డబుల్ ఇస్మార్ట్ రేపటి నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం

Must Read

డబుల్ ఇస్మార్ట్ కోసం ఉస్తాద్ రామ్ పోతినేని సూపర్బ్ ట్రాన్స్ ఫర్మేషన్- రేపటి నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం

ఉస్తాద్ రామ్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ రెండోసారి కలిసి చేస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ డబుల్ ఇంపాక్ట్ అందించబోతోంది. కథ, క్యారెక్టర్ డిజైన్, మేకింగ్, స్కేల్, స్పాన్, బడ్జెట్ ఇలా సినిమాకు సంబంధించిన ప్రతిదీ ఇస్మార్ట్ శంకర్‌లో చూసిన దానికి రెట్టింపు ఉంటుంది. పూరి కనెక్ట్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విషు రెడ్డి సీఈవో.

డబుల్‌ ఇస్మార్ట్‌ లాంచింగ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్‌లో జరిగింది. రేపటి నుంచి (జూలై 12) రెగ్యులర్ షూట్ ప్రారంభం అవుతుంది. ఈలోగ రామ్ త‌న క్యారెక్టర్ కోసం ప్రిపేర్ అయ్యారు. తన ట్రాన్స్ ఫర్మేషన్ తో అందరినీ డబుల్ ఇస్మార్ట్ వరల్డ్ లోకి వెళ్లనున్నారు రామ్ .

డబుల్ ఇంపాక్ట్ అందించడానికి రామ్ ఇస్మార్ట్ శంకర్‌గా బంగర్ అవతార్‌కి తిరిగి వచ్చారు. ఈ పాత్ర కోసం చిన్న, స్పైక్డ్ హెయిర్‌స్టైల్‌తో స్టైలిష్ బెస్ట్ అవతార్‌లో కనిపిస్తున్నారు. ప్రీక్వెల్ అతని మెదడులో చొప్పించిన చిప్‌ను చూపించింది. తల వెనుక భాగంలో ఉన్న కట్ సూచించినట్లుగా డబుల్ ఇస్మార్ట్ డబుల్ రేంజ్‌లో వుంటుందని అర్ధమౌతుంది. ఇది క్యూరియాసిటీని డబుల్ చేస్తోంది.

పూరి జగన్నాధ్ చాలా పెద్ద స్పాన్ కలిగి కథ రాశారు. ఇది అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. రామ్‌ని ఇస్మార్ట్ శంకర్ కంటే మాసియర్ క్యారెక్టర్‌లో చూపించబోతున్నారు పూరి జగన్నాధ్.  

డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలౌతుంది.  

తారాగణం: రామ్ పోతినేని
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్

Latest News

Audience will connect with the character of Baghi that I play in Drinker Sai Aishwarya Sharma

The film Drinker Sai stars Dharma and Aishwarya Sharma in the lead roles, with the tagline Brand of Bad...

More News