“తిమ్మరాజుపల్లి టీవీ” ఫ్యూర్ సస్పెన్స్ డ్రామా మూవీ. సినిమా ఆద్యంతం నెక్ట్స్ ఏం జరుగుతుంది అని సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూస్తారు- దర్శకుడు వి. మునిరాజు

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు దర్శకుడు వి.మునిరాజు.

  • దర్శకుడు కావాలనేది నా కల. ఇండస్ట్రీకి వచ్చాక జాబ్ కోసం ఆన్ లైన్ ఎడిటింగ్ చేయడం మొదలుపెట్టాను. కొంతకాలం ఆన్ లైన్ ఎడిటింగ్ చేస్తుంటే డైరెక్షన్ అనే కలకు దూరంగా ఉండిపోతున్నా అనిపించింది. దాంతో ఒక స్క్రిప్ట్ అనుకుని దాన్ని ఊరికి వెళ్లి అక్కడి వాళ్లతో డెమో షూట్ చేశాను. తిరిగొచ్చి ఇక్కడ పోస్ట్ ప్రొడక్షన్ వర్స్క్ చేయించాను. ఆ తర్వాత మీటర్ మూవీ షూటింగ్ టైమ్ లో కిరణ్ అబ్బవరం గారు పరిచయం అయ్యారు. ఆయన ఏం చేస్తున్నావు అని అడిగారు. అలా మాటల్లో నా డెమో మూవీ గురించి చెప్పాను. ఆయనకు నచ్చి కథ ఏంటని అడిగారు. స్క్రిప్ట్ చెప్పాక పూర్తిస్థాయిలో డెవలప్ చేయి మనం మూవీ చేద్దామని అన్నారు. అలా “తిమ్మరాజుపల్లి టీవీ” మూవీకి తొలి అడుగులు పడ్డాయి
  • “తిమ్మరాజుపల్లి టీవీ” కథకు స్పూర్తి నేను చిన్నప్పుడు చూసిన ఘటనలే. నేను చూసిన మనుషుల క్యారెక్టర్ లు, వారి భావోద్వేగాలు, నా చిన్నప్పటి అనుభవాలు ఇవన్నీ ఈ మూవీలో చిత్రీకరించాను. నేను తెరపై ఒక చెప్పాలనుకున్నప్పుడు అది నా ఊరి కథే ఎందుకు కాకూడదు అనిపించింది. మా ఊరికి మొదటిసారి టీవీ వచ్చినప్పుడు మాఊరికి దగ్గరలోని థియేటర్ కదిలి వచ్చిందా అనే భావన నాలో కలిగింది. ఇది ప్రతి ఊరి కథ. 40 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ టీవీ నేపథ్యంగా నేను చూసిన ఘటనలు చూసే ఉంటారు. ఊరి మనుషులు, వారి మధ్య అహం వంటి అంశాలు చూపిస్తూనే చివరలో మంచి ఎమోషనల్ కంటెంట్ చెబుతున్నాం.
  • ఈతరం జెన్ జీ కిడ్స్ కు కూడా మా సినిమా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈతరం పిల్లలకు అప్పటి మన కల్చర్,సంప్రదాయాలు తెలియవు, అప్పుడు మనమంతా ఎలా ఉండేవాళ్లమో తెలియదు. కాబట్టి మా సినిమాలోని వాతావరణం అంతా వాళ్లకు కొత్తగా ఉంటుంది. ఈతరం పిల్లలు చూడని ప్రపంచం, చూడని విషయాలు మా మూవీలో ఆకట్టుకుంటాయి.
  • ఫ్యూర్ సస్పెన్స్ డ్రామా చిత్రమిది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నెక్ట్స్ ఏం జరుగుతుంది అని సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూస్తారు. చివరకు మంచి ఎమోషనల్ ఫీల్ తో థియేటర్ నుంచి బయటకు వస్తారు.రాయలసీమ నేపథ్యంగా కథ సాగుతుంది. మా ఊరు తిమ్మరాజుపల్లి. అదే ఊరిలో రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. మీరు చూసే పాటలన్నీ మా ఊరు చుట్టుపక్కల రూపొందించినవే.
  • రియలెస్టిక్ అప్రోచ్ తో ఈ సినిమాను తెరకెక్కించాను. కమర్షియల్ సినిమాల మేకింగ్ స్టైల్ వేరు. నేను సాధ్యమైనంత సహజంగా, అలాంటి వాతావారణంలో సినిమాను తెరకెక్కించాను. సైరత్, జునూన్ లాంటి మరాఠీ చిత్రాలు నాకు ఇష్టం. అలాగే సత్య చిత్రాన్ని కనీసం వందసార్లు చూసి ఉంటా. మేకింగ్ పరంగా మా మూవీ సర్ ప్రైజ్ చేస్తుంది. ఆరేడు నిమిషాల సింగిల్ టేక్ సీన్స్ చేశాం. కిరణ్ అబ్బవరం లాంటి ప్రొడ్యూసర్ దొరకడం నాకే కాదు మా టీమ్ అందరి అదృష్టం. ఇలాంటి చిన్న చిత్రానికి ఇంత మంచి రిలీజ్ ఇస్తున్నారు. నన్ను కిరణ్ గారు చాలా బిలీవ్ చేశారు. ఆయన నాపై పెట్టుకున్న నమ్మకంతో మరింత బాధ్యతగా సినిమాను తెరకెక్కించాను. కంటెంట్ బాగున్న ఎన్నో చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు. కొత్త వాళ్లం మేము చేసిన ఈ సినిమా న్యూ ఏజ్ ఫిలిం మేకింగ్ గా పేరు తెచ్చుకుంటుంది.
  • మా మూవీలో నటించిన వారిలో ఏపీ తెలంగాణ నుంచి పలు జిల్లాల నుంచి వచ్చిన వారున్నారు.సురభి వంటి నాటకాల నుంచి వచ్చిన ఆర్టిస్టులున్నారు. ఈ సినిమా నాలాంటి ఎంతోమంది కొత్త వాళ్ల కల.మా మూవీ సక్సెస్ అయితే మరింతమంది కొత్త వాళ్లను నిర్మాతలు నమ్మే పరిస్థితి ఏర్పడుతుంది. అవకాశాలు పెరుగుతాయి. మా సన్నిహితులు, తెలిసిన వాళ్ల కోసం కొన్ని షోస్ వేసుకున్నాం. మూవీ చూసినవాళ్లందరికీ నేను చెప్పాలనుకున్న పాయింట్ కనెక్ట్ అయ్యింది.
  • పర్ ఫార్మెన్ పరంగా ప్రతి ఆర్టిస్ట్ చాలా బాగా చేశారు.హీరో హీరోయిన్స్ సహా అందరి నటన ఆకట్టుకుంటుంది. మీకు మూవీలో ప్రతి ఒక్కరూ కీలకమైన క్యారెక్టర్ లాగే అనిపిస్తారు. అట్మాస్ సహా టెక్నికల్ గా క్వాలిటీగా మూవీ చేశాం. ప్రతి పాట దేనికది భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకున్నాను. ప్రస్తుతం ఐదారు కథలు సిద్ధం చేసుకున్నాను. మన చుట్టూ ఉన్నస్టోరీస్ ను తెరకెక్కించాలనేది నా కోరిక.
TFJA

Recent Posts

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

22 hours ago

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

1 week ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

1 week ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

1 week ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

1 week ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

1 week ago