విశాల్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మకుటం’.. యాక్షన్ మోడ్‌లో అదిరిన టీజర్‌

‘మార్క్ ఆంటోనీ’, ‘మద గజ రాజా’ చిత్రాలతో విశాల్ మంచి విజయాల్ని అందుకున్నారు. విశాల్ కెరీర్‌లోనే ‘మకుటం’ ఓ స్పెషల్ ప్రాజెక్ట్‌గా నిలబోతోంది. హీరోగా, దర్శకుడిగా విశాల్ చేసిన తొలి ప్రాజెక్ట్ ఇదే. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో 99వ సినిమాగా ‘మకుటం’ రూపుదిద్దుకుంటోంది. స్వర్గీయ నిర్మాత ఆర్.బి. చౌదరి ఆధ్వర్యంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం రాబోతోంది. రవి అరసు అందించిన కథ ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ అన్నింటికీ ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. ఈ రోజు (జూన్ 11) మేకర్స్ టీజర్‌ను విడుదల చేశారు.

మండుతున్న శవం.. అందులోంచి సిగరెట్ వెలిగించుకుంటూ ఇచ్చిన హీరో ఎంట్రీ అదిరిపోయింది. ఇక ఇందులో అంజలి మాస్ యాక్షన్‌ను చూడొచ్చు. అంజలి ఓ కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఇక విశాల్ అయితే మూడు డిఫరెంట్ గెటప్స్‌లో తన విశ్వరూపం చూపించారు. ఈ టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, బీజీఎం అన్నీ కూడా అద్భుతంగా కుదిరాయి. ఇదొక యాక్షన్ ప్యాక్డ్ మూవీ అని టీజర్‌ని చూస్తేనే తెలుస్తోంది. హీరోగా, దర్శకుడిగా విశాల్ అద్భుతమైన పనితీరుని కనబర్చారని టీజర్ స్పష్టంగా చెబుతోంది.

స్టైలిష్, విజువల్ ట్రీట్‌లా విశాల్ ఈ మూవీని తెరకెక్కించారు. సినిమాటోగ్రాఫర్ రిచర్డ్ ఎం నాథన్, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం కానున్నాయి. ఈ సినిమాకి ఎడిటర్‌గా ఎన్.బి. శ్రీకాంత్, జి. దురైరాజ్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేశారు.

మొత్తం మీద ఈ టీజర్‌ ఒక్కసారిగా ‘మకుటం’పై భారీ అంచనాల్ని పెంచేసింది. విశాల్ త్రిపాత్రాభినయం, స్టైలిష్ దర్శకత్వం, ఆకట్టుకునే సాంకేతిక నైపుణ్యం, ఆసక్తికరమైన కథనం అన్నీ కలిసి ఈ చిత్రాన్ని అతని కెరీర్‌లోనే క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఒకటిగా నిలబెట్టాయి. ‘మకుటం’ జూలైలో విడుదల కానుంది.

తారాగణం : విశాల్, దుషార విజయన్, అంజలి, తంబి రామయ్య, అర్జై తదితరులు

సాంకేతిక సిబ్బంది:

నిర్మాణ సంస్థ: సూపర్ గుడ్ ఫిల్మ్స్
నిర్మాత: ఆర్.బి. చౌదరి
దర్శకుడు: విశాల్
కథ: రవి అరసు
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం నాథన్
ఎడిటర్: ఎన్.బి. శ్రీకాంత్
కళా దర్శకుడు: జి. దురైరాజ్
కాస్ట్యూమ్ డిజైనర్: వాసుకి భాస్కర్
పి.ఆర్.ఓ: సాయి సతీష్

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

4 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

4 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

4 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago