‘జనక అయితే గనక’ ట్రైలర్.. సెప్టెంబర్ 7 మూవీ గ్రాండ్ రిలీజ్

Must Read

వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న తాజా చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత ఈ సినిమాను నిర్మించారు.  ఈ చిత్రాన్ని సందీర్ రెడ్డి బండ్ల డైరెక్ట్ చేశారు. సెప్టెంబ‌ర్ 7న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కానుంది.  మంగళవారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. సుహాస్‌కు పెళ్లైన‌ప్పటికీ పిల్ల‌లు వ‌ద్ద‌ని అనుకుంటూ ఉంటాడు. అందుకు కార‌ణం.. ఖ‌ర్చులు పెరిగిపోతాయ‌ని అత‌ని భ‌యం. భార్య‌కు ఏం చెప్పి మెనేజ్ చేస్తున్నాడ‌నేది ఎవ‌రికీ అర్థం కాదు. అతని కుటుంబ స‌భ్యులంద‌రూ పిల్ల‌లు క‌న‌మ‌ని ఎంత బ‌లవంతం చేసినా అంద‌రికీ స‌ర్ది చెప్పేస్తుంటాడనే విష‌యాల‌ను కామెడీ స‌న్నివేశాల‌తో చూపించారు. ఇలాంటి మ‌న‌స్త‌త్వ‌మున్న హీరోకి త‌న భార్య గ‌ర్భ‌వ‌తి అని తెలిసిన‌ప్పుడు ఏం చేస్తాడు.. మ‌ధ్య త‌ర‌గ‌తి వ్య‌క్తి అయిన హీరో ఎవ‌రిపై కేసు వేస్తాడు.. ఎందుకు? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందేనంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

బ‌ల‌గం వంటి సెన్సేష‌న్ బ్లాక్ బ‌స్ట‌ర్ సాధించి దిల్ రాజు ప్రొడ‌క్ష‌న్స్‌లో వ‌స్తోన్న సినిమా ఇది. బ‌ల‌గం సినిమా కంటెంట్‌పై దిల్ రాజు ఎంత న‌మ్మ‌కంగా ఉన్నారో.. అంతే న‌మ్మ‌కంతో ‘జనక అయితే గనక’ సినిమాపై న‌మ్మ‌కంగా ఉన్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, నా ఫేవరేట్ నా పెళ్లాం సాంగ్‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ట్రైల‌ర్ కూడా సినిమాపై ఆస‌క్తిని మ‌రింత పెంచుతుంది.

ఈ సంద‌ర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ ‘‘మ‌ధ్య త‌ర‌గ‌తి తండ్రికి ఉండే క‌ష్టాల‌ను అంద‌రం చూసే ఉంటాం. ప్ర‌తీ ఇంట్లో ఉండేదే. డైరెక్ట‌ర్ సందీప్ త‌న రియ‌ల్ లైఫ్‌లో చూసిన ఇన్సిడెన్స్‌ను బేస్ చేసుకుని క‌థ‌ను త‌యారు చేశారు. దీన్ని హ్యుమ‌ర‌స్‌గా, మంచి కాన్సెప్ట్‌తో సినిమా చేశారు. సినిమా చూశాను. చాలా రోజుల త‌ర్వాత ఓ మంచి సినిమాను మీరు చూడ‌బోతున్నార‌నే న‌మ్మ‌కంతో ఉన్నాం. సెప్టెంబ‌ర్ 7న సినిమాతో మీ ముందుకు వ‌స్తున్నాం. కావాల్సినంత హ్యుమ‌ర్ ఉంటుంది. నాన్ స్టాప్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ ఇది. సుహాస్‌, సంగీర్త‌న జంట ఆన్ స్క్రీన్ చ‌క్క‌గా ఉంటుంది.  సెప్టెంబ‌ర్ 7న‌ ‘జనక అయితే గనక’ సినిమాతో మీ అందరి ముందుకొస్తున్నాం’’ అన్నారు.

నటీనటులు: సుహాస్‌, సంగీర్తన, రాజేంద్రప్రసాద్‌, గోపరాజు రమణ తదితరులు

సాంకేతిక బృందం:

బ్యానర్‌: దిల్‌రాజు ప్రొడక్షన్స్, సమర్పణ: శిరీష్‌, నిర్మాతలు: హర్షిత్‌ రెడ్డి, హన్షితా రెడ్డి, రచన – దర్శకత్వం: సందీప్‌ బండ్ల, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, డీఓపీ: సాయి శ్రీరామ్‌, ఎడిటర్‌: కోదాటి పవన్‌ కల్యాణ్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: అరసవిల్లి రామ్‌కుమార్‌, కాస్ట్యూమ్ డిజైనర్‌: భరత్‌ గాంధీ, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: అకుల్‌, పీఆర్‌ఓ: వంశీకాకా.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News