“అన్నీ మంచి శకునములే “లో విక్టోరియా పురం అనేది కొత్త ప్రపంచం

Must Read

అన్నీ మంచి శకునములే “లో ఉన్న విక్టోరియా పురం అనేది ఒక కొత్త ప్రపంచం లాగా ఉంటుంది ,పాటలు చాలా పీస్ ఫుల్ గా ఉంటాయి : మిక్కీ జె మేయర్.భారీ తారాగణం ఉన్న అన్నీ మంచి శకునములే సినిమాకు సంగీతం సమకూర్చడం ఓ ఛాలెంజ్ : మిక్కీ జె మేయర్.నేను సెలెక్టివ్ గా చిత్రాలు  చేయడం లేదు. పీపుల్‌ నన్ను అలా కోరుకుంటున్నారు : మిక్కీ జె మేయర్

ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో ప్రతిభ గల దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్  ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్‌ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో పాటు పాటలు కూడా  సినిమా పై అంచనాలని పెంచాయి. మే 18 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అన్నీ మంచి శకునములే చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు. అటు మాస్, ఇటు క్లాస్ సినిమాలకు బాణీలు సమకూర్చే మిక్కీ జె మేయర్ అన్నీ మంచి శకునములే చిత్రం గురించి, ఇతర విషయాల గురించి ఇంటర్వ్యూ లో  తెలియజేసారు.

నందిని రెడ్డిగారు కథ చెప్పినప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏమి షేర్‌ చేసుకున్నారు? నందిని రెడ్డి గారు కథ చెప్పినప్పుడు మ్యూజిక్‌ ఎలా ఇవ్వాలనేది అర్తమైంది. విక్టోరియా పురం అనే ఊరి కథ కాట్టి ఊరికి తగినవిధంగా మ్యూజిక్‌, బ్యాక్ గ్రౌండ్ వుండాలి. అదో కొత్త ప్రపంచం. ఎందుకంటే లిటిల్‌ బిట్‌ ఆప్‌ బ్రిటీష్‌ టైప్‌ లో వుంటుంది. వాటికి ట్యూన్‌ మ్యాచ్‌ అయ్యేవిధంగా చూసుకున్నాను. పాటలు డిఫరెంట్‌ గా పీస్‌ఫుల్‌ గా వుంటాయి.

మూవీ బాగుంటే సంగీతదర్శకులు పెద్దగా స్ట్రగుల్‌ పడాల్సిన అవసరంలేదుగా?

జనరల్‌ గా ఏ సినిమాకైనా వందశాతం ఎఫర్ట్ పెడతాం. ఒకవేళ సినిమా బాగోకపోతే ప్రతీదీ స్పాయిల్‌ అవుతుంది. బాగోకపోతే  ప్రతీ దానికీ విమర్శలు ఎదురవుతాయి. స్క్రీప్ట్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బాగుంటే మా జాబ్‌ సక్సెస్‌ అవుతుంది.

మీకు కథ చెప్పినప్పుడే జడ్జిమెంట్‌ వస్తుందికదా. మీరు వారితో ఏమైనా షేర్‌ చేసుకున్నారా?

సహజంగా కథ చెప్పేటప్పుడే కొంత  జడ్జిమెంట్‌ వస్తుంది. ఏమి ఇవ్వాలి. ఎంత మోతాదులో పనిచేయాలనేది తెలుస్తుంది. ఆ తర్వాత  బ్యాక్ గ్రౌండ్ చేసి అంతా రెడీ అయ్యాక సినిమా చూసుకున్నప్పుడు ఏవైనా మార్పులు అనిపిస్తే వారితో షేర్‌ చేసుకుంటాం.

మహానటి తర్వాత వైజయంతి మూవీస్‌ లో పనిచేయడం, ఈ నిర్మాతలతో మీకున్న అనుబంధం ఎలా వుంది?

స్వప్న, ప్రియాంక అశ్వనీదత్‌ గారు, నాగ్‌ అశ్విన్‌ తో పనిచేయడం ఒకరకంగా కష్టమైన జాబ్‌ (నవ్వుతూ) అయినా కంపోజర్స్‌ ఆలోచనలు వారు గౌరవిస్తారు. నా అభిప్రాయాలకు ఫ్రీడమ్‌ ఇస్తారు. మహానటి తర్వాత అన్నీ మంచి శకునములే లాంటి మంచి ప్రాజెక్ట్‌ వచ్చింది నాకు. ఇది రెండేళ్ళనాడే మొదలైంది. స్వప్నగారు రెగ్యులర్‌ ఛాటింగ్‌ లో మూవీ గురించి అభిప్రాయాలు చెబుతుంటారు. నేను వారికి  షేర్‌ చేస్తుంటాను.

ఇందులో 6 పాటలున్నాయి కదా ఏ పాట మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది?

పాండమిక్‌ కు ముందే వీటి గురించి పనిచేశాం. ఒక పాట చేశాక ఆరునెలలు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత కాలానుగుణంగా అది బోర్‌ అవుతుందేమోనని ఫీలింగ్‌ కలిగింది. అందుకే అప్పటినుంచి ప్రతి ట్యూన్‌ కోసం స్ట్రగుల్‌ పడ్డాం. కొత్త కొత్త ఆలోచనలతో తగినట్లుగా పనిచేశాం.

మీరు విదేశాల్లో ఎక్కువగా ఉంటారు. ఆ ప్రభావం పనిమీద చూపిస్తుందా? లోకల్‌ గా వుంటే నేరుగా వారితో చర్చించే అవకాశం వుంటుంది  కదా?

ఇప్పటివరకు అలాంటి ఫిర్యాదులు లేవు. నా వర్కింగ్‌ స్టయిల్‌ హ్యాపీడేస్‌ లోనే కనిపిస్తుంది. నేను ఏ సినిమాకూ మ్యూజిక్‌ సిట్టింగ్‌ లో పాల్గొనలేదు. కేవలం ఫోన్‌ లోనే మాట్లాడుతుండేవాడిని. నేను కంపోజ్‌ చేసినవి దర్శకుడికి వినిపించేవాడిని. నా మ్యూజీషియన్‌ టీమ్‌ కూడా ఎక్కువగా లండన్‌, అమెరికాలలో వుంటుంటారు. వారికి నేను కాంటాక్ట్‌ లోనే వుంటాను. అందుకే నేను విదేశాల్లో వుండాల్సివస్తుందనుకుంటున్నా. ఇప్పటివరకు అలాగే చేస్తున్నాను.

మీరు సెలెక్టివ్‌ గా సినిమాలు చేస్తుంటారా? మీ పని విధానం ఎలా ఉండాలనుకుంటారు?

ప్రారంభంలో కొంతకాలం అంటే 10 సంవత్సరాలు అలా చేశాను. అప్పట్లో ఏడాదికి 4,5 సినిమాలే చేసేవాడిని. ఫ్యామిలీ పిల్లల బాధ్యత ఉండేది. నాకు పెద్దగా ఫ్రెండ్స్‌ కూడా లేరు. అందుకే ప్రస్తుత పరిస్థితులను బట్టి గత రెండేళ్ల నుంచి ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను. గ్రో అయ్యే కొద్దీ డిఫరెంట్‌ మూవీస్‌ చేయాలనుకుంటా. ఒకరకంగా చెప్పాలంటే, నేను సినిమాలను ఎంపిక చేసుకోవడం లేదు. పీపుల్‌ నన్ను అలా కోరుకుంటున్నారు.

మిక్కీగారంటే సెన్సిటివ్‌ కథలే చేయాలనుకుంటారా? మరి మాస్‌ సినిమాలు తగ్గించారా?

నాకు మెలోడీ అంటేనే ఇష్టం. వాటినే ఎంజాయ్‌ చేస్తాను. మిగతావి కొంచెం కష్టమైనవిగా అనిపిస్తాయి. మాస్‌ మూవీస్‌ గద్దల కొండ గణేష్‌, సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌ వంటి సినిమాల్లో నా బెస్ట్‌ ఇచ్చాను. కానీ మెలోడీ నేను ఎంజాయ్‌ చేస్తాను. నేను మూడుగంటలుపాటు ట్రావెల్‌ చేయాల్సివస్తే కొత్తబంగారులోకం, హ్యాపీడేస్‌ పాటలు వింటూ ఎంజాయ్‌ చేస్తాను. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. అందుకే మెలోడీ ఎక్కువగా చేస్తుంటా. ఒకరకంగా చెప్పాలంటే మెలోడీ అనేది లాంగ్‌ టర్మ్‌ వుంటుంది. మాస్‌ కొద్దికాలం వరకు వుంటుంది.

వెబ్‌ సిరీస్‌ గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

ఇప్పుడు నేను సినిమాలతో బిజీగా వున్నాను. వెబ్‌ సిరీస్‌ గురించి దర్శకులు అడిగితే చేస్తాను. కానీ సినిమాలే మోర్‌ ఛాలెంజింగ్ గా వుంటాయి.

అన్నీ మంచి శకునములే మీకు ఎంత స్పెషల్‌ అని చెప్పగలరు?

ఈ సినిమాను 2020 లో మొదలు పెట్టాం. టైటిల్‌ సాంగ్‌ అక్టోబర్‌ 2020లో ప్రారంభించాను. అప్పటినుంచీ ఈ సినిమాపై పనిచేస్తూనే వున్నాను. ఒకరకంగా టైర్డ్‌ అయినట్లు అనిపిస్తుంది. ఫైనల్‌ గా థియేటర్‌ కు వచ్చేసింది. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్‌ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇందులో చాలామంది సీనియర్స్‌ నటించారు. వారందిరికీ తగినవిధంగా మ్యూజిక్‌ ఇవ్వడం ఈ సినిమాలోని ప్రత్యేకత.

కొత్త సినిమాలు గురించి?

వరుణ్‌తేజ్‌ తో ప్రవీణ్‌ సత్తారు సినిమా ఒకటి. బాలీవుడ్‌ దర్శకుడు శక్తితో చేయబోతున్నా అందులోనూ వరుణ్‌తేజ్‌ హీరోనే. ఆ తర్వాత శ్రీకాంత్‌ అడ్డాల గారితో చేయబోతున్నా. దిల్‌రాజు సెల్ఫిష్ మూవీ రన్నింగ్‌ లో వుంది. స్వప్ప సినిమా పై ఛాంపియన్‌ సినిమా చేయబోతున్నా. ఇంకొకటి ఓ చిన్న సినిమా అమెరికన్‌ డైరెక్టర్‌ తో చేయబోతున్నా.

మీ సినిమాలన్నీ డిఫరెంట్‌ నేపథ్యాలతో వుంటున్నాయే?

అవును. ఎయిర్‌ఫోర్స్‌ నేపథ్యం ఒకటి చేస్తున్నా. అయితే, నేను చేసిన రామబాణం కూడా మంచి సినిమానే. దాన్ని నేను ఎంజాయ్‌ చేశాను. సక్సెస్‌ ఫెయిల్యూర్‌ పక్కనపెడితే డిఫరెంట్‌ డైరెక్టర్‌ తో పనిచేశాననే సంతృప్తి వుంది. అలా నేను చేసిన శేఖర్‌ కమ్ముల, హరీష్‌ శంకర్‌, నాగ్‌ అశ్విన్‌, నందినీరెడ్డి వీరంతా క్లాస్‌ మాస్‌ వున్న వైవిధ్యమైన స్టయిల్‌ వున్న దర్శకులే. వారితో పని చేయడం వల్ల నేనూ అంతో ఇంతో నేర్చుకుంటూనే ఉంటాను. అని ముగించారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News