నటుడిగా, దర్శకుడిగా, లిరిసిస్ట్‌గా, సంగీత దర్శకుడిగా తన సత్తాను చాటుకున్నారు విజయ్ ఆంటోని. మల్టీ టాలెంటెడ్ అయిన విజయ్ ఆంటోనీ డిటెక్టివ్ ఫిక్షన్ ప్రపంచంలోకి అందరినీ తీసుకెళ్లేందుకు గ్రిప్పింగ్ మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతున్నారు. విజయ్ ఆంటోని ఫిలింస్ కార్పొరేషన్ బ్యానర్‌పై మీరా విజయ్ ఆంటోని సగర్వంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి లియో జాన్ పాల్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ టైటిల్‌ను తాజాగా రివీల్ చేశారు. ‘గగన మార్గన్’ అంటూ రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.
ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విజయ్ ఆంటోని రెండు రకాలుగా కనిపించారు. గాయపడి ఇంటెన్స్ లుక్‌లో కనిపించిన విజయ్ లుక్ కొత్తగా ఉంటే.. నీటి అడుగు బాగాన ఉన్న వ్యక్తి పోస్టర్ కూడా ఇందులో కనిపిస్తోంది.
“అట్టకత్తి”, “బీడ”, “సూదు కవ్వుం”, “ఇంద్రు నేత్ర నాళై”, “తేకడి”, “ముండాసుపట్టి”, “కదలుం కాదందు పోగుం”, “ఏ1”, “మాయవన్” వంటి చిత్రాలకు ఎడిటర్‌గా పేరు తెచ్చుకున్న లియో జాన్ పాల్.. ‘గగన మార్గన్’తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. లియో జాన్ పాల్ 2013లో “ఇదర్‌కుతానే ఆసైపట్టై బాలకుమార” చిత్రానికి ఉత్తమ ఎడిటర్‌గా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నారు.
ఈ చిత్రంలో సముద్రఖని, మహానది శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ వంటి వారు నటించారు.
యువ ఎస్ సినిమాటోగ్రాఫర్‌గా, రాజా ఆర్ట్ డైరెక్టర్‌గా, విజయ్ ఆంటోని మ్యూజిక్ కంపోజర్‌గా పని చేశారు. ముఖ్యంగా ఈ చిత్రానికి ముంబైలో చిత్రీకరించిన నీటి అడుగున సన్నివేశాలు, విజువల్ ఎఫెక్ట్స్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి.
‘గగన మార్గన్’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
తారాగణం: విజయ్ ఆంటోని, సముద్రఖని, మహానది శంకర్, ప్రితిక, బ్రిగిడా, వినోద్ సాగర్, అజయ్ ధీషన్, దీప్శిఖ, కలక్క పోవదు యారు అర్చన, కనిమొళి, అంతగారం నటరాజన్ తదితరులు
సాంకేతిక సిబ్బంది
రచయిత, దర్శకుడు : లియో జాన్ పాల్
నిర్మాత : విజయ్ ఆంటోని ఫిల్మ్స్ కార్పొరేషన్
సమర్పణ: మీరా విజయ్ ఆంటోని
సంగీతం : విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫీ : యువ ఎస్
ఆర్ట్ డైరెక్టర్: రాజా ఎ
PRO : సాయి సతీష్
వెరీ ట్యాలెంటెడ్ ఆది సాయికుమార్ హీరోగా యశ్వంత్ దర్శకత్వంలో శ్రీ పినాక మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ జూలూరు…
భారత్ కల్చరల్ అకాడమీ తెలుగు టెలివిజన్ రచయిత సంఘం ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు నాగబాల సురేష్ కుమార్ సారధ్యంలో…
Q: How do you manage so many projects and handle them efficiently? At one time,…
పరిచయం:2004లో సద్గురు ప్రారంభించిన ఈశా గ్రామోత్సవం, గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని పునరుజ్జీవింప జేయడానికి ఉద్దేశించినది. దీనితోబాటు సామాజిక స్పృహ, సంప్రదాయాలు…
Isha Gramotsavam , launched by Sadhguru in 2004, holds immense significance in today's fast-paced world,…
మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్‌గానే ‘పుష్ప 2’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనుల్ని…