స్ పృథ్వీ, మహేష్, కాసర్ల శ్యామ్, పూర్ణ చారి, మంగ్లీ యష్ మాస్టర్ తదితరులు ఈ ఈవెంట్ పాల్గొన్నారు.

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News