తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తూ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతీ ఏటా వివిధ రంగాలలో ప్రజ్ఞాపాటవాలు కనబరిచిన వారికి ఉగాది అవార్డులను అనవా యితీగా అందజేస్తూ వస్తోంది. హైదరాబాద్ లో సీనియర్ ఫిలిం జర్నలిస్ట్ గా పనిచేస్తున్న యు. వినాయకరావు ఫిలిం జర్నలిజంలో చేసిన సేవలకు గుర్తింపుగా విశ్వ గురు ఉగాది అవార్డుకు ఎంపుకయ్యారు. తన సుదీర్ఘమైన కెరీర్ లో చిత్ర పరిశ్రమ వికాసానికి దోహదం చేసే వార్తలను రాయడమే కాదు పలువురు ప్రముఖ నటీనటులపై రచయితగా పలు పుస్తకాలు రాసిన ఆయన లోగడ అనేక అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. ఆదివారం హైదరాబాద్, బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన ప్రత్యేక వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ హైకోర్టు జడ్జి శ్రీమతి శ్రీసుధ చేతుల మీదుగా వినాయకరావు ఈ ఉగాది అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వినాయకరావు స్పందిస్తూ, ఇలాంటి అవార్డులు ప్రోత్సహంతో పాటు బాధ్యతలను గుర్తు చేస్తుంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.