డిఫరెంట్ కాన్సెప్ట్, కంటెంట్ బేస్డ్ చిత్రాలతో ఆకట్టుకునే విజయ్ ఆంటోని ప్రస్తుతం ‘నాన్న కుట్టి’ అంటూ ఆడియెన్స్ ముందుకు రానున్నారు. ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో ము. మారన్ దర్శకత్వంలో విజయ్ ఆంటోనీ హీరోగా చేస్తున్న చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, ఇంటెన్స్ డ్రామాగా ఈ మూవీని రూపొందిస్తున్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ మీద మీరా విజయ్ ఆంటోని నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ అధినేత రామంజనేయులు జవ్వాజీ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. దీపావళి సందర్భంగా ఈ మూవీని నవంబర్ 6న విడుదల చేయబోతోన్నారు. దీపావళి సెలవులు కలిసి వచ్చేలా ఈ మూవీ రిలీజ్‌ని ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లను గమనిస్తే.. ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌ని ప్రధానంగా చూపించబోతోన్నారని అర్థం అవుతోంది.
ఈ చిత్రంలో ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు.
రాజీవ్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేయగా, విజయ్ ఆంటోనీ సంగీతం అందించడంతో పాటు ఎడిటర్‌గా కూడా వ్యవహరించారు. ఎ. రాజా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వర్తించారు.
యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్, భావోద్వేగ కథనం, హృద్యమైన సంగీతం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ‘నాన్న కుట్టి’ చిత్రం రానుంది. నవంబర్ 6న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
తారాగణం : విజయ్ ఆంటోని, ప్రీతి అస్రాని, లిథన్య, భగవతి పెరుమాళ్, హరిప్రియ ఇసై, అరువి మధన్, చిత్ర లక్ష్మణన్, శ్రీజ రవి, వెట్టై ముత్తుకుమార్, జెన్సన్ దివాకర్, మురుగానందం, మున్నార్ రమేష్, లిస్సీ ఆంటోని, కుమార్ నటరాజన్, విజయన్, ప్రవీణ, హరిత, హరిప్రియ తదితరులు
సాంకేతిక సిబ్బంది:
రచయిత & దర్శకుడు: ము. మారన్
నిర్మాత: మీరా విజయ్ ఆంటోని
సహ నిర్మాత: సర్వంత్ రామ్ క్రియేషన్స్ (రామాంజనేయులు జవ్వాజి)
సంగీతం: విజయ్ ఆంటోని
సినిమాటోగ్రఫీ: రాజీవ్ రాజేంద్రన్
ఎడిటర్: విజయ్ ఆంటోని
ప్రొడక్షన్ డిజైనర్: ఎ రాజా
కాస్ట్యూమ్స్: జి అనూష మీనాక్షి
PRO: సాయి సతీష్
‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కలిసి మళ్లీ…
రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'అ' (‘AH) ’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది.…
ఈ నెల 9న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న "చకోర – Lunar Love Bird" మూవీ High Joy…
▪️ అక్టోబర్ 11న జరగాల్సిన ఎన్నికలపై స్టే▪️ 2027 డిసెంబర్ 6 వరకు ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం ఉందని సుమలతా…
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం…
నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమాను తెలుగులో సప్తసాగరాలు సప్తగిరులు పేరుతో డబ్ చేసి…