టాలీవుడ్

విశాల్ ఎ వినోద్ కుమార్  లాఠీ ట్రైలర్ విడుదల

యాక్షన్ హీరో విశాల్ కథానాయకుడిగా ఏ వినోద్ కుమార్ దర్శకత్వంలో రానా ప్రొడక్షన్స్‌పై రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’.  రమణ, నంద సంయుక్తగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన యాక్షన్‌ తో కూడిన ‘లాఠీ’ టీజర్‌ కు ట్రెమండస్  రెస్పాన్ వచ్చింది. తాజాగా మేకర్స్ థియేట్రికల్ ట్రైలర్‌ ని విడుదల చేశారు.

తీవ్రంగా గాయపడిన విశాల్ డంప్ యార్డ్‌ లో నగ్నంగా నడుస్తున్నట్లుగా ట్రైలర్‌ ప్రారంభమైయింది. నేరస్థులను లాఠీ తో కొట్టడానికి తన పై అధికారుల నుండి ఆదేశాలు పొందేందుకు ఇష్టపడే నిజాయితీ గల పోలీసు అధికారిగా విశాల్ పరిచమయ్యారు. ”మీ లాంటి వాళ్ళని చేతికి లాఠీ ఇచ్చి కొట్టమంటే..  అది మాకు పై అధికారులు ఇచ్చే ఆర్డర్ కాదురా.. ఆఫర్” అని విశాల్ చెప్పిన డైలాగ్ తన పాత్రలోని ఇంటెన్స్ ని తెలియజేస్తోంది. నిజాయితీగా నిర్వహించే తన కర్తవ్యం.. అతనికి కష్టాలను తెచ్చిపెడుతుంది.

సునైనా విశాల్ భార్యగా నటించింది. ట్రైలర్ లో రొమాంటిక్ పార్ట్ కూడా చూపించారు. వీరికి 10 ఏళ్ల బాబు కూడా వున్నాడు. ట్రైలర్   సినిమాలోని అన్ని అంశాలను చూపించింది. అయితే యాక్షన్ పార్ట్ మన దృష్టిని ఆకర్షిస్తుంది. నిర్మాణంలో ఉన్న భవనంలో భారీ స్టంట్ సన్నివేశాలు మైండ్ బ్లోయింగ్ గా వున్నాయి.

విశాల్ ఇంటెన్స్ రోల్ లో కనిపించగా..  సునైనా కూల్‌ క్యారెక్టర్ లో కనిపించింది. బాలసుబ్రమణియన్ వండర్ ఫుల్ ఫ్రేమ్‌లు, యువన్ శంకర్ రాజా అద్భుతమైన బిజియం  ట్రైలర్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ట్రైలర్‌ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

డిసెంబర్ 22న ‘లాఠీ’ అన్ని భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

తారాగణం: విశాల్, సునైనా

సాంకేతిక విభాగం:

దర్శకత్వం: ఎ వినోద్ కుమార్

నిర్మాతలు: రమణ, నంద

బ్యానర్: రానా ప్రొడక్షన్స్

రచన: పొన్ పార్థిబన్

సంగీతం: యువన్ శంకర్ రాజా

డీపీవో: బాలసుబ్రమణియన్

స్టంట్స్: పీటర్ హెయిన్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బాల గోపి

పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ…

7 hours ago

ఫిబ్రవరి 6, 2026న‌ ‘యుఫోరియా’ గ్రాండ్ రిలీజ్‌

బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమ‌తి రాగిణి గుణ స‌మ‌ర్ప‌ణ‌లో గుణ…

4 days ago

కోయంబత్తూరులోని ఈ యోగ కేంద్రం వద్దనున్న లింగ భైరవి సన్నిధిలో, పవిత్రమైన ‘భూత శుద్ధి వివాహం’ చేసుకున్న సమంత ప్రభు, రాజ్ నిడిమోరు

ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…

4 days ago

తల్లి చేతుల మీదుగా అవార్డులను అందుకున్న మధుర క్షణాల్ని గుర్తు చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్

సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…

3 weeks ago

“రాజు వెడ్స్ రాంబాయి” మీ హృదయాన్ని తాకే అందమైన ప్రేమ కథ – ట్రైలర్ లాంఛ్ లో హీరో అడివి శేష్

అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…

3 weeks ago

‘దేవగుడి’ రియల్ స్టోరి.. కచ్చితంగా పెద్ద సక్సెస్ అవుతుంది – టీజర్ లాంచ్ వేడుకలో హీరో శ్రీకాంత్

కంటెంట్‌ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…

3 weeks ago