విజయ్‌ శంకర్ ఫోకస్ సినిమా సమీక్ష

నటీనటులు: విజయ్‌ శంకర్, అషు రెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్, జీవా, షియాజీ షిండే, భరత్‌ రెడ్డి, రఘు బాబు, సూర్య భగవాన్‌ తదితరులు దర్శకత్వం: జీ సూర్యతేజ నిర్మాత‌: వీర‌భ‌ద్ర‌రావు ప‌రిస‌ సమర్ఫణ: స్కైరా క్రియేష‌న్స్‌ ఎడిటర్‌: సత్య జీ డీవోపీ: జే ప్రభాకర్‌రెడ్డి సంగీతం: వినోద్‌ యజమాన్య గేయ రచయిత: కాస‌ర్ల శ్యాం బ్యానర్: రిలాక్స్‌ మూవీ మేకర్స్ రిలీజ్ డేట్: 2022-10-28

క‌థ‌: పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) వివేక్ వర్మ (భానుచందర్), న్యాయమూర్తి ప్రమోదా దేవి (సుహాసిని మణిరత్నం) అనోన్య దంపతులు. దాంపత్య జీవితం ఆనందంగా సాగుతున్న సమయంలో వివేక్ వర్మ దారుణ హత్యకు గురవుతాడు. అనుమానాస్పద రీతిలో మరణించడంతో ఎస్సై విజయ్ శంకర్ (విజయ్ శంకర్) దర్యాప్తు చేపడుతాడు. అనేక మలుపు తిరుగుతున్న వివేక్ వర్మ హత్య కేసు దర్యాప్తును టేకప్ చేయడానికి ప్రేమ (అషురెడ్డి) రంగంలోకి దిగుతుంది. వివేక్ వర్మ ఎలా హత్యకు గురయ్యాడు. హత్య కేసు తర్వాత ప్రమోదా దేవి పరిస్థితి ఏమిటి? వివేక్ వర్మ హత్య కేసు దర్యాప్తు ఎందుకు క్రిటికల్‌గా మారింది? దర్యాప్తులో ఎస్సై విజయ్ శంకర్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? విజయ్ శంకర్‌ను తప్పించి.. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ప్రేమ ఎందుకు కేసును టేకప్ చేయాలని ప్రయత్నించింది? చివరకు వివేక్ వర్మను ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారనే ప్రశ్నలకు సమాధానమే ఫోకస్ సినిమా కథ.

దర్శకుడిగా తన తొలి సినిమానే మర్డర్‌ మిస్టరీ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకుని దర్శకుడు సూర్య పెద్ద సాహసమే చేశాడని చెప్పవచ్చు. ఈ సినిమాకు ప్రధాన బలం కథ. ఇందులోని ట్విస్ట్‌లు. కథను బోర్‌ కొట్టకుండా దర్శకుడు ఎప్పటికప్పుడు టర్నింగ్‌పాయింట్స్‌తో ఆడియన్స్‌కు ఆసక్తిని రేకేత్తించాడు. ఎలాంటి సాగదీత లేకుండా నేరుగా ఫోకస్ సినిమా కథలోకి తీసుకెళ్లాడు. అయితే ఫస్టాఫ్‌లోప్రేక్షకుడిని గందరగోళానికి గురి చేసే విధంగా రకరకాల ట్విస్టులతో కథను ముందుకు తీసుకెళ్లాడు. ఇక రెండో భాగంలో దర్శకుడు సూర్యతేజ సరైన గాడిలో పడి.. సినిమాను మంచి కథనం, ట్విస్టులతో కథను పరుగులు పెట్టించాడు. ప్రీ క్లైమాక్స్‌లో ఎవరూ ఊహించని ట్విస్టుతో కథను మరింత ఆసక్తికరంగా మలిచాడు. సుహాసిని మణిరత్నం, భాను చందర్ పాత్రలను భావోద్వేగంగా మార్చి ప్రేక్ష‌కుల‌తో కంట‌త‌డిపెట్టించాడు.

న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే పోలీసాఫీసర్‌గా విజయ్‌ శంకర్‌ లుక్స్, బాడీ లాంగ్వేజ్‌ డైలాగ్‌ డెలివరీ బాగున్నాయి. కొన్ని సీన్స్‌లో విజయ్‌ భావోద్వేగాలు స్టార్ హీరోని గుర్తు చేశాయి. సెకండాఫ్‌లో విజయ్‌ శంకర్‌ కేసును సాల్వ్ చేసిన తీరు ఆడియన్స్‌కు త‌ప్ప‌క క‌నెక్ట్ అవుతుంది. ఇక బిగ్‌బాస్‌ ఫేమ్‌ ఆషు రెడ్డి వచ్చిన తర్వాత కథలో మరింత వేగం పెరుగుతుంది. ఇక వివేక్‌ వర్మగా భానుచందర్, జడ్జిగా ప్రమోదా దేవి ఈ సినిమా మెయిన్‌ పిల్లర్స్‌లా నిలబడ్డారు. డీపీసీ ఇంద్రజిత్‌ పట్నాయక్‌గా షాయాజీ షిండే తమపాత్రల పరిధి మేరకు బాగా నటించారు. నటుడు సూర్యభగ వాన్, భరత్‌రెడ్డి (కథలో హుస్సేన్‌)కు ఓ మంచి రోల్స్‌ దక్కాయి. ఫైనల్‌గా క్లైమాక్స్‌ వివేక్‌ వర్మను ఎవరు హత్య చేశారు? అనే ట్విస్ట్‌ను దర్శకుడు రివిల్‌ చేసినప్పుడు ఆడియన్స్‌ థ్రిల్‌ అవుతారు. స్క్రీన్‌ ప్లే ఉత్కంఠతతో సాగుతుండ టంతో ఫైట్స్, పాటలు లేవనే వెలితిని ఆడియన్స్‌ ఫీలయ్యే చాన్స్‌ లేదు. కథ థ్రిల్లర్‌ కాబట్టి కామెడీకి పెద్ద గా స్కోప్ లేదు. పైగా సినిమా నిడివి కూడా రెండు గంటలే కావడం మరో ఫ్లస్‌పాయింట్‌.సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. ప్రభాకర్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫి బాగుంది.

పలు సన్నివేశాలు బాగా ఎలివేట్ అయ్యాయి. వినోద్ అందించిన బీజీఎం సినిమాను నెక్ట్ లెవ‌ల్‌కి తీసుకెళ్లింది. రిలాక్స్‌ మూవీ మేకర్స్ పై వీర‌భ‌ద్ర‌రావు ప‌రిస‌ అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. నిర్మాత‌గా మొద‌టి సినిమాకే అంత భారీ ప్యాడింగ్ ని తీసుకోవ‌డం నిజంగా అభినందిచాల్సిన విష‌యం. పెట్టిన ప్ర‌తి పైసా స్క్రీన్ మీద కనిపిస్తుంది.మర్డరీ మిస్టరీతో న్యూఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఫోకస్ సినిమా రూపొందింది. సుహాసిని, భానుచందర్ ఫెర్ఫార్మెన్స్ సినిమాకు బలంగా మారాయి. కథ, కథనాలపై మరికొంత క‌సరత్తు చేసి ఉంటే.. క్రైమ్ థ్రిల్లర్స్‌లో వ‌న్ఆఫ్ బెస్ట్‌ సినిమా అయి ఉండేది. అయితే క్రైమ్, మర్డర్, సస్పెన్స్ థ్రిల్లర్స్, మిస్టరీ అంశాలను నచ్చే ప్రేక్షకులను ఈ సినిమా త‌ప్ప‌కుండా మెప్పిస్తుంది.

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

1 week ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

1 week ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

1 week ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

1 week ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

1 week ago