ప్రామిసింగ్ కథానాయకుడు సుహాస్, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్ ఎంటర్‌టైనర్ ‘హే బల్‌వంత్’. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ శుక్రవారం ఈనెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల అభినందనలతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకపోతుంది. చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించి తన నటనతో థియేటర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న కమెడియన్ సుదర్శన్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలివి.
‘హే బల్‌వంత్‌లో సుదర్శన్ 2.0 అంటున్నారు?
సినిమాలో అంత మంచి క్యారెక్టర్ చేశాను. సినిమాకు చాలా క్రేజీ రెస్పాన్స్ వస్తోంది. నేను పోషించిన బంక పాత్రను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హిలేరియస్‌గా నవ్వుకుంటున్నారు. ఈ సినిమా ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉందని మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాలో పోషించిన పాత్రకు మంచి పేరొచ్చింది.
సినిమాల్లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది?
అమెరికాకు దారేది అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించాను. దానికి అనుకోకుండా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ షార్ట్‌ఫిల్మ్‌తో రన్‌రాజా రన్ ఆఫర్ వచ్చింది. ఆ తరువాత దోచెయ్, కుమారి 21ఎఫ్, పటాస్, సమాజవరగమన, నారీ నారీ నారి నడుమ మురారి, ఇప్పుడు హే బల్‌వంత్ సినిమాలు నన్ను ప్రేక్షకులకు చేరువ చేశాయి.
గత సినిమాలతో పోలీస్తే ఈసినిమాలో ఎక్కువగా మీ పంచ్‌లు బాగా పేలినట్టున్నాయి?
ఈ చిత్రంలో నా పాత్రకు ఇంపార్టెన్స్ వల్ల పాత్ర బాగా ఎలివేట్ అయ్యింది. డ్రింకింగ్ సీన్, వెన్నెల కిపోర్‌తో చేసిన ప్రకృతి చికిత్సాలయం సీన్స్‌కు థియేటర్స్‌కు ఊగిపోతున్నాయి. నా ప్రతి పంచ్‌తో పాటు సినిమాలో వెన్నెల కిషోర్, సుహాస్, నరేష్, సుహానీ అందరూ హిలేరియస్‌గా నవ్వించారు.
ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్ ఇంతగా ఆకట్టుకోవడానికి రీజన్ ఏమిటని అనుకుంటున్నారు?
ఈ సినిమాలో నటించిన అందరితో నాకు అందరితో మంచి ర్యాపో ఉంది. ప్రతి సీన్‌కు అందరం మంచి సింక్‌లో ఉన్నాం. అందరూ క్లోజ్‌నెస్‌తో ఫ్లోతో సీన్‌లు బాగా వచ్చాయి
మీకు హీరోగా ఆఫర్లు వస్తున్నాయని తెలిసింది?
నేను హీరోగా వెండితెరపై ఇప్పుడే చేయను. అనుకోకుండా సినీ పరిశ్రమకు వచ్చాం. కమెడియన్‌గా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాను. ఈ టైమ్‌లో రిస్క్ తీసుకోలేను. కమెడియన్‌గా నాకు అందరి హీరోలతో కలిసి సినిమాలు చేయాలని వుంది. నటుడిగా సెటిల్ అయిపోయిన తరువాత హీరోగా ఆలోచిద్దాం. ఒకవేళ హీరోగా చేస్తే చిన్న చిన్న కాన్సెప్ట్‌లతో చేసే ఓటీటీ సినిమాలు చేస్తాను.
ఇంతకు ముందు కమెడియన్స్ అంతా హీరోలుగా చేశారు కదా?
హాస్య నటులుగా తమకంటూ ఓ గుర్తింపు వచ్చిన తరువాత వాళ్లు హీరోలుగా చేశారు. నా కెరీర్ ఇప్పుడే ఊపందుకుంటోంది. ఈ సమయంలో అలాంటి ఆలోచన లేదు. ఒకవేళ నేను హీరోగా చేయాలంటే అది హీరోలు చేయలేని చిన్న చిన్న కాన్సెప్ట్‌లు చేయలేని సినిమాలు చేయాలి.
థియేటర్స్‌లో రిలీజ్ అయ్యే మెయిన్ లీడ్ సినిమాలు చేయాలని లేదు.
హీరోగా చేస్తే కమెడియన్‌గా అవకాశాలు తగ్గిపోతాయని అనుకుంటున్నారా?
ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే ఒక సినిమాలో హీరోగా చేసిన తరువాత మనకు వేరే సినిమాలో చిన్న చిన్న పాత్రలు ఇవ్వకూడదని, చిన్న పాత్రలు ఇస్తే బాగుండదని కొంత మంది భావించడంతో మనకు అవకాశాలు తగ్గిపోతాయి. ఇలా మనకు తెలియకుండానే కొన్ని మంచి సినిమాల్లో చేసే అవకాశాలు మిస్ అయ్యే చాన్స్ ఉంటుంది.
సినిమాల్లో కమెడియన్స్ అంటే మీ మీద మీరే పంచ్‌లు వేసుకోవాలి? ఈ విషయంలో మీరు ఎలా ఉంటారు?
నా మీదే నేను పంచ్‌లు వేసుకుంటాను. నాకు అలాంటి పట్టింపు లేదు. ఫైనల్‌గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే ముఖ్యం. దాని కోసం ఎలాంటి పాత్రలైనా చేస్తాను.
బిజీగా ఉండటం వల్ల కొన్ని సినిమాలు వదులుకుంటున్నారా?
ప్రస్తుతానికి బిజీగానే ఉన్నాను. కొన్ని సార్లు మంచి సినిమాలు కూడా వదులుకోవాల్సి ఉంది. కేవలం డేట్స్ క్లాష్ వల్ల దగ్గరికి వచ్చి పోతుంటాయి. తమిళంలో, కన్నడంలో కూడా ఆపర్లు వచ్చాయి.
హే బల్‌వంత్ బిజినెస్‌ను విడుదలకు ముందు ఎవరైనా కనిపెట్టి చెప్పారా?
విడుదలకు ముందు రోజు కూడా చాలా మంది కలిశారు. చాలా మంది రాంగ్ చెప్పారు. ఎవరూ కూగా గెస్ చేయలేకపోయారు. కొంత మంది తెలసిన కూడా బయటికి చెప్పలేదు.
నటుడిగా మీకు మీరు చేసే పాత్రలు సంతృప్తినిస్తున్నాయా?
శాటిస్‌ఫాక్షన్ ఉంది కాబట్టి, ఈ మధ్య కాలంలో సమాజవరగమన, పాంచ్‌మినార్, కిష్కిందపురి సినిమాలు మంచి పేరు తెచ్చాయి. నారీ నారీ నడుమ మురారి, ఇప్పుడు హే బల్‌వంత్ సినిమాలు నాకు మంచి పేరును తీసుకొచ్చాయి.
మీ తదుపరి చిత్రాలు?
మృత్యుంజయతో పాటు, గొదావరి గట్టు మీద లో కూడా మంచి పాత్రలు చేశాను. త్వరలోనే అవి విడుదల కానున్నాయి.వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను.
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…
‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…