ఆహా ఓ టి టి లో 56 లక్షల వాచ్ మినిట్స్ తో “విరాజి” చిత్రం

Must Read

“విరాజి” సినిమాతో ఒక మంచి ప్రయత్నం చేసి ప్రేక్షకుల ప్రశంసలు దక్కించుకున్నారు హీరో వరుణ్ సందేశ్. ఈ చిత్రాన్ని మహా మూవీస్ తో కలిసి ఎం3 మీడియా బ్యానర్ పై మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మించగా ఆద్యంత హర్ష దర్శకుడిగా ప్రతిభ చాటుకున్నారు. ఈ నెల 2న థియేటర్స్ లోకి వచ్చిన “విరాజి” సినిమా నేటి నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు.

నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ – “విరాజి” సినిమాను ఈ నెల 2న థియేట్రికల్ రిలీజ్ చేశాం. ఆ వారం చాలా సినిమాలు ఉండటం వల్ల ఎక్కువమంది ఆడియెన్స్ కు మా మూవీ రీచ్ కాలేకపోయింది. అందుకే వీలైనంత త్వరగా ఓటీటీలోకి తీసుకురావాలని అనుకున్నాం. ఆహాలో మా సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే మా విరాజి చిత్రం 56 లక్షల వాచ్ మినిట్స్ తో ఆహా యాప్ లో ట్రెండింగ్ లో ఉంది. “విరాజి” సినిమా విషయంలో హీరో వరుణ్ సందేశ్ ఎంతో సపోర్ట్ చేశారు. ఏమాత్రం ఆటిట్యూడ్ లేని పర్సన్ మా హీరో. మంచి చిత్రం అందించిన మా దర్శకుడికి థాంక్స్” అని తెలిపారు

నటుడు వైవా రాఘవ మాట్లాడుతూ – “విరాజి” సినిమాను థియేటర్స్ లో ఆదరించిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాలో నేను చేసిన రోల్ కు మంచి గుర్తింపు దక్కింది. ఆహాలో మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకి ధన్యవాదాలు” అన్నారు.

నటుడు కాకినాడ నాని మాట్లాడుతూ – “విరాజి” సినిమాలో మంచి క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఆద్యంత్ హర్ష, నిర్మాత మహేంద్ర నాథ్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా కోసం వరుణ్ సందేశ్ గారు ఎంతో కష్టపడ్డారు. ప్రమోషన్స్ లో కూడా బాగా పార్టిసిపేట్ చేశారు. థియేటర్స్ లో చూడలేకపోయిన వారు ఆహా ఓటీటీలో మా “విరాజి” సినిమాను చూస్తున్నారు అని తన సంతోషాన్ని వ్యక్తం చేసారు.

హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ – మా “విరాజి” సినిమా ఆహా ఓటీటీలోకి వచ్చింది. 56 లక్షల వాచ్ మినిట్స్ తో ట్రేండింగ్ లో ఉంది. చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ రోజు మా ప్రొడ్యూసర్ మహేంద్రనాథ్ గారి పుట్టినరోజు. సో ఇది ఆయనకు బర్త్ డే గిఫ్ట్ అనుకుంటున్నా. మహేంద్రనాథ్ గారు మా మూవీని అభిరుచితో నిర్మించడమే కాకుండా బాగా ప్రమోట్ చేసి ఆడియెన్స్ దగ్గరకు తీసుకెళ్లారు. ఒక మంచి పాయింట్ తో డైరెక్టర్ ఆద్యంత్ హర్ష “విరాజి” సినిమాను అందరికీ నచ్చేలా రూపొందించారు. అయితే ఆగస్టు 2న థియేటర్స్ మేము అనుకున్నంత స్థాయిలో దొరకలేదు. థియేటర్స్ అందుబాటులో లేక చాలామంది చూడలేకపోయారు. ఇప్పుడు ఆహా ద్వారా అందరు చూస్తున్నారు” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

నటీనటులు – వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణదేవి, కుషాలిని పులప, ప్రసాద్ బెహరా, తదితరులు

టెక్నికల్ టీమ్

మేకప్ చీఫ్ – భానుప్రియ అడ్డగిరి
కాస్ట్యూమ్ డిజైనర్ – రోజా భాస్కర్
ఎడిటర్ – రామ్ తూము
సినిమాటోగ్రఫీ – జి.వి అజయ్ కుమార్
మ్యూజిక్ – ఎబినెజర్ పాల్ (ఎబీ)
వీఎఫ్ఎక్స్ – అఖిల్
ప్రాజెక్ట్ హెడ్ – సుకుమార్ కిన్నెర
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ – మల్లికార్జున్ కిన్నెర
పీఆర్ఓ – పవన్ పాల్
డిజిటల్ మార్కెటింగ్- ఎస్3 డిజిటల్ మీడియా
నిర్మాత – మహేంద్ర నాథ్ కూండ్ల
దర్శకత్వం – ఆద్యంత్ హర్ష

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News