వ‌రుణ్ తేజ్ ‘గాంఢీవధారి అర్జున’ ప్రీ టీజర్

మహాభారతంలోని  అర్జునుడి రథంలోని ఆశ్వాల శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘గాంఢీవధారి అర్జున’ ప్రీ టీజర్ 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు. తనదైన శైలిలో మరోసారి మరో డిఫరెంట్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సినిమాయే ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌వీణ్ సత్తారు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రంలో వ‌రుణ్ తేజ్ ప‌క్కా యాక్ష‌న్ మోడ్‌లో ఆక‌ట్టుకోబోతున్నారు. సాక్షి వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఇటీవ‌ల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకోవ‌టంలో బిజీగా ఉంది. ఆగ‌స్ట్ 25న సినిమాను విడుదల చేస్తున్నారు. 

ఈ యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్ ప్రీ టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే.. వ‌రుణ్‌తేజ్ మునుపెన్న‌డూ చేయ‌న‌టువంటి భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో న‌టించిన‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతుంది. ఆ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చూస్తుంటే.. మహాభారతంలోని  అర్జునుడి రథంలోని ఆశ్వాల శక్తి సామర్థ్యాలను తెలియజేసేలా ఉంది. అర్జునుడి ర‌థం, ఓ పాత కారుని ప్రీ టీజ‌ర్‌లో గ‌మ‌నించ‌వ‌చ్చు. దాన్ని కంటిన్యూ చేస్తూ కొన్ని యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను ఫ్లాష‌స్ రూపంలో చూపించారు. చివ‌ర‌గా ఓ రైఫిల్ ప‌ట్టుకుని పొగ‌లో ఎంట్రీ ఇస్తారు. ఈ సీన్ క‌చ్చితంగా థియేట‌ర్‌లోని ఆడియెన్స్‌కు ఓ విందులా ఉంటుంద‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. 

ఎగ్జ‌యిట్‌మెంట్‌ను క‌లిగించేలా రూపొందుతోన్న ఈ యాక్ష న్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో సౌండ్‌, విజువ‌ల్స్ ఈ స‌న్నివేశాలు మ‌న‌ల్ని అర్జునుడి ఉన్న యాక్ష‌న్ మోడ్‌లోకి తీసుకెళతాయి. ఈ సినిమాలో డిజైన్ చేసిన యాక్ష‌న్ స‌న్నివేశాలు హైలెట్‌గా నిలుస్తాయి. వ‌రుణ్ తేజ్ ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపించ‌ని స‌రికొత్త లుక్‌లో మెప్పించ‌బోతున్నారు. 

వ‌రుణ్‌తేజ్ కెరీర్‌లో అత్యంత భారీ చిత్రంగా.. యూరోపియ‌న్ దేశాల‌తో పాటు యు.ఎస్‌.ఎలోనూ షూటింగ్‌ను హ్యూజ్ బ‌డ్జెట్‌తో  ఎస్వీసీసీ ప‌తాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ముఖేష్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయ‌ర్ సంగీతాన్ని, అవినాష్ కొల్ల ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తున్నారు.

Tfja Team

Recent Posts

ప్రముఖ దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా ఘనంగా “స్కై” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్, ఫిబ్రవరి 6న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న మూవీ

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి, ఆనంద్ ప్రధాన పాత్రల్లో వేలార్ ఎంటర్ టైన్ మెంట్ స్టూడియోస్ బ్యానర్ పై నాగిరెడ్డి…

7 hours ago

ఈ సంక్రాంతి ఏడు తరాలు అటు, ఏడు తరాలు ఇటు గుర్తుండిపోతుంది: ‘అనగనగా ఒక రాజు’ విజయోత్సవ వేడుకలో స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్‌ పొలిశెట్టి

సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో అడుగుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం 'అనగనగా ఒక…

12 hours ago

వైభవంగా జరిగిన హీరో సతీష్ జై కుమార్తె ‘నైరా ‘ పుట్టినరోజు వేడుక

అంతకుమించి చిత్రం పేం సతీష్ జై, డాక్టర్ మైత్రి షరణ్ ల కుమార్తె "నైరా" మొదటి పుట్టినరోజు వేడుకలు ఇటీవల…

1 day ago

హీరోలు సందీప్ కిషన్, విశ్వక్ సేన్ చేతుల మీదుగా హీరో తిరువీర్ “భగవంతుడు” మూవీ టీజర్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ…

1 day ago

ఘనంగా తిరుపతిలో ‘సుమతి శతకం’ చిత్ర టైలర్ లాంచ్ ఈవెంట్ – ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాతగా ఎంఎం నాయుడు రచన దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు…

1 day ago