పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ ల ప్రతిష్టాత్మక చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ప్రకటన

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా కల్ట్ కెప్టెన్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తెలుగు సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం ప్రకటించింది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ప్రత్యేక విందుగా నిలవడంతో పాటు, అన్ని వయసుల ప్రేక్షకులను అలరించేలా వినోదభరితంగా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి గీతం ‘దేఖ్‌లేంగే సాలా’లో పవన్ కళ్యాణ్ కనిపించిన తీరు కట్టిపడేసింది. లుక్, ఎనర్జీ, స్టెప్పులు పరంగా వింటేజ్ పవర్‌స్టార్ ను ఆవిష్కరించింది ఈ పాట.

అభిమాని నుంచి దర్శకుడిగా మారిన హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్ తో రూపొందించిన గత చిత్రం ‘గబ్బర్ సింగ్’తో ఎంతటి సంచలనాలు సృష్టించారో తెలిసిందే. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో అంతకుమించిన సంచలనాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు. కుటుంబాలతో కలిసి ప్రేక్షకులు థియేటర్లకు తరలి వెళ్లి, పవర్‌ప్యాక్డ్ వినోదాన్ని ఆస్వాదించేలా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రూపుదిద్దుకుంటోంది.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఆ సందడే వేరు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. మార్చి 26న అసలుసిసలైన పవర్‌స్టార్ వేడుకకు సిద్ధంగా ఉండండి.

తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశిఖన్నా, పార్థిబన్ కె యస్ రవికుమార్, ఎల్ బి శ్రీరామ్, రావు రమేష్, రాంకీ, కె జి ఎఫ్ అవినాష్ తదితరులు.

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్
కథనం: కె. దశరథ్, రమేష్ రెడ్డి
రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, చంద్ర మోహన్
కూర్పు: కార్తిక శ్రీనివాస్
కళ: ఆనంద్ సాయి
సీఈఓ: చెర్రీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు: ఆర్. చంద్రశేఖర్, దినేష్ నరసింహన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: హరీష్ పై
ఫైట్స్: రామ్–లక్ష్మణ్, నబకాంత్, పృథ్వీ
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

TFJA

Recent Posts

అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. ‘అమ్మ కనకదుర్గ’ అంటూ సాగే భక్తి గీతాన్ని విజయవాడలో ఆవిష్కరించిన తమన్ అండ్ టీమ్

నవరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బిర్లా స్టూడియోస్, టెంపుల్ టౌన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భక్తిరస చిత్రం ‘కనకదుర్గ’ నుంచి తొలి…

2 days ago

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, నందమూరి శ్రీమంతుని

శ్రీ మహా సుబ్రహ్మణ్య వేదవేదాంగ విద్యాపీఠమ్ వద్ద నందమూరి బసవ రామ తారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుండి వస్త్ర…

2 days ago

మా నమ్మకం నిజమైంది.. తెలుగునాట ‘జైలర్ 2’ ప్రభంజనంపై సంతోషం వ్యక్తం చేసిన సూర్యదేవర నాగవంశీ

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కలయికలో రూపొందిన 'జైలర్' చిత్రం 2023లో విడుదలై ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే.…

3 days ago

‘ఐ హేట్ మ్యారేజ్ ’ టీజర్‌ విడుదల

సుగి విజయ్, జుప్సీ భద్ర (తొలి పరిచయం) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘ఐ హేట్ మ్యారేజ్ ’ ఆర్య…

3 days ago

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారు – సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా

ఇండియన్ సినిమాలో యాక్షన్ హీరో అంటే ఇకపై విజయ్ దేవరకొండ గురించే చెప్పుకుంటారని అన్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి…

3 days ago

“రణబాలి” సినిమాలోని జయమ్మ పాత్ర స్పూర్తితో 400 కుటుంబాలకు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందించిన హీరోయిన్ రశ్మిక

ఏడాది పాటు ఈ సేవా కార్యక్రమం కొనసాగిస్తానని వెల్లడించిన రశ్మిక, రశ్మికను చూసి గర్వపడుతున్నానని స్పందించిన విజయ్ దేవరకొండ సేవా…

5 days ago