‘వర్జిన్ బాయ్స్’ టీజర్ రిలీజై, యూత్‌లో హాట్ టాపిక్‌గా మారింది! గీతానంద్, మిత్రా శర్మ హీరో హీరోయిన్లుగా, శ్రీహాన్, రోనీత్, జెన్నిఫర్, అన్షుల, సుజిత్ కుమార్, అభిలాష్‌లతో రూపొందిన ఈ రొమాంటిక్ కామెడీ, దయానంద్ దర్శకత్వంలో రాజా దరపునేని నిర్మాణంలో రాజ్‌గురు ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కింది.
తాజాగా విడుదల అయిన టీజర్‌లో యూత్‌ఫుల్ వైబ్స్, కలర్‌ఫుల్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి.స్మరణ్ సాయి సంగీతం టీజర్‌కు జోష్‌ని జోడించగా, వెంకట ప్రసాద్ సినిమాటోగ్రఫీ ఫ్రెష్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తోంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ టీజర్‌ను క్రిస్పీగా మలిచింది. టీజర్‌లో గీతానంద్, మిత్రా శర్మ కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. హాస్యం, రొమాన్స్, ఎమోషన్స్‌తో కూడిన ఈ కథ, ఆధునిక రిలేషన్‌షిప్స్‌ను తమదైన స్టైల్‌లో చూపించనుందని తెలుస్తోంది. బిగ్ బాస్ ఫేమ్ శ్రీహన్ క్యారెక్టర్ & కామెడీ టైమింగ్ కి రెస్పాన్స్ బాగా వస్తుంది. చిత్రంలో శ్రీహన్ నుండి మరింత కామెడీని ఆశించవచ్చు అనిపిస్తుంది. టీజర్‌లోని డైలాగ్స్, సీన్స్ ఫన్ ఎలిమెంట్స్‌ను హైలైట్ చేస్తున్నాయి. ఈ సమ్మర్‌లో ‘వర్జిన్ బాయ్స్’ యూత్‌ను థియేటర్స్‌కు రప్పించే ఫుల్ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది. ఈ సినిమా కచ్చితంగా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
నిర్మాత రాజా దరపునేని మాట్లాడుతూ.. “ఈ సినిమా యూత్ కి కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దాం అన్నారు. గతంలో ఎన్నో మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లు వచ్చాయి. కానీ వాటిని మైమరిపించేలా ఈ సినిమా ఉంటుందని అన్నారు. రొటీన్ కి భిన్నంగా ఈ సినిమా ఉంటుందన్నారు.ఈ సినిమా కచ్చితంగా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాను” అన్నారు.
ఆర్టిస్టులు : గీతానంద్, మిత్రా శర్మ, శ్రీహన్, రోనీత్, జెన్నీఫర్, అన్షుల, సుజిత్ కుమార్, బబ్లు, అభిలాష్
డైరెక్టర్: దయానంద్
ప్రొడ్యూసర్ : రాజా దరపునేని
బ్యానర్ : రాజ్ గురు ఫిలిమ్స్
మ్యూజిక్ డైరెక్టర్: స్మరణ్ సాయి
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
డీఓపి : వెంకట ప్రసాద్
పిఆర్ఓ : మధు విఆర్
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్‌బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…