పటాన్ చెరు ఎమ్.ఎల్.ఎ గూడెం మహీపాల్ రెడ్డి
కన్నడలో ఘన విజయం సాధించిన తారకాసుర చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువాదం చేస్తూనే… ఆ చిత్రానికి సీక్వెల్ గా స్ట్రెయిట్ తెలుగు చిత్రానికి శ్రీకారం చుట్టారు బహుముఖ ప్రతిభాశాలి విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం. శ్రీజ మూవీస్ పతాకంపై తనే దర్శకుడిగా, ముఖ్య పాత్రధారిగా నిర్మాతగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న “తారకాసుర -2” చిత్రం పటాన్ చెరులోని జైపాల్ ముదిరాజ్ ఫామ్ హౌస్ లో ఘనంగా ప్రారంభమైంది!!
పూజా కార్యక్రమాలనంతరం ముఖ్య పాత్రధారి విజయ్ భాస్కర్ రెడ్డిపై పటాన్ చెరు ఎమ్.ఎల్.ఎ.మహీపాల్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేయగా… జైపాల్ ముదిరాజ్ క్లాప్ కొట్టారు. పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గౌరవ దర్శకత్వం వహించారు. ప్రఖ్యాత కార్టూనిస్ట్ మల్లిక్, సీనియర్ నటులు హేమ సుందర్ తదితరులు అతిధులుగా పాల్గొన్నారు!!
“తారకాసుర సిరీస్”తో విజయ్ భాస్కర్ రెడ్డి పేరు చిత్ర పరిశ్రమలో మారుమ్రోగాలని అతిథులు ఆకాంక్షించారు. టెన్నిస్ ప్లేయర్ గా, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా, ఒక బ్యాంక్ వ్యవస్థాపకునిగా విజయ్ భాస్కర్ రెడ్డిని వరించిన విజయాలు సినిమా రంగంలోనూ వరించాలని వారు అభిలషించారు. ఇకపై తమ “శ్రీజ మూవీస్” బ్యానర్ పై వరుసగా చిత్రాలు నిర్మిస్తానని దర్శకనిర్మాత విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం పేర్కొన్నారు. “తారకాసుర-2” చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడిస్తామని ఆయన తెలిపారు!!
ధనుష్, కృతి సనన్ సూపర్బ్ కెమిస్ట్రీతో ఆకట్టుకుంటోన్న ‘అమరకావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైలర్.. హిందీతో పాటు తమిళ, తెలుగులోనూ…
బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ గుణ శేఖర్ రూపొందిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘యుఫోరియా’. శ్రీమతి రాగిణి గుణ సమర్పణలో గుణ…
ప్రముఖ నటి సమంత రూత్ ప్రభు మరియు చలనచిత్ర నిర్మాత, దర్శకుడు రాజ్ నిడిమోరు సోమవారం ఉదయం కోయంబత్తూరులోని ఈశా…
సుప్రీం హీరో సాయి దుర్ఘ తేజ్ తాజాగా వేసిన పోస్ట్ గమనిస్తే తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో మరోసారి…
అఖిల్, తేజస్విని జంటగా నటిస్తున్న సినిమా "రాజు వెడ్స్ రాంబాయి". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్స్ ప్రొడక్షన్ ప్రేక్షకుల…
కంటెంట్ను నమ్ముకుని చెబుతున్నా.. ‘దేవగుడి’తో సక్సెస్ కొడుతున్నాం - నిర్మాత బెల్లం రామకృష్ణా రెడ్డి పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్…