‘రానా నాయుడు సీజన్ 2’లో నాగ నాయుడుగా వెంకటేష్ దగ్గుబాటి తిరిగి వచ్చారు. కానీ వెంకటేష్, నాగ నాయుడుకి చాలా తేడా ఉంటుంది. నాగ నాయుడు స్వార్థపరుడు, నియమాలను ఉల్లంఘిస్తుంటాడు. కానీ నిజ జీవితంలో వెంకటేష్ మాత్రం ఇలాంటి వాటన్నంటికీ దూరంగా ఉంటారు.
నాగ నాయుడు కుటుంబం కోసం ఎంతటి వరకు అయినా వెళ్తాడు, చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తాడు.. అదే అతన్ని మనం గుర్తు పెట్టుకునేలా చేస్తుంది. తాను పోషించిన పాత్ర గురించి వెంకటేష్ మాట్లాడుతూ.. ‘నాగ నాయుడు పాత్రని మనం ఊహించలేం. ఎప్పుడు ఏం చేస్తాడో చెప్పలేం. కానీ అతను తన కుటుంబం కోసం ప్రాణం ఇస్తాడు. అదే నాకు కనెక్ట్ అయిన పాయింట్. నిజ జీవితంలో నాకు ఆ పాత్రకు ఉన్న కనెక్షన్ అదే. మేమిద్దరం మా కుటుంబాలను ప్రేమిస్తాము.. కానీ అక్కడే ఎంతో తేడా ఉంటుంది. నా పాత్ర ఎలా ఉంటుందో ఊహించగలరు. కానీ నాగ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవ్వరూ ఊహించలేరు.
నాగకి డ్రామా అంటే ఎక్కువగా ఇష్టం. నాకు మైండ్ గేమ్స్ ఆడటం ఇష్టం ఉండదు. నేను ఆడను. కానీ నాగ అలాంటి ఆటల్లో ఆశ్చర్య పరుస్తుంటాడు. అతను ఏమి ఆలోచిస్తుంటాడో మనకు తెలియదు.. అస్సలు ఊహించలేం.. ఈ సారి అభిమానుల్ని మరింతగా ఆకట్టుకునేలా ఈ పాత్ర ఉంటుంది’ అని అన్నారు.
రానా నాయుడు సీజన్ 2 మొత్తం యాక్షన్, డ్రామాతో నిండి ఉంటుంది. నాగ నాయుడు 2.0 పూర్తి స్థాయి ధమాకాను సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. రానా నాయుడు సీజన్ 2 జూన్ 13 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న సంగతి తెలిసిందే
అర్జున్ కోలా దర్శకత్వంలో దినేష్ తేజ్, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్, ఎస్.కె.ప్రొడక్షన్స్…
స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అందరూ థియేటర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి…
ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…
ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…
ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…