NS24 చిత్రానికి డీవోపీగా వెట్రి పళనిసామి

Must Read

ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య తాజాగా తన కొత్త చిత్రాన్ని  ప్రకటించారు. తన 24 వ చిత్రాన్ని ఎస్ఎస్ అరుణాచలం దర్శకత్వంలో చేయనున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందనున్న ఈ సినిమాలో నాగశౌర్య వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు.తాజాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడుని ప్రకటించారు మేకర్స్. అనేక చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన స్టార్ కంపోజర్ హారిస్ జయరాజ్ NS24 కి సంగీతం అందించనున్నారు. తెలుగులో చాలా కాలం తర్వాత హారిస్ జయరాజ్  ఈ చిత్రానికి సంగీతం సమకూర్చడం విశేషం. అలాగే ఈ చిత్రానికి వీరం, వేదాళం, విశ్వాసం కాంచన 3 లాంటి సూపర్ హిట్ చిత్రాల సినిమాటోగ్రాఫర్ వెట్రి పళనిసామి డీవోపీగా పని చేస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు.

వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 1 గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.దర్శకుడు ఎస్‌ ఎస్‌ అరుణాచలం స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రం త్వరలో గ్రాండ్ గా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. కొందరు ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తుండగా, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయనున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో  తెలియజేస్తారు.

తారాగణం: నాగశౌర్య

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం: ఎస్ఎస్ అరుణాచలం

నిర్మాతలు: శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి

బ్యానర్: వైష్ణవి ఫిల్మ్స్

సమర్పణ: బేబీ అద్వైత,  భవిష్య

సంగీతం: హారిస్ జయరాజ్

డీవోపీ : వెట్రి పళనిసామి

పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

డాక్టర్ అరుళనందు పుట్టినరోజు సందర్భంగా ‘హైకు’ ఫస్ట్ లుక్ విడుదల చేసిన విజన్ సినిమా హౌస్

నిజాయితీతో, భావోద్వేగపూరిత కథలను ప్రోత్సహిస్తూ అందరి దృష్టిని ఆక‌ర్షిస్తూ వేగంగా ఎదుగుతోన్న‌ నిర్మాణ సంస్థ విజన్ సినిమా హౌస్. డా. అరుళ‌నందు, మాథ్యో అరుళ‌నందు ఆధ్వర్యంలో...

More News