“సుమతీ శతకం” టీజర్, ట్రైలర్ కు మాస్ మహారాజా రవితేజ ప్రశంసలు – ఫిబ్రవరి 6న మైత్రి మూవీ మేకర్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విడుదల

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మాణంలో, ఎంఎం నాయుడు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సుమతి శతకం’. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇప్పటికే విజయానికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఇంకా పాటలకు మంచి స్పందన లభించింది. పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు ప్రేక్షకుల నుండి మంచి అభినందనలు లభించాయి. సుభాష్ ఆనంద్ సంగీతం పాటలకు మరింత ప్రాముఖ్యతను పెంచింది. రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే ప్రమోషన్స్ టూర్ లో చక్కటి స్పందన తెచ్చుకుంది సుమతి శతకం చిత్ర బృందం. అలాగే తిరుపతిలోని ఒక కళాశాలలో ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది.

సీరియల్స్ అలాగే బిగ్బాస్ ద్వారా ప్రతి ఇంట్లో ఒకరిగా అందరికీ పరిచయమైన అమర్దీప్ చౌదరి మాస్ మహారాజ్ రవితేజ అభిమాని అని అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రానికి సంబంధించిన కంటెంట్ చూసిన మాస్ మహారాజ్ రవితేజ గారు స్పందిస్తూ… “అమర్దీప్, నీ సినిమా సుమతీ శతకం చిత్ర టీజర్, ట్రైలర్ ఇంకా ఇతర కంటెంట్ చూడడం జరిగింది. నాకు బాగా నచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, నీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.

కాలేజీలలో ప్రమోషన్లు చేస్తున్న సమయంలో హుక్ స్టెప్స్ విద్యార్థులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా టీజర్ ఇంకా ట్రైలర్ కు ప్రమోషన్స్ సమయంలో యువత నుండి ఆంధ్ర, తెలంగాణలో మంచి స్పందన లభించింది. చిత్ర టైటిల్ కూడా ప్రేక్షకులలో ఎంతగానో చొచ్చుకు పోయింది. సాధారణంగా జీరో కట్స్ తో సెన్సార్ కావడం అనేది చాలా అరుదైన విషయం, అటువంటిది ఈ చిత్రానికి జీరో కట్స్ తో యు/ఎ సర్టిఫికెట్ తో పాటు సెన్సార్ బోర్డు నుండి ప్రశంసలు రావడం మరొక ప్రత్యేకమైన విషయం. చాలా రోజులు తరువాత ఫీల్ గుడ్ సినిమాను చూస్తున్నామని సెన్సార్ వారు అభిప్రాయపడ్డారు. తెలుగు రాష్ట్రాలలో మైత్రి మూవీ మేకర్ ద్వారా విడుదలవుతున్న ఈ చిత్రాన్ని ఓవర్సీస్ లోని నార్త్ అమెరికాలో వైబ్రంట్ సినిమాస్, అమెరికాలోని డల్లాస్ లో రవి కొల్లిపార, జై పాకాల విడుదల చేయనున్నారు.

నటీనటులు: అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి, టేస్టీ తేజ, మహేష్ విట్ట, JDV ప్రసాద్ తదితరులు.

సాంకేతిక వర్గం:
బ్యానర్: విజన్ మూవీ మేకర్స్
నిర్మాత: సాయి సుధాకర్ కొమ్మాలపాటి
రచన, దర్శకత్వం: ఎంఎం నాయుడు
సినిమాటోగ్రాఫర్: ఎస్ హలేష్
సంగీతం: సుభాష్ ఆనంద్
ఎడిటర్: నహిద్ మహమ్మద్
పిఆర్ఓ: మధు విఆర్
డిజిటల్ మార్కెటింగ్ : హౌస్ ఫుల్ మీడియా, డిజిటల్ దుకాణం

TFJA

Recent Posts

”తత్వం” సాధించే విజయంతో మా కష్టాలన్నీ మరిచిపోతాం: యువ దర్శకుడు అర్జున్‌ కోలా

అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం' త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌…

7 hours ago

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి

స్నేహా రెడ్డి అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ హీరో అల్లు అర్జున్ భార్యగానే. అయితే ఆమె తనకంటూ…

7 hours ago

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ చిత్రం గొప్ప విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నా: ప‌్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ ’ను అంద‌రూ థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేస్తారు.. సినిమా పెద్ద హిట్ అవుతుంది: ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి…

7 hours ago

చదలవాడ శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపిన ఫిలింక్రిటిక్స్ అసోసియేష్‌న్‌

ఇటీవల జరిగిన నిర్మాతల మండలి ఎన్నికల్లో కోశాధికారిగా ఘనవిజయం సాధించినశ్రీ చదలవాడ శ్రీనివాసరావును ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ సభ్యులు, కార్యవర్గం…

3 weeks ago

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ ఆనంద్ దేవరకొండ ఫిల్మోగ్రఫీలో ఒక బ్యూటిఫుల్ సినిమాగా నిలుస్తుంది: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ

ఆదిత్య హాసన్ రచన చాలా బాగుంది.. ‘ఎపిక్’ ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను: ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా…

3 weeks ago

ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారాసెప్టెంబర్ 18న‘పిఠాపురంలో… అలా మొదలైంది’ విడుదల—ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో…

ప్రముఖ దర్శకులు ‘ప్రేయసి రావే‘ ఫేమ్ మహేష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ చిత్రం సెప్టెంబర్ 18న…

3 weeks ago