గణేష్, హేమంత్ ,ప్రీతి సుందర్, జాహ్నవి నటించిన SPEED 220 ట్రైలర్ ని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ విడుదల చేశారు.
విజయలక్ష్మి ప్రొడక్షన్ పతాకంపై కొండమూరి ఫణి, మందపల్లి సూర్యనారాయణ, మదినేని దుర్గారావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “SPEED220”
ప్రముఖ దర్శక నిర్మాత తమారెడ్డి భరద్వాజ ట్రైలర్ విడుదల అనంతరం మాట్లాడుతూ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఆర్ఎక్స్ 100 సినిమా మాదిరి ఒక కొత్త కథ. విభిన్నమైనటువంటి పాత్రలతో చక్కటి దర్శకత్వ ప్రతిభతో ఉన్నదని కొనియాడారు.
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ మంచి కథతో మా దర్శకుడు హర్ష మా దగ్గరికి రావడం జరిగింది. కథ వినిన వెంటనే ఈ కథని మా విజయలక్ష్మి ప్రొడక్షన్ సంస్థ ద్వారా సినిమా నిర్మించాలి అని నిర్ణయించుకున్నాం అన్నారు.
ఇదొక మంచి ప్రేమ కథ. ఈ చిత్రం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేమ వల్ల జరిగే ఇబ్బందులు, ప్రేమికులు మధ్యన సంఘర్షణ కళ్ళకి కనిపించే విధంగా దర్శకుడు ఈ సినిమాని తెరకెక్కించారు అన్నారు.
చిత్ర దర్శకుడు హర్ష బీజగం మాట్లాడుతూ నాకు అవకాశం ఇచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు. ఆర్ఎక్స్ 100 ల ఈ చిత్రం కూడా మంచి సక్సెస్ అవుతుందని అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం శేఖర్ మోపురి, కెమెరామెన్ క్రాంతి కుమార్, ఎడిటర్ రామకృష్ణ. టెక్నిషియన్స్ అందరూ వాళ్ల శాఖలలో అద్భుతంగా సినిమాని తీర్చిదిద్దారు
ఆగస్టు 23వ తేదీన దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నటువంటి ఈ SPEED 220 చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాము అన్నారు.
ఈ రోజు (జనవరి 7) బి.ఎ. రాజు గారి 66వ జయంతి. ఆయన కేవలం ఒక వ్యక్తి కాదు, తెలుగు…
డిసెంబర్ 25న రిలీజైన దాదాపు 5 సినిమాల్లో యూనానిమస్ హిట్ టాక్ తెచ్చుకుంది 'శంబాల' సినిమా. బ్లాక్ బస్టర్ టాక్…
వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్ బస్టర్ సిరీస్ కానిస్టేబుల్ కనకం. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించారు.…
చార్మింగ్ స్టార్ శర్వా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో నటిస్తున్న హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'నారి నారి నడుమ మురారి' జనవరి…
మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ 'మన శంకర వర ప్రసాద్ గారు' తో…
రాకింగ్ స్టార్ యష్ సెన్సేషనల్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’లో మెల్లిసా పాత్రలో రుక్మిణి…