ఘనంగా భాగ్ సాలే సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం

Must Read

శ్రీసింహా కోడూరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా భాగ్ సాలే. నేహా సోలంకి నాయికగా కనిపించనుంది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి దర్శకత్వంలో  క్రైమ్ కామెడీ గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై బిగ్ బెన్, సినీ వ్యాలీ మూవీస్ అసోసియేషన్ తో అర్జున్ దాస్యన్, యష్ రంగినేని, కళ్యాణ్ సింగనమల నిర్మించారు. జూలై 7న భాగ్ సాలే విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను హీరో కార్తికేయ విడుదల చేశారు. ఈ సందర్భంగా

BHAAG SAALE Trailer | Sri Simha Koduri, Neha Solanki | Kaala Bhairava | Praneeth Bramandapally

హీరోయిన్ నందినీ రాయ్ మాట్లాడుతూ – ఈ సినిమా, ఈ క్యారెక్టర్ నాకు చాలా చాలా స్పెషల్. నా కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇలాంటి మంచి అవకాశాన్ని ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. కాలభైరవ సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. ఆయనకు కంగ్రాట్స్ చెబుతున్నాం. జూలై 7 గుర్తుపెట్టుకోండి. మా సినిమాను థియేటర్ లో చూడండి. అని చెప్పింది.

నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ – క్రైమ్ కామెడీ అనేది తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన జానర్. గతంలో మనీ మనీ, క్షణ క్షణం, బ్రోచేవారెవరురా, స్వామి రారా వంటి సినిమాలను విజయవంతం చేశారు. పాండమిక్ తర్వాత ఓ కొత్త జానర్ లో సినిమా చేయాలని అనుకుంటూ ఈ చిత్రాన్ని ప్రారంభించాం. కామెడీ సినిమాలు వస్తున్నాయి గానీ మంచి క్రైమ్ కామెడీలు రావడం లేదు. శ్రీ సింహాకు పేరు తెచ్చే సినిమా అవుతుంది. జూలై 7న సురేష్ డిస్ట్రిబ్యూషన్స్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నాం. అన్నారు

సంగీత దర్శకుడు కాలభైరవ మాట్లాడుతూ – ఈ సినిమాకు వర్క్ చేస్తున్నప్పుడు మంచి ఫన్ తో ఎంటర్ టైనింగ్ గా రెండు గంటల సమయం సరదాగా తెలియకుండా గడిచిపోయింది. రేపు థియేటర్ లో ప్రేక్షకులకు కూడా ఇలాంటి అనుభూతే కలుగుతుందని ఆశిస్తున్నాం. ఈ ఫన్ ను మిస్ కావొద్దు. థియేటర్ కు వచ్చి చూడండి. అన్నారు

దర్శకుడు ప్రణీత్ మాట్లాడుతూ – భాగ్ సాలే అనేది క్రేజీ సౌండింగ్. ఆ పేరులోనే ఫన్ క్రియేట్ అవుతుంది.ఈ మధ్య మేము విడుదల చేసిన వరల్డ్ ఆఫ్ భాగ్ సాలేకు అద్భుతమైన స్పందన వచ్చింది. అది చూశాక మాకు మరింత నమ్మకం వచ్చింది. ఇది పూర్తిగా హైదరాబాద్ బేస్డ్ మూవీ. సినిమా షూటింగ్ కూడా సికింద్రాబాద్, వారాసిగూడ, ఓల్డ్ సిటీలో జరిపాం. షూటింగ్ ప్రాసెస్ లో హీరో శ్రీ సింహాతో పాటు నిర్మాతలు అర్జున్, కళ్యాణ్ గార్లు బాగా సపోర్ట్ చేశారు. మంచి ఇరానీ ఛాయ్ లాంటి సినిమా మాది. అని చెప్పారు.

హీరో శ్రీ సింహా కోడూరి మాట్లాడుతూ – ఈ చిత్రంలో నా పాత్ర పేరు అర్జున్. అతనో టక్కరి దొంగ. తను చేయాలనుకున్నవి చేసేసినట్లు కటింగ్ ఇస్తుంటాడు. తన పని అయ్యేలా చూసుకుంటాడు. విలువైన ఉంగరం దొరకడం వల్ల అర్జున్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా సక్సెస్ పట్ల నమ్మకంతో ఉన్నాం. అన్నారు.

హీరో కార్తికేయ మాట్లాడుతూ – భాగ్ సాలే ట్రైలర్ చూశాను. ఈ ట్రైలర్ చూశాక టైటిల్ బాగా సెట్టయింది అనిపించింది. చాలా ఎంటర్ టైనింగ్ గా సినిమా ఉంటుంది. సినిమాలోని అన్ని క్యారెక్టర్స్ ఎనర్జీతో ఉన్నాయి. ఇప్పటిదాకా భాగ్ సాలే అంటే మహేష్ పాట గుర్తుకొచ్చేది. ఇప్పుడీ సినిమా గుర్తుకొస్తుంది. తన ఇంట్లో ఎంతోమంది గొప్ప టెక్నీషియన్స్ ఉన్నా..శ్రీసింహా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతని సింప్లిసిటీ నాకు బాగా నచ్చుతుంది. ఈ సినిమా శ్రీ సింహాకు పెద్ద హిట్ కావాలి. అన్నారు.

నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ – వరల్డ్ ఆఫ్ భాగ్ సాలే నాకు బాగా నచ్చింది. ఇలా కథను చెప్పడం ఆకట్టుకుంది. ప్రొడ్యూసర్ అర్జున్ అన్న నాకు మంచి ఫ్రెండ్. శ్రీ సింహా ఎంచుకునే కథలు ఇంప్రెస్ చేస్తుంటాయి. ఆయన డేట్స్ దొరక్కుంటే ఆ కథల్లో నటించాలని అనిపిస్తుంటుంది. ఈ టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News