వైష్ణవి ఫిల్మ్స్ ,నాగ శౌర్య చిత్రం ఘనంగా ప్రారంభం

Must Read

ప్రామిసింగ్ హీరో నాగశౌర్య 24వ చిత్రానికి నూతన దర్శకుడు ఎస్ఎస్ అరుణాచలమ్ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌ పై ప్రొడక్షన్ నెం 1గా శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. బేబీ అద్వైత, భవిష్య ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.#NS24 విశిష్ట అతిథుల సమక్షంలో గ్రాండ్ గా ప్రారంభమైయింది. పూజా కార్యక్రమానికి విచ్చేసిన దర్శకుడు వివి వినాయక్ ముహూర్తం షాట్‌ కు క్లాప్‌బోర్డ్‌ ను ఇచ్చారు. అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్కి తిరుమల కిషోర్ దర్శకత్వం వహించారు. న్యూరో హాస్పిటల్ సాంబశివారెడ్డి, జి.ఎస్.కె ఇన్‌ఫ్రా టెక్ సంతోష్ కుమార్ స్క్రిప్ట్‌ను మేకర్స్‌కి అందజేశారు.

#NS24 నాగ శౌర్య కెరీర్‌లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందబోతుంది. యూత్, ఫ్యామిలీస్‌ కి సంబంధించిన ఎలిమెంట్స్ ఉండే యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా రూపొందుతున్న ఈ సినిమాలో నాగశౌర్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.#NS24లో కీలక పాత్రల్లోప్రముఖ తారాగణం కనిపించనుంది. అలాగే ఈ సినిమా కోసం అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు.ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు ఈ చిత్రానికి సంగీతం అందించడం విశేషం. వెట్రి పళనిసామి సినిమాటోగ్రఫీని అందిస్తుండగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా, సాయి ప్రవీణ్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌వి శేఖర్‌ ఎడిషినల్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. బండి భాస్కర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత.

తారాగణం: నాగ శౌర్య

సాంకేతిక విభాగం:

రచన, దర్శకత్వం: ఎస్.ఎస్ అరుణాచలమ్

నిర్మాతలు: శ్రీనివాసరావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా. అశోక్ కుమార్ చింతలపూడి

బ్యానర్: వైష్ణవి ఫిల్మ్స్

సమర్పణ: బేబీ అద్వైత, భవిష్య

సంగీతం: హారిస్ జయరాజ్

డీవోపీ: వెట్రి పళనిసామి

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

ఆర్ట్: సాయి ప్రవీణ్

ఎడిషినల్ స్క్రీన్‌ప్లే: ఎస్.వి శేఖర్

ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బండి భాస్కర్

పీఆర్వో: వంశీ-శేఖ

Latest News

ఘ‌నంగా ‘మర్రిచెట్టు కింద మనోళ్ళు’ మూవీ ప్రారంభోత్స‌వం

శ్రీ నారసింహ చిత్రాలయ బ్యానర్‌పై నరేష్ వర్మ ముద్దం దర్శకత్వంలో, ప్రమోద్ దేవా, రణధీర్, కీర్తన స్వర్గం ముస్కాన్ రాజేంద‌ర్ హీరోహీరోయిన్లుగా "మర్రిచెట్టు కింద మనోళ్ళు"...

More News