దర్శకుడు వెట్రిమారన్ రూపొందించిన “విడుదల పార్ట్ 1” థియేట్రికల్ గా ఘన విజయం సాధించినప్పటి నుంచి సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. “విడుదల 2” సినిమా రిలీజ్ కోసం సినీ ప్రియులు, ట్రేడ్ వర్గాలు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతి, సూరి ప్రధాన పాత్రల్లో నటించిన విడుదల 2 ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఆర్ఎస్ ఇన్ఫోటైన్ మెంట్ బ్యానర్ పై ఎల్రెడ్ కుమార్ నిర్మించారు. తెలుగు తమిళంలో “విడుదల 2” ఫస్ట్ లుక్ రిలీజైంది. ఈ సందర్భంగా
నిర్మాత ఎల్రెడ్ కుమార్ మాట్లాడుతూ – విడుదల పార్ట్ 1 సినిమాకు మూవీ లవర్స్ నుంచి వచ్చిన హ్యూజ్ రెస్పాన్స్ మా టీమ్ అందరికీ ఎంతో సంతోషాన్ని కలిగించింది. విడుదల పార్ట్ 1 మూవీ అంచనాలు మించి విజయం సాధించింది. కమర్షియల్ అంశాలతో పాటు రియలిస్టిక్ అప్రోచ్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈతరం దర్శకులకు స్ఫూర్తినిచ్చింది. యాక్టర్ సూరికి విడుదల పార్ట్ 1 మూవీ సక్సెస్ ఎంతో పేరు తెచ్చింది. విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ హిట్ మహారాజ తర్వాత వస్తున్న చిత్రంగా విడుదల 2పై మరింత హైప్ క్రియేట్ అవుతోంది. ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా విడుదల 2 సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. దర్శకుడు వెట్రిమారన్ ఈ సినిమాను తనదైన శైలిలో తీర్చిదిద్దుతున్నారు. స్వరజ్ఞాని ఇళయరాజా సంగీతం విడుదల 2 మూవీకి మరో ఆకర్షణ కానుంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న విడుదల 2 సినిమాను ఈ ఏడాది చివరలో థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. భవానీశ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ లాంటి ప్రతిభావంతమైన నటీనటులు విడుదల 2లో ప్రేక్షకుల్ని ఆకట్టుకోబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్, ఆడియో , థియేట్రికల్ రిలీజ్ డేట్స్ ను త్వరలో అనౌన్స్ చేస్తాం. అన్నారు.
నటీనటులు – విజయ్ సేతుపతి, సూరి, భవానీ శ్రీ, రాజీవ్ మీనన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, చేతన్, మంజు వారియర్, అనురాగ్ కశ్యప్ తదితరులు
టెక్నికల్ టీమ్
కాస్ట్యూమ్ డిజైనర్ – ఉత్తర మీనన్
సౌండ్ డిజైన్ – టి. ఉదయ కుమార్
స్టంట్స్ – పీటర్ హెయిన్, స్టంట్ శివ
వీఎఫ్ఎక్స్ – హరిహరసుదాన్
ఆర్ట్ డైరెక్టర్ – జాకీ
డీవోపీ – ఆర్ వేల్రాజ్
ఎడిటర్ – రామర్
మ్యూజిక్ – ఇళయరాజా
పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)
నిర్మాత – ఎల్రెడ్ కుమార్
దర్శకత్వం – వెట్రిమారన్
అవినాష్ తిరువీధుల హీరోగా, దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా "వానర". ఈ చిత్రంలో సిమ్రాన్ చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. నందు…
వైవిధ్యమైన చిత్రం కలర్ ఫొటో, బ్లాక్బస్టర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్…
సాదలమ్మ ఫిల్మ్ ప్రొడక్షన్స్, బిల్వ స్టూడియోస్ బ్యానర్ల మీద నిఖిల్ ఎం. గౌడ నిర్మించిన చిత్రం ‘జిన్’. ఈ మూవీకి…
బేబి డమరి సమర్పణలో శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ - శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "ఎర్రచీర".…
వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు విశ్వక్ సేన్, హాస్య చిత్రాలకు చిరునామాగా మారిన దర్శకుడు కె.వి.…
శ్రోతలను ఉర్రుతలూగిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి గీతం ‘దేఖ్లేంగే సాలా’ 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో…