‘సంక్రాంతికి వస్తున్నాం’ నుంచి విక్టరీ వెంకటేష్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’తో అలరించబోతున్నారు. ఇది వారి సక్సెస్ ఫుల్ కొలాబరేషన్ లో హ్యాట్రిక్ మూవీ. దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

రేపు (డిసెంబర్ 13) విక్టరీ వెంకటేష్ బర్త్ డే సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ మేకర్స్ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. వెంకటేష్ డైనమిక్ అండ్ స్టైలిష్ అవతార్ లో కనిపించిన ఈ బ్రాండ్ న్యూ పోస్టర్ అదిరిపోయింది.

వెంకటేష్ బర్త్ డే సందర్భంగా రేపు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సెకండ్ సింగిల్ ప్రోమోని అభిమానులకు కానుకగా ఇవ్వబోతోంది టీం.

ఈ చిత్రం ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ గోదారి గట్టు సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.

ఈ ట్రైయాంగిల్ క్రైమ్ కథలో వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి
సమర్పణ: దిల్ రాజు
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
నిర్మాత: శిరీష్
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: సమీర్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: A S ప్రకాష్
ఎడిటర్: తమ్మిరాజు
కో రైటర్స్: ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ
యాక్షన్ డైరెక్టర్: వి వెంకట్
VFX: నరేంద్ర లోగిసా
పీఆర్వో: వంశీ-శేఖర్
డిజిటల్: హాష్‌ట్యాగ్ మీడియా
మార్కెటింగ్: నాని

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

3 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

3 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

3 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

3 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

3 days ago