షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న ‘కరికాల’ చిత్రంలో సందీప్ కిషన్‌కి జంటగా నటించనున్న కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్.

‘శంబాల’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు దర్శకుడు యుగంధర్ ముని కలిసి మళ్లీ ఓ విజువల్ వండర్‌ను క్రియేట్ చేయబోతోన్నారు. సందీప్ కిషన్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మాణంలో యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న చిత్రం ‘కరికాల’. ఈ మూవీని రెండు చాప్టర్‌లుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి చాప్టర్‌ 2027 జూలై 2న , రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న విడుదల కాబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పటి వరకు వచ్చిన పోస్టర్‌లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. సోషియో ఫాంటసీ, విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సందీప్ కిషన్‌కి జోడిగా కేథరిన్ థ్రెసా నటించనున్నారు. ఈ మేరకు హీరోయిన్‌కి వెల్కమ్ చెప్తూ చిత్రయూనిట్ ఓ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది. సందీప్ కిషన్, కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్ తెరపై మొదటి సారిగా కలిసి కనిపించబోతోన్నారు. ఇక ఈ చిత్రంలో కేథరిన్ థ్రెసా అలెగ్జాండర్ ఓ డిఫరెంట్ రోల్‌ను పోషించబోతోన్నట్టుగా తెలుస్తోంది. వెల్కమ్ ఆన్ బోర్డ్ అంటూ ‘కరికాల’ టీం స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, అత్యద్భుతమైన కథనంతో ‘కరికాల’ పాన్ ఇండియన్ సినిమాగా రాబోతోంది. భారతీయ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సోషియో-ఫాంటసీ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా ‘కరికాల’ టీం పని చేస్తోంది. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

TFJA

Recent Posts

‘అ’ మిస్టిరీయస్‌ ఇంట్రెస్టింగ్‌ ఇన్విస్టిగేషన్‌ థ్రిల్లర్‌గా అందర్ని థ్రిల్ల్‌ చేస్తుంది: హీరో రాహుల్‌ విజయ్‌.

రాహుల్ విజయ్, ఆర్చన అయ్యర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'అ' (‘AH) ’ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది.…

2 hours ago

ఘనంగా “చకోర – Lunar Love Bird” సినిమా స్పెషల్ ప్రివ్యూ, ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

ఈ నెల 9న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతున్న "చకోర – Lunar Love Bird" మూవీ High Joy…

1 day ago

డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలకు హైకోర్టు బ్రేక్!

▪️ అక్టోబర్ 11న జరగాల్సిన ఎన్నికలపై స్టే▪️ 2027 డిసెంబర్ 6 వరకు ప్రస్తుత కార్యవర్గం పదవీకాలం ఉందని సుమలతా…

1 day ago

ప్రపంచ వ్యాప్తంగా రూ. 150 కోట్లు కొల్లగొట్టిన ‘మండాడి’.. సూరి, సుహాస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్

సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్‌మెంట్ బ్యానర్ మీద మతిమారన్ పుగళేంది తెరకెక్కించిన చిత్రం…

3 days ago

సూరి & నివిన్ పులె నటించిన సప్తసాగరాలు సప్తగిరులు అక్టోబర్ 9న థియేటర్స్ లో విడుదల !!!

నివిన్ పౌలీ, సూరి, అంజలి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమాను తెలుగులో సప్తసాగరాలు సప్తగిరులు పేరుతో డబ్ చేసి…

3 days ago

డిఫరెంట్ థ్రిల్లర్ గా “మయూఖ” ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది – డైరెక్టర్ శ్రీ తేజ్ ఎస్.కె

పాయల్ చెంగప్ప ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా "మయూఖ".ఈ చిత్రాన్ని శ్రీ తేజ్ ఎస్.కె. దర్శకత్వం వహిస్తున్నారు, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్…

3 days ago