11న “వర్షం” రీ రిలీజ్….టిక్కెట్ల స్పీడ్ బుకింగ్

గతంలో సూపర్ డూపర్ హిట్ అయిన “వర్షం” సినిమా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని థియేటర్లలో ఈ నెల 11న రీ రిలీజ్ కానుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లుగా, గోపీచంద్ ప్రతి నాయకుడిగా శోభన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకాభిమానులను ఎంతగానో అలరించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ప్రభాస్ తో పాటు ఇతర నటీనటులంతా అత్యుత్తమ నటనను కనబరిచిన ఈ సినిమాలోని పాటలు కూడా వీనులవిందుగా ఆకట్టుకున్న సంగతి వేరుగా చెప్పనక్కరలేదు.

ఆ రోజులలో ప్రభాస్ కెరీర్ మలుపులో ఈ సినిమా అగ్ర భాగాన నిలిచింది కూడా. “ఈశ్వర్” సినిమాతో తన కెరీర్ ను ఆరంభించిన ప్రభాస్ ఈ నెల 11 నాటికి కరెక్ట్ గా 20 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకుంటున్న సందర్భంగా “వర్షం” సినిమాను తమ నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ తరపున రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ తెలియజేశారు.

ఇప్పటికే ఆన్ లైన్లో టిక్కెట్ల బుకింగ్ మొదలయ్యిందని, స్పీడ్ గా టిక్కెట్లు బుక్ అవుతూ, విశేష స్పందన లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.థియేటర్లను దేవాలయాలు మాదిరిగా చూసుకోండి: అందరి హీరోల అభిమానులకు నట్టి కుమార్ విజ్ఞప్తితమ అభిమాన హీరోల సినిమాలను ప్రదర్శించే థియేటర్లను ఆయా హీరోల అభిమానులంతా దేవాలయాలు మాదిరిగా భావించి, వాటిని కాపాడుకోవాలని నట్టి కుమార్ విజ్ఞప్తి చేశారు. కొన్ని ప్రాంతాలలో సినిమాల విడుదల సందర్భంగా అభిమానుల కోలాహలంలో థియేటర్లు డామేజ్ అయిన సంఘటనలు జరిగాయని, దయచేసి అభిమానులు తమ కోలాహలాన్ని కొనసాగిస్తూనే, థియేటర్లను దేవాలయాలు మాదిరిగా కాపాడుకోవాలని నట్టి కుమార్ అందరు హీరోల

Tfja Team

Recent Posts

సినీ దిగ్గజ జర్నలిస్ట్ కి ఘన నివాళి – 66వ జయంతి సందర్భంగా బి.ఎ. రాజు గారిని స్మరించుకుంటూ

ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…

7 days ago

శంబాల థ్యాంక్స్ మీట్.. చిత్రయూనిట్‌‌ని అభినందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు

డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…

7 days ago

కానిస్టేబుల్‌ కనకం2.. సీజన్ 1 కంటే అద్భుతంగా ఉంటుంది. బిగ్గెస్ట్ హిట్ అవుతుంది: ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్ వర్ష బొల్లమ్మ

వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్‌ కానిస్టేబుల్‌ కనకం. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహించారు.…

7 days ago

చార్మింగ్ స్టార్ శర్వా, సాక్షి వైద్య ‘నారి నారి నడుమ మురారి’ నుంచి లవ్లీ నెంబర్ ‘భల్లే భల్లే’రిలీజ్

చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…

7 days ago

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్:మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి వ‌సంత్.. లుక్ పోస్ట‌ర్ విడుద‌ల

రాకింగ్ స్టార్ య‌ష్ సెన్సేష‌న‌ల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫ‌ర్ గ్రోన్ అప్స్‌’లో మెల్లిసా పాత్ర‌లో రుక్మిణి…

7 days ago