“వీక్షణం” సినిమా ప్రీ క్లైమాక్స్ ఎవ్వరూ ఎక్స్ పెక్ట్ చేయలేరు హీరో రామ్ కార్తీక్

రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు యంగ్ హీరో రామ్ కార్తీక్.

  • నేను లాస్ట్ ఇయర్ ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ అనే మూవీ చేశాను. అది ఆహా ఓటీటీలో రిలీజైంది. ఆ టైమ్ లోనే డైరెక్టర్ మనోజ్ పల్లేటి “వీక్షణం” మూవీ స్క్రిప్ట్ చెప్పారు. వినగానే ఆసక్తికరంగా అనిపించింది. నేను ఇప్పటిదాకా విన్న కథలో డిఫరెంట్ ఫీల్ కలిగించింది. మనం కథలు వినేప్పుడు నెక్స్ట్ ఇలా జరుగుతుంది అనుకుంటాం. కానీ “వీక్షణం” కథ విన్నప్పుడు అలా గెస్ చేయలేకపోయాను. ప్రీ క్లైమాక్స్ తో పాటు మరికొన్ని హుక్ సీన్స్ ఉంటాయి. అవి చాలా బాగుంటాయి. వాటి గురించి రివీల్ చేయలేను.
  • “వీక్షణం” సినిమాలో సరదాగా ఉండే కుర్రాడిలా కనిపిస్తా. అతనికి పక్కవాడి జీవితాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. తనకున్న ఈ మనస్తత్వం వల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది మూవీలో మెయిన్ పాయింట్. ఈ యువకుడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం అతని కథ అనేక మలుపులు తిరగడం సినిమాలో చూస్తారు. హీరో క్యారెక్టర్ సరదా నుంచి క్రమంగా సీరియస్ నెస్ వైపు మళ్లుతుంది. సరదాగా ఉండే ఆ యువకుడు…డిటెక్టివ్ లా మారి తన చుట్టూ జరుగుతున్న విషయాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటాడు.
  • “వీక్షణం” సినిమా లవ్ స్టోరీతో స్టార్ట్ అయ్యి మిస్టరీ థ్రిల్లర్ గా మారుతుంది. నేను గతంలో థ్రిల్లర్స్ చేశాను గానీ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో నటించడం ఇదే తొలిసారి. ప్రతి సినిమాకు ఏదో కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం. నేను నా గత మూవీస్ తో చూస్తే ఇందులో మెచ్యూర్డ్ గా , సెటిల్డ్ గా పర్ ఫార్మ్ చేశాననే అంటున్నారు. మూవీ చూసిన సురేష్ కొండేటి గారు ఇదే కాంప్లిమెంట్ ఇచ్చారు. నేను ఈ సినిమాలో చాలా సెటిల్డ్ గా నటించానని ఆయన అన్నారు. అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ గా భావిస్తా.
  • “వీక్షణం” సినిమా డైరెక్టర్ మనోజ్ కొత్త వారు కాబట్టి ప్రాజెక్ట్ సెట్ చేసేందుకు మొదట్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. మా ప్రొడ్యూసర్ అశోక్ గారు మనోజ్ ఒకే ఊరివారు కావడంతో కథ నచ్చి వెంటనే మూవీ స్టార్ట్ చేశారు. అందుకు ప్రొడ్యూసర్ అశోక్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా.
  • థ్రిల్లర్ మూవీస్ అంటే మైండ్ గేమ్. ప్రేక్షకుల్ని చివరి దాకా ఎంగేజ్ చేయగలిగితేనే ఆ సినిమా సక్సెస్ అవుతుంది. అందుకే మా డైరెక్టర్ మనోజ్ స్క్రిప్ట్ పలు వెర్షన్స్ రాసుకున్నారు. స్క్రీన్ ప్లేలో హుక్ పాయింట్స్ ఉండేలా చూసుకున్నారు. మా మూవీలో ప్రీ క్లైమాక్స్ ను ఎవరూ ఊహించలేరు. మా మూవీలో హీరో మరొకర్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. కానీ అతనికి తెలియకుండా మరో కన్ను ఆయన్ను చూస్తుంటుంది. అందుకే వీక్షణం అనే టైటిల్ పెట్టాం. కథకు చాలా యాప్ట్ టైటిల్ ఇది.
  • మా “వీక్షణం” మూవీలో భయపెడుతూనే దాన్ని ఎలా అధిగమించాలో చూపెడుతుంది. మా మూవీకి బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు డీవోపీ సాయి రామ్, సమర్థ్ మంచి మ్యూజిక్ చేశారు. డిఫరెంట్ టైప్స్ సాంగ్స్ చేశారు.
  • 2016లో దృశ్యకావ్యం సినిమా నుంచి నేను కెరీర్ కొనసాగిస్తున్నాను. మీ అందరి సపోర్ట్ తో హీరోగా మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. దామోదర ప్రసాద్ గారి నిర్మాణంలో ఎఫ్ యూసీకే అనే మూవీ చేశాను. పెద్ద ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది. అయితే కోవిడ్ టైమ్ కాబట్టి ప్రేక్షకులు థియేటర్స్ కు రాలేదు. తెలిసినవాళ్లు, గ్రేట్ ఇండియన్ సూసైడ్ మూవీస్ నాకు మంచి పేరు తెచ్చాయి. “వీక్షణం” కూడా హీరోగా నన్ను మరో మెట్టు పైకి తీసుకెళ్తుందని ఆశిస్తున్నా. వాసు గారి డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నాను. పోస్ట్ ప్రొడక్షన్ లో ఆ సినిమా ఉంది. మరికొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ లైనప్ లో ఉన్నాయి.
Tfja Team

Recent Posts

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

7 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

7 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

7 days ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

7 days ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

7 days ago

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

1 week ago