‘బకాసుర రెస్టారెంట్‌’ నుంచి ”జాతీయం” లిరికల్‌ వీడియో విడుదల

ప్రముఖ కమెడియన్‌ ప్రవీణ్‌ ‘బకాసుర రెస్టారెంట్‌’ నుంచి ”జాతీయం” లిరికల్‌ వీడియో విడుదల

పలు విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘బకాసుర రెస్టారెంట్‌’, ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు మేకర్స్‌. ట్రైలర్‌ అన్ని వర్గాల నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నా అంగీ జాతీయం.. నీ లుంగీ జాతీయం’ అంటూ కొనసాగే లిరికల్ వీడియోను విడుదల చేశారు. బ్యాచ్‌లర్‌ కష్టాలు, బ్యాచ్‌లర్‌ లైఫ్‌లో ఉండే ఆనందాలు తెలియజేస్తూ విష్ణు వర్థన్‌ ఈ చిత్రానికి సాహిత్యం అందించారు. వికాస బడిస స్వరాలు సమాకూర్చిన ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి ఆలపించాడు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ” ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్నో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉన్నాయి. పూర్తి వినోద భరితంగా తెరకెక్కిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

ప్రవీణ్‌, వైవా హర్ష, షైనింగ్‌ ఫణి (బమ్‌చిక్‌ బంటి), కేజీఎఫ్‌ గరుడ రామ్‌, కృష్ణభగవాన్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, ఉప్పెన జయకృష్న, వివేక్‌ దండు, అమర్‌, రామ్‌పటాస్‌, రమ్య ప్రియ, ప్రాచీ ఠాకూర్‌, జబర్థస్త్‌ అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డీఓపీ: బాల సరస్వతి, ఎడిటర్‌: మార్తండ్‌.కె.వెంకటేష్‌, సంగీతం: వికాస్‌ బడిస, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: వినయ్‌ కొట్టి, ఆర్ట్‌ డైరెక్టర్: శ్రీ రాజా సీఆర్‌ తంగాల, పీఆర్‌ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు, నిర్మాతలు: లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి, దర్శకత్వం: ఎస్‌జే శివ

Tfja Team

Recent Posts

“సమ్మర్ హాలిడేస్” సినిమా ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది, ఈ దీపావళికి ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూడండి – ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీవిష్ణు

నవంబర్ 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న "సమ్మర్ హాలిడేస్" కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్…

15 hours ago

‘రుద్రవనం పీఎస్’ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను – గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్

ఎల్లో ఫ్లవర్స్, శ్రీ చక్ర మూవీస్ బ్యానర్ల మీద రమేష్ పుప్పాల, సూర్యకాంతి నిర్మాతలుగా శశిధర్ మున్నంగి తెరకెక్కించిన న్యూ…

15 hours ago

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై నిహారిక కొణిదెల నిర్మిస్తున్న నూతన చిత్రానికి ‘పాకెట్ రాకెట్స్’ టైటిల్ ఖరారు… కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్

నిహారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, మాక్సిమం సిటీ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ‘పాకెట్ రాకెట్స్’.…

15 hours ago

హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ముఖ్య అతిధి గా హైదరాబాద్ లోని కోంపల్లిలో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ప్రారంభం

హైదరాబాద్ ఫుడ్ లవర్స్ కోసం సరికొత్త థీమ్ తో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ఘనంగా ప్రారంభమైంది. టాలీవుడ్ బ్యూటీ…

7 days ago

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…

2 weeks ago

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…

2 weeks ago