టి ఎస్ఆర్ మూవీ మేకర్స్ అధినేత తిరుపతి శ్రీనివాసరావు నిర్మించిన కొబలి వెబ్ సిరీస్ ఈ నెల 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది
ఏడు భాషల్లో విడుదలైన కోబలి.. అన్ని భాషల్లోనూ సూపర్ హిట్ అనిపించుకుంటోంది. ఈ సిరీస్ కు ఇంత మంచి రెస్పాన్స్ రావడం పట్ల నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కోడూరు గ్రామానికి చెందిన తిరుపతి శ్రీనివాసరావు టిఎస్ఆర్ అనే బ్యానర్ ను స్థాపించి ఇంతకు ముందు ‘తికమకతాండ’అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతో ఆయన కొడుకులను హీరోలుగా పరిచయం చేస్తూ నిర్మించిన తికమకతాండ రెండు తెలుగు రాష్ట్రాల్లో 130కి పైగా థియేటర్స్ లో విడుదలై మంచి విజయం సాధించింది. తర్వాత స్ట్రీమింగ్ పార్టనర్ ఆహాలోనూ ఆకట్టుకుంటోంది.మొదటి సినిమా ఇచ్చిన ఉత్సాహంతోనే కోబలి వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఈ సిరీస్ ప్రపంచ వ్యాప్తంగా ఏడు భాషల్లో విడుదలైంది. వీటిలో తెలుగు , హిందీ , తమిళ్ , మలయాళం , కన్నడ , బెంగాలీ , మరాఠీ భాషల్లో డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోందిప్పుడు.
‘కోబలి’ సిరీస్ లో రవి ప్రకాష్, రాకీ సింగ్, తరుణ్ రోహిత్, శ్రీతేజ్, శ్యామల, యోగి ఖత్రి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఫ్యాక్షన్ డ్రాప్ లో రివెంజ్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ కు ఆడియన్స్ నుంచి గొప్ప స్పందన వస్తోంది. డిస్నీ ప్లస్ లో ఇలాంటి కంటెంట్ ఇంతకు ముందు చూడలేదు అనేలా యాక్షన్ సీక్వెన్స్ లను రూపొందించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ రివెంజ్ డ్రామాలోని ఇంటెన్స్ కు ప్రేక్షకులకు ఫిదా అవుతున్నారు. రేవంత్ లెవక డైరెక్ట్ చేసిన ఈ సిరీస్ తో ఇన్నాళ్లూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే కనిపించిన రవి ప్రకాష్ మెయిన్ లీడ్ కు వచ్చి అద్భుతంగా ఆకట్టుకున్నాడు. యాక్షన్, ఎమోషనల్ సీన్స్ లో అతని నటన కట్టిపడేస్తుంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమాల్లో రివెంజ్ అనేది కామన్ గానే ఉన్నా.. ఈ సిరీస్ లోని రివెంజ్ కు సంబంధించిన ప్లాట్ సరికొత్తగా ఉండటంతో ప్రేక్షకులు మరింత థ్రిల్ అవుతున్నారు.
Megastar Chiranjeevi has yesterday ( 19 March 2025 ) added another jewel to his crown……
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘జాక్ - కొంచెం క్రాక్’. వైష్ణవి…
టాలీవుడ్లో నిర్మాతగా దిల్ రాజుకి ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే…
ఖురేషి అబ్రామ్ యొక్క చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టండి: మార్చి 20న మలయాళ సూపర్‌స్టార్, కంప్లీట్‌యాక్టర్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్…
American actor Kyle Paul took to his social media to share his thoughts about starring…
రాకింగ్ స్టార్ యష్.. లేటెస్ట్ సెన్సేషనల్ పాన్ ఇండియా మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ గురించి అమెరికన్…