‘తిరగబడరసామీ’ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్: హీరో రాజ్ తరుణ్     

Must Read

యంగ్ అండ్ ప్రామెసింగ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ ‘తిరగబడరసామీ’. మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యూత్ ని ఆకట్టుకునే రోమాన్స్ తో పాటు ఫ్యామిలీని ఆకర్షించే సెంటిమెంట్, మాస్ ని అలరించే హై వోల్టేజ్ యాక్షన్, ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు మంచి బజ్ క్రియేట్ చేసి సినిమాపై క్యురియాసిటీని పెంచాయి. ఈ చిత్రం ఆగస్ట్ 2న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా షో రీల్ ని స్క్రీన్ చేశారు.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ..’ఈ ఈవెంట్ విచ్చేసిన అందరికీ థాంక్ యూ. మా దర్శకుడు రవికుమార్ చౌదరి గారు తిరగబడరసామీ కథ చెప్పగానే విపరీతంగా నచ్చి వెంటనే చేస్తానని చెప్పాను. ఆయన చాలా హార్డ్ వర్క్ చేశారు. గొప్పగా హ్యాండిల్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్స్ అన్నీ వున్న సినిమా ఇది. ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ మంచి ఎంటర్‌టైనర్. మా నిర్మాత శివకుమార్ గారు ప్రాణం పెట్టి చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్. మాల్వీ మల్హోత్ర చాలా మంచి యాక్టర్. ఇది ఆమె తొలి తెలుగు సినిమా. ఆమెను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. సినిమా కోసం అందరం కష్టపడ్డాం. కానీ మా కెమరామెన్ జవహర్ రెడ్డి గారు మా అందరి కంటే ఎక్కువ కష్టపడ్డారు. మా సినిమాని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.  

డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి మాట్లాడుతూ.. చాలా గ్యాప్ తర్వాత వస్తున్నాను. చాలా రోజుల తర్వాత నాకు దర్శకత్వం అవకాశం ఇచ్చిన నిర్మాత శివకుమార్ గారికి థాంక్స్. ఆయన చాలా మంచి లోకేషన్స్, యాక్టర్స్ ఇచ్చారు. జవహర్ రెడ్డి అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. రాజ్ తరుణ్ ప్రాణం పెట్టి చేశాడు. ఈ క్యారెక్టర్ ని చాలా బ్యాలెన్స్ గా చేశారు. మాల్వి తెలుగమ్మాయిలానే వుంటుంది. చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ థాంక్స్’ చెప్పారు.

హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాట్లాడుతూ.. ‘‘మంచి టీమ్‌తో కలిసి వర్క్‌ చేసినందుకు హ్యాపీగా ఉంది. అందరూ బాగా సపోర్ట్‌ చేశారు. తెలుగులో పరిచయం చేస్తున్నందుకు ఈ టీమ్‌కు ధన్యవాదాలు. ఇక్కడ మరెన్నో చిత్రాల్లో యాక్ట్‌ చేయాలని ఉంది. మీ అందరి సపోర్ట్ కావాలి’’ అన్నారు.

నిర్మాత మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ.. ‘‘ అందరికీ నమస్కారం. ఆగస్ట్ 2న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. భార్యాభర్తల అనుబంధం గురించి సినిమాలో అద్భుతంగా చూపించాం. తన భార్యను కాపాడుకోవడానికి ఒక వ్యక్తి ఏవిధంగా పోరాటం చేశాడనే అంశాన్ని సినిమాలో చాలా అద్భుతంగా దర్శకుడు తెరకెక్కించారు. సినిమా చాలా బావొచ్చింది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా సినిమాని తీర్చిదిద్దాం. అందరూ థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేయాలి’ అని కోరారు.

యాక్టర్ రఘు బాబు మాట్లాడుతూ… ‘తిరగబడరసామీ’.. ఆగస్ట్ 2న  తమ్ముడు రాజ్ తరుణ్ ‘తిరగబడతాడు (నవ్వుతూ)  డైరెక్టర్ ఎ ఎస్ రవికుమార్ చౌదరి గారి యజ్ఞం, పిల్లా లేని జీవితం నాకు చాలా పేరు తీసుకొచ్చాయి. వారి డైరెక్షన్ లో మరోసారి చేయడం చాలా ఆనందంగా వుంది. మా నిర్మాత శివ కుమార్ గారు చాలా అద్భుతంగా సినిమా నిర్మించారు. షూటింగ్ అంతా ఒక పిక్నిక్ లా గడిచిపోయింది. సినిమా చాలా ఎక్స్ ట్రార్డినరీ గా వచ్చింది, అందరూ థియేటర్స్ లో చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు. ఈ ఈవెంట్ లో సినిమా యూనిట్ అంతా పాల్గొన్నారు.

తారాగణం: రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా, మకరంద్ దేశ్‌పాండే, రఘు బాబు, జాన్ విజయ్, అంకిత ఠాకూర్, పృధ్వి, ప్రగతి, రాజా రవీంద్ర, బిత్తిరి సత్తి

సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం: ఎ ఎస్ రవికుమార్ చౌదరి
నిర్మాత: మల్కాపురం శివకుమార్
బ్యానర్: సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా
సంగీతం: జెబి &భోలే షావలి
డీవోపీ: జవహర్ రెడ్డి యం. ఎన్
ఎడిటర్: బస్వా పైడిరెడ్డి
ఆర్ట్:  రవికుమార్ గుర్రం
ఫైట్స్ – పృద్వీ, కార్తీక్
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ, శ్రీమణి
పీఆర్వో: వంశీ శేఖర్

Latest News

తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌

సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా...

More News