విజయ్ ఆంటోనీ యాక్షన్ థ్రిల్లర్ “హిట్లర్” ట్రైలర్ రిలీజ్ఈ నెల 27న థియేట్రికల్ రిలీజ్

పలు వైవిధ్యమైన చిత్రాలతో సౌత్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్న హీరో విజయ్ ఆంటోనీ తన కొత్త సినిమా “హిట్లర్”తో తెరపైకి రాబోతున్నాడు. విజయ్ ఆంటోనీతో గతంలో “విజయ్ రాఘవన్” అనే మూవీని నిర్మించిన చెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ తమ 7వ ప్రాజెక్ట్ గా “హిట్లర్” సినిమాను నిర్మిస్తోంది. డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. “హిట్లర్” సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ధన రూపొందిస్తున్నారు. “హిట్లర్” సినిమా ఈ నెల 27న హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

“హిట్లర్” ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – ఈ ప్రపంచంలో నిజమైన పవర్ అన్నది డబ్బు, అధికారం కాదు ఒక మనిషిని నమ్మి అతని వెనకున్న జనమే అనే పవర్ ఫుల్ డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. హీరో విజయ్ ఆంటోనీ డిఫరెంట్ గెటప్స్ లో ఎలాంటి ఆధారాలు దొరక్కుండా ముగ్గురిని కాల్చి చంపేస్తాడు. ఈ తెలివైన క్రిమినల్ కోసం పోలీసులు వేట సాగిస్తుంటారు. యాక్షన్ సీక్వెన్సులతో పాటు తన ప్రేయసితో హీరోకున్న రొమాంటిక్ లవ్ స్టోరీని ట్రైలర్ లో రివీల్ చేశారు.

దశాబ్దాలుగా రాజకీయ క్రీడలో ఆరితేరిన ఓ స్వార్థపూరిత నాయకుడి పాత్రలో చరణ్ రాజ్ కనిపిస్తారు. పొలిటికల్ డ్రామా, యాక్షన్, లవ్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ తో “హిట్లర్” ట్రైలర్ ఇంప్రెస్ చేస్తోంది. విజయ్ ఆంటోనీ పర్ ఫార్మెన్స్, రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ ట్రైలర్ కు హైలైట్స్ గా నిలుస్తున్నాయి. విజయ్ ఆంటోనీ కెరీర్ లో “హిట్లర్” మరో వైవిధ్యమైన చిత్రంగా ఉండబోతున్నట్లు ట్రైలర్ తో తెలుస్తోంది.

నటీనటులు- విజయ్ ఆంటోనీ, రియా సుమన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ తదితరులు

టెక్నికల్ టీమ్ –
సినిమాటోగ్రఫీ – ననీన్ కుమార్.ఐ
సంగీతం- వివేక్, మెర్విన్
ఆర్ట్ – సి. ఉదయ్ కుమార్
ఎడిటింగ్ – సంగతమిజాన్.ఇ
కొరియోగ్రఫీ – బృందా, లీలావతి
స్టంట్స్ – జి.మురళి
కాస్ట్యూమ్- అనుష.జి.
పీఆర్వో- జీఎస్ కే మీడియా
ప్రొడ్యూసర్స్ – డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్
రచన, దర్శకత్వం – ధన

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

3 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

3 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

3 days ago