విభిన్న కథా చిత్రాలతో ఆకట్టుకుంటున్న విజయ్ ఆంటోనీ ఎప్పటికప్పుడు ఆడియన్స్ పల్స్ పట్టేస్తున్నారు. వినూత్న కథాంశాలతో వైవిద్యభరితమైన పాత్రలతో అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు తన 25వ చిత్రాన్ని ఓ డిఫరెంట్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పరాశక్తి అనే పేరుతో ఈ సినిమా రాబోతోంది. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్.
“అరువు”, “వాజిల్” వంటి ప్రసిద్ధ చిత్రాలను రూపొందించిన ప్రముఖ దర్శకుడు, రచయిత అరుణ్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విజయ్ ఆంటోనీ ఈ సినిమాలో అసాధారణమైన నటన, అంకితభావాన్ని ప్రదర్శించనున్నారట. ఈ చిత్ర టైటిల్ పోస్టర్ మరింత ఆకట్టుకోవడమే గాక, ప్రేక్షకుల్లో ఉత్కంఠను పెంచుతోంది.
పరాశక్తి ప్రేక్షకులకు విభిన్నమైన అనుభూతిని అందించేందుకు మాస్ అప్పీల్, అత్యుత్తమ యాక్షన్, హృదయాన్ని హత్తుకునే కుటుంబ కథ ఎలిమెంట్స్ కలిగి ఉంది. విజయ్ ఆంటోనీ ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రాన్ని మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఈ సినిమా గ్రాండ్ ఎంటర్‌టైనర్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ సినిమాలో విజయ్ ఆంటోనితో పాటు వాగై చంద్రశేఖర్, సునిల్ కృష్ణ, సెల్ మురుగన్, త్రుప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటి ప్రతిభావంతమైన నటీనటులు భాగంగా ఉన్నారు.
టెక్నికల్ విభాగంలోనూ అత్యుత్తమ బృందం పని చేస్తోంది. సినిమాటోగ్రఫీ షెల్లీ కాలిస్ట్, సంగీతం విజయ్ ఆంటోనీ, ఎడిటింగ్ రేమండ్ డెరిక్ క్రస్టా, యాక్షన్ కొరియోగ్రఫీ రాజశేఖర్ అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా 2025 వేసవిలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
నటీనటులు: విజయ్ ఆంటోనీ, వాగై చంద్రశేఖర్, సునిల్ కృష్ణ, సెల్ మురుగన్, త్రుప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్
టెక్నికల్ టీం:
రచయిత-దర్శకుడు: అరుణ్ ప్రభు
సినిమాటోగ్రఫీ: షెల్లీ కాలిస్ట్
సంగీతం: విజయ్ ఆంటోనీ
ఎడిటింగ్: రేమండ్ డెరిక్ క్రస్టా
యాక్షన్ కొరియోగ్రఫీ: రాజశేఖర్
PRO: సాయి సతీష్
మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…
సంతోష్ శోభన్ హీరోగా నటిస్తున్న సినిమా "కపుల్ ఫ్రెండ్లీ". ఈ చిత్రంలో మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ…
సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం 'అనగనగా ఒక…
అంతకుమించి చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ ల కుమార్తె "నైరా" మొదటి పుట్టినరోజు వేడుకలు ఇటీవల…
యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది. కన్నడ…
విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు…