బండి సరోజ్ కుమార్ ‘పరాక్రమం’ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్

Must Read

బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ (BSK Mainstream) పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం “పరాక్రమం”. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ నుంచి యు/ఎ సర్టిఫికేషన్ పొందింది. ఈ నెల 22న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు “పరాక్రమం” సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో సందీప్ కిషన్, నిర్మాత ఎస్ కేఎన్ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ – ‘పరాక్రమం’ ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన నా మిత్రుడు ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్, హీరో సందీప్ కిషన్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ప్రతి కామన్ మ్యాన్ కు కనెక్ట్ అయ్యే సినిమా. ఈ పోస్టర్ లో మీకు సత్తి బాబు, లోవరాజు అనే రెండు క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. లోవరాజు తండ్రి సత్తిబాబు. ప్రతి ఒక్కరిలో సత్తి బాబు ఉంటాడు లోవరాజు ఉంటాడు. సత్తిబాబు నుంచి లోవరాజుకు జరిగే ట్రాన్సఫర్మేషన్ ఈ సినిమా. కామన్ మ్యాన్ లా బతకడం కష్టం. మీ లైఫ్ లో హీరోలు ఉంటారు విలన్స్ ఉంటారు. ఎన్నో భావోద్వేగాలు ఉంటాయి. అవన్నీ మిమ్మల్ని మీరు తెరపై చూసుకున్నట్లు పరాక్రమం సినిమా ఉంటుంది. నేను అభిమానించే చిరంజీవి పుట్టినరోజున ‘పరాక్రమం’ రిలీజ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. చిరంజీవిని చిరంజీవి అనే పిలుస్తా. ఆయనకు భారతరత్న కూడా చిన్నదే అనేది నా అభిప్రాయం. చిరంజీవి అంటే శిఖరం. ఆయన హీరోగా నాలాంటి ఎంతోమందిని ఇన్స్ పైర్ చేశారు. అన్నారు.

హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ – బండి సరోజ్ కుమార్ చాలా జెన్యూన్ ఫిలింమేకర్. ఆయన వ్యక్తిత్వం కూడా అలాగే ఉంటుంది. ఆయన సినిమా ఈవెంట్స్ కూడా రొటీన్ గా ఉండవు. నేను చెన్నైలో పోర్కాలం అనే సినిమా చూసి ఎవరీ దర్శకుడు అనుకుని ఆశ్చర్యపోయా. ఆయన బండి సరోజ్ కుమార్. ఆ తర్వాత ఆయనను ఫేస్ బుక్ లో వెతికి మరీ టచ్ లోకి వెళ్లా. మనం ఇండస్ట్రీలోకి గెలవడానికే రాము. ఇదొక ప్రయాణం. ప్రేక్షకుల అభిమానం పొందడానికి ప్రయత్నిస్తుంటాం. బండి సరోజ్ కుమార్ అలాంటి జర్నీ చేస్తున్నారు. ఆయన సినిమాలు యూట్యూబ్ లో చూసి నేనూ డబ్బులు పంపించాం. నాకు తెలిసిన వారితో పంపించాం. నేను లౌక్యానికి లొంగుతాను. బండి సరోజ్ కుమార్ లొంగడు. స్వచ్ఛంగా సినిమాలు చేస్తుంటాడు. పరాక్రమం ఒక జెన్యూన్ ఫిల్మ్. ఈ సినిమా మీ ఆదరణ పొందాలి. ఆయనకు ఆయన సినిమాలకు సపోర్ట్ చేసేందుకు నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. అన్నారు.

నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – బండి సరోజ్ కుమార్ డైరెక్టర్ గా నటుడిగా నాకు ఇష్టం. ఆయన టాలెంటెడ్ ఫిలింమేకర్. బండి సరోజ్ కుమార్ మాంగల్యం వంటి సినిమాలు చూసి నేనూ డబ్బులు పంపాను. పరాక్రమం సినిమా మన మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డేకు ఆగస్టు 22న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు నా వంతు సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. పరాక్రమం సినిమా బ్లాక్ బస్టర్ అయినా, సూపర్ హిట్ అయినా, యావరేజ్ అయినా నేను బండి సరోజ్ కుమార్ తో సినిమా ప్రొడ్యూస్ చేయబోతున్నా. ఎందుకంటే నాకు ప్రతిభ గల కొత్త వారితో పనిచేయడం ఇష్టం. ఆయన లాంటి ప్రతిభావంతులు ఇండస్ట్రీలో ఎదగాలి. పరాక్రమం వంటి చిత్రాలు ఆదరణ పొందితేనే ఇండస్ట్రీ బాగుంటుంది, థియేటర్స్ సర్వైవ్ అవుతాయి. ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.

Parakramam Theatrical Trailer | 22 August 2024 | Bandi Saroj Kumar

ఈ కార్యక్రమంలో పరాక్రమం చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

నటీనటులు : బండి సరోజ్ కుమార్, శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్, శశాంక్ వెన్నెలకంటి, వంశీరాజ్ తదితరులు

టెక్నికల్ టీమ్

బ్యానర్ : బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్
కథ, కథనం, మాటలు,ఎడిటర్, సంగీతం, లిరిక్స్, నిర్మాత, దర్శకుడు – బండి సరోజ్ కుమార్
సినిమాటోగ్రఫీ – వెంకట్ ఆర్ ప్రసాద్
సౌండ్ డిజైన్ మరియు మిక్సింగ్ : కాళీ ఎస్ ఆర్ అశోక్
కలరిస్ట్ – రఘునాథ్ వర్మ
ఆర్ట్ : ఫణి మూసి
ఫైట్స్ – రాము పెరుమాళ్ల
డ్యాన్స్ – రవి శ్రీ
పబ్లిసిటీ డిజైనర్ : లక్కీ డిజైన్స్
పి ఆర్ ఓ : పాల్ పవన్

Latest News

Nandamuri Balakrishna The Rage of Daaku Song from Daaku Maharaaj Released!

The lyrical video of The Rage of Daaku from the upcoming action-packed entertainer Daaku Maharaaj has been unveiled, delivering...

More News