‘ఖుషి’ నుంచి ‘ఆరాధ్య’ పాట విడుదల

Must Read

డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న చిత్రం ఖుషి. ఇప్పటికే ఈ సినిమా మీద మంచి హైప్ ఏర్పడింది. ఫస్ట్ సింగిల్ నా రోజా నువ్వే అంటూ ప్రేమికులందరినీ కట్టిపడేశారు మేకర్లు. ఇప్పుడు ఈ చిత్రం నుంచి రెండో పాటను రిలీజ్ చేశారు. ఆరాధ్య అంటూ సాగే ఈ పాట ఇప్పుడు ప్రేమికుల గీతంగా నిలిచిపోయేలా ఉంది.

ఆరాధ్య అంటూ సాగే ఈ పాటను శివ నిర్వాణ తెలుగులో రాయగా.. తమిళంలో మదన్ కార్కీ సాహిత్యాన్ని అందించాడు. తెలుగు, తమిళంలో సిధ్ శ్రీరామ్, చిన్మయి ఆలపించారు. హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన బాణీ శ్రోతలకు వినసొంపుగా ఉంది. ఈ పాటలో సమంత, విజయ్ కెమిస్ట్రీ మరింతగా హైలెట్ అవుతోంది. మరీ ముఖ్యంగా ఈ పాటలో శివ నిర్వాణ కొరియోగ్రఫీ అందరినీ ఆకట్టుకుంటుంది.

Aradhya - Lyrical | Kushi | Vijay Deverakonda, Samantha | Hesham Abdul Wahab| Sid Sriram | Chinmayi

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రతీ అప్డేట్‌ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఈ పాటకు మ్యూజిక్ లవర్స్ అంతా ఫిదా కానున్నారు. ఇప్పటికే ‘నా రోజా నువ్వే’ అనే పాట యూట్యూబ్‌లో వంద మిలియన్లకు చేరువలో ఉంది. ఇప్పుడు ఈ సెకండ్ సింగిల్‌ ‘ఆరాధ్య’తో మరో సారి ‘ఖుషి’ సినిమా ట్రెండ్ అవ్వడం ఖాయం. చార్ట్ బస్టర్ లిస్ట్‌లో ఆరాధ్య పాట కూడా చేరనుంది. సెప్టెంబర్ 1న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, మళయాల, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతోన్నారు.

నటీనటులు:
విజయ్ దేవరకొండ, సమంత, జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు.

టెక్నికల్ టీమ్:

మేకప్ : బాషా
కాస్ట్యూమ్ డిజైనర్స్ : రాజేష్, హర్మన్ కౌర్, పల్లవి సింగ్
ఆర్ట్ : ఉత్తర కుమార్, చంద్రిక
ఫైట్స్ : పీటర్ హెయిన్
రచనా సహకారం : నరేష్ బాబు.పి
పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా
పబ్లిసిటీ : బాబ సాయి
మార్కెటింగ్ : ఫస్ట్ షో
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : దినేష్ నరసింహన్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ప్రొడక్షన్ డిజైనర్ : జయశ్రీ లక్ష్మీనారాయణన్
మ్యూజిక్ డైరెక్టర్ : హిషామ్ అబ్దుల్ వాహబ్
డి.ఐ, సౌండ్ మిక్స్ ః అన్నపూర్ణ స్టూడియోస్, విఎఫ్ఎక్స్ మాట్రిక్స్
సి.ఇ.ఓ : చెర్రీ
డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : జి.మురళి
నిర్మాతలు : నవీన్ యేర్నేని,రవిశంకర్ యలమంచిలి
కొరియోగ్రఫీ : శివ నిర్వాణ
కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శివ నిర్వాణ.

Latest News

వి.వి.వినాయక్ చేతుల మీదుగా “బరాబర్ ప్రేమిస్తా” మూవీ టీజర్ రిలీజ్

ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటిస్తున్న కొత్త సినిమా "బరాబర్ ప్రేమిస్తా ". ఈ చిత్రానికి సంపత్ రుద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను కాకర్ల సత్యనారాయణ...

More News