“రౌడీ జనార్థన” మూవీ నుంచి హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

Must Read

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ “రౌడీ జనార్థన”. స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “రౌడీ జనార్థన” సినిమా రూపొందుతోంది.

ఈ రోజు హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు “రౌడీ జనార్థన” మూవీ మేకర్స్. ఈ బర్త్ డే పోస్టర్ లో వర్షంలో తడుస్తూ చేతిలో పిస్టల్ తో ఉన్న విజయ్ స్టిల్ ఆకట్టుకుంటోంది. ఆయన ఛాతీపై హీరోయిన్ కీర్తి సురేష్ కాలు పెట్టినట్లు చూపించడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ పోస్టర్ యాక్షన్ తో పాటు రొమాంటిక్ యాంగిల్ ను ఎస్టాబ్లిష్ చేస్తోంది. “రౌడీ జనార్థన” సినిమాను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు రౌడీ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ డిసెంబర్ లో ఈ సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

నటీనటులు – విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్, తదితరులు

టెక్నికల్ టీమ్

ప్రొడక్షన్ డిజైనర్ – డినో శంకర్
డీవోపీ – ఆనంద్ సి చంద్రన్
బ్యానర్ – శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
ప్రొడ్యూసర్స్ – దిల్ రాజు, శిరీష్
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
స్టోరీ డైరెక్షన్ – రవికిరణ్ కోలా

Latest News

సునీల్, అఖిల్ ఉడ్డెమారిల సైకాలజికల్ థ్రిల్లర్ ‘ఫైట్ మహా’ ట్రైలర్ రిలీజ్ – సినిమా ఆగస్టు 21న వరల్డ్‌వైడ్ రిలీజ్

సునీల్, అఖిల్ ఉడ్డెమారి, ప్రదాన పాత్రల్లో డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఫైట్ మహా". కలలు...

More News