డబుల్ ఇస్మార్ట్ గ్రాండ్ గా లాంచ్

ఉస్తాద్ రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్, పూరీ కనెక్ట్స్ పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్ గ్రాండ్ గా లాంచ్

ఉస్తాద్ రామ్, సెన్సేషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ క్రేజీ కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులని అలరించనుంది. వారి కల్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ కోసం వీరిద్దరూ మళ్లీ కలిశారు. ఈసారి డబుల్ మాస్, డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది. పూరి కనెక్ట్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విషు రెడ్డి సీఈవో.

ఈరోజు కోర్ టీమ్, కొంతమంది ప్రత్యేక అతిథుల సమక్షంలో ‘డబుల్ ఇస్మార్ట్’ లాంచ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఛార్మి క్లాప్‌ ఇవ్వగా, హీరో రామ్ పోతినేనిపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి స్వయంగా పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ముహూర్తపు సన్నివేశంలో “ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్’ అని రామ్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంది.

“డబుల్ ది ఎంటర్‌టైన్‌మెంట్! డబుల్ ది యాక్షన్! డబల్ ది మ్యాడ్‌నెస్! వి ఆర్ బ్యాక్ !! #డబుల్‌ఇస్మార్ట్ మోడ్ ఆన్! ” అంటూ లాంచింగ్ ఈవెంట్ లో ఫోటోలని ట్విట్టర్ లో షేర్ చేశారు రామ్  

డబుల్ ఇస్మార్ట్ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది.

ఇస్మార్ట్ శంకర్ రామ్‌తో పాటు పూరీ జగన్నాథ్‌కి చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమా హీరోకి, దర్శకుడికి బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఎక్సయిట్మెంట్, అంచనాలు భారీగా వున్నాయి.

పూరి జగన్నాధ్ చాలా పెద్ద స్పాన్ కలిగి కథ రాశారు. ఇది అత్యున్నత స్థాయి సాంకేతిక ప్రమాణాలతో భారీ స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందనుంది. రామ్‌ని ఇస్మార్ట్ శంకర్ కంటే మాసియర్ క్యారెక్టర్‌లో చూపించబోతున్నారు పూరి జగన్నాధ్.  

డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలౌతుంది.  

తారాగణం: రామ్ పోతినేని
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: పూరీ జగన్నాథ్
నిర్మాతలు: పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్
బ్యానర్: పూరి కనెక్ట్స్
సీఈఓ: విషు రెడ్డి
పీఆర్వో: వంశీ-శేఖర్

Tfja Team

Recent Posts

మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా “చిరంజీవి” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటిస్తున్న సినిమా "చిరంజీవి". ఈ చిత్రంలో తనికెళ్ల భరణి,ఈశ్వరీ రావు, గోపరాజు రమణ,శ్రీకాంత్…

10 hours ago

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న”తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘గోపాల గోపాల’ సాంగ్ రిలీజ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్…

1 day ago

జూన్ 26న రానున్న మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘లెనిన్’.. అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని ‘లెనిన్’ మీదున్న హైప్ గురించి అందరికీ తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో…

5 days ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘రాకా’ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

భారతీయ చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ, టాప్ ప్రొడ్యూసర్…

5 days ago

నేషనల్ క్రష్ రశ్మిక మందన్నకు బర్త్ డే విశెస్ చెబుతూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన “రణబాలి” మేకర్స్

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ…

1 week ago