హై బడ్జెట్ పాన్ ఇండియా చిత్రంలో కలిసి నటిస్తున్నారు.

Must Read

ప్రముఖ తెలుగుచిత్ర నిర్మాత చరణ్ తేజ్ ఉప్పలపాటి అద్భుతమైన ప్రతిభతో బాలీవుడ్‌‌లో అడుగు పెట్టాడు. కొత్త ఉత్సాహంతో
బీటౌన్‌ లో సత్తా చాటడానికి రంగం సిద్దం చేసుకున్నాడు. తాజాగా చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ నటులు కాజోల్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. వీరితో పాటు ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో స్టార్ కాస్టింగ్ నసీరుద్దీన్ షా, సంయుక్త మీనన్, జిషు సేన్ గుప్తా, ఆదిత్య సీల్ తదితరలు భాగస్వామ్యం అయ్యారు.

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో 27 సంవత్సరాల క్రితం మెరుపుకలలు అనే చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇన్నాళ్ల తరువాత మళ్లీ వీరి కలయికలో వస్తున్న సినిమా అంటే ప్రేక్షకులకు చాలా ఉత్సాహం ఉంటుంది. ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ మేకర్స్ ఓ విషయాన్ని వెల్లడించారు. ఈ మాస్ ఎంటర్ టైనర్ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ సైతం పూర్తయిందని తెలిపారు. అతి త్వరలోనే ఈ మూవీకి నుంచి టీజర్ విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపోందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో అందరూ టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన జవాన్ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన జికె విష్ణు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు. అలాగే ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్ మూవీకి పనిచేసిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. అంతే కాదు మై నేమ్ ఈజ్ ఖాన్, వేక్ అప్ సిద్ చిత్రాలతో ప్రసిద్ది గాంచిన నిరంజన్ అయ్యంగార్, జెస్సికా ఖురానా ఈ మూవీకి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా సాహి సురేష్ పనిచేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News