టాలీవుడ్

కొత్త పాయింట్‌తో రాబోతోన్న ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. దర్శకుడు మారుతి

స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పకుడిగా విజయపాల్ రెడ్డి అడిదల నిర్మిస్తున్న ‘బార్బరిక్’ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నారు. వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను,సత్యం రాజేష్, క్రాంతి కిరణ్ వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్‌తో సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇక తాజాగా ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం నాడు రిలీజ్ చేశారు.

‘స్వీయ నాశనానికి మూడు ద్వారాలున్నాయి.. ఇది నువ్వో నేనో చేసే పని కాదు దిమాక్ ఉన్నోడే చేయాలి.. ఒకడు తాచు పాము తోకని తొక్కాడు.. తొక్కిన వాడ్ని పాము కాటేయబోతోంది.. మరి తొక్కించిన వాడి సంగతేంటి?’.. అంటూ అదిరిపోయే డైలాగ్స్‌తో సాగిన ఈ టీజర్‌లో ఎన్నో హైలెట్స్ ఉన్నాయి. టీజర్‌లో సత్యరాజ్, వశిష్ట, సత్యం రాజేష్ ఇలా చాలా పాత్రలకు ఉన్న ఇంపార్టెన్స్‌ను చూపించారు. ఇక టీజర్ చివర్లో వదిలిన షాట్స్, చూపించిన గెటప్స్ నెక్ట్స్ లెవెల్లో ఉన్నాయి. టీజర్ రిలీజ్ అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..

స్టార్ దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘బార్బరిక్ సినిమా కోసం నేనేమీ పని చేయలేదు. ఈ టీంకు సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చాను. ఇది చాలా రిస్కీ జానర్ అని చెప్పాను. మోహన్, రాజేష్ చాలా కాన్ఫిడెన్స్‌తో సినిమాను స్టార్ట్ చేశారు. విజయ్ గారు ఈ సినిమా కోసం చాలా ఖర్చు పెట్టారు. విజయ్ గారు అతి తక్కువ టైంలోనే పెద్ద ప్రొడ్యూసర్ కానున్నారు. విజయ్ గారితో కలిసి జీతెలుగుతో మరో సినిమాను చేయబోతున్నాను. మోహన్ లోపలకి బార్బరికుడు వెళ్లిపోయాడు. మోహన్‌లో చాలా ఎనర్జీ ఉంది. ఈ మూవీని చాలా చక్కగా తీశారు. రమేష్ రెడ్డి గారి కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. ఇంఫ్యూజన్ బ్యాండ్‌ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని ఇచ్చారు. ఈ మూవీ చాలా కొత్తగా ఉంటుంది. మైథలాజికల్ పాయింట్‌లో ఉన్న పాత్ర ప్రజెంట్ జనరేషన్‌కి వస్తే ఎలా ఉంటుందో చూపించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. సత్య రాజ్ గారు బాహుబలి చేశారు.. బార్బరిక్ కూడా చేశారు. ఆయనకు కథ నచ్చితే వెంటనే ఓకే చెబుతారు. ఆయనతో నేను ప్రతిరోజూ పండగే వంటి మంచి సినిమాను చేశాను. ఈ మూవీని అందరూ ఎంకరేజ్ చేయాలి’ అని అన్నారు.

సత్య రాజ్ మాట్లాడుతూ.. ‘బార్బరిక్ టీంకు ఇక ప్రతి రోజూ పండుగే. ఇది పక్కా కమర్షియల్ సినిమా. ఇకపై మేం అంతా రాజా సాబ్‌లమే. డైరెక్టర్ మోహన్ నాకు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమాకు కథే హీరో. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి, రాజేష్ గారు టీంను చక్కగా చూసుకున్నారు. సత్యం రాజేష్ గారు సినిమాలో నాతో పాటే ఉంటారు. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఏజ్డ్ యాక్షన్ హీరో అనే ట్యాగ్ కోసం నేను ప్రయత్నిస్తున్నాను. ఈ మూవీతో నాకు ఆ ట్యాగ్ వస్తుంది. నన్ను తెలుగులో డబ్బింగ్ చెప్పమని అన్నారు. హిందీ, కన్నడ, తమిళంలోనూ డబ్బింగ్ చెప్పాను. ఈ సినిమా పెద్ద హిట్ కాబోతోంది’ అని అన్నారు.

నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల మాట్లాడుతూ.. ‘వానర సెల్యూలాయిడ్ అనేది మా తల్లిదండ్రుల పేరు మీదుగా పెట్టాను. మారుతి గారితో కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఆయనకు ఎప్పుడూ రుణ పడి ఉంటాను. బార్బరిక్ లాంటి పెద్ద సినిమాను చేస్తానని నేను అనుకోలేదు. ఈ మూవీ కోసం ఇంఫ్యూజన్ బాండ్‌ను తీసుకొచ్చాను. సినిమా అద్భుతంగా ఉండబోతోంది’ అని అన్నారు.

దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ.. ‘బార్బరిక్ టైటిల్ గ్లింప్స్‌కు అద్భుతంగా రెస్పాన్స్ వచ్చింది. సత్యం సుందరం సినిమాను చూస్తే.. సుందరం లాంటి ఇద్దరు వ్యక్తులు ఈ స్టేజ్ మీదున్నారు. విజయ్ గారు నేను చెప్పిన కంటెంట్, కథను నమ్మి నాకు కావాల్సినంత బడ్జెట్ ఇచ్చారు. మారుతి గారు నాకు ఎప్పుడూ సపోర్ట్‌గా ఉంటూ స్పూర్తినింపుతూనే ఉన్నారు. సత్యరాజ్ ఈ పాత్రను చాలా ప్రేమించారు. అర్దరాత్రి దాటినా షూటింగ్ చేస్తూ ఉండేవారు. వర్షంలోనే రాత్రి పూట షూటింగ్ చేస్తుండేవారు. సత్యం రాజేష్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. వశిష్ట త్వరలోనే స్టార్ అయిపోతారు. సాంచీ చాలా మంచి అమ్మాయి. క్రాంతి కిరణ్ మంచి స్టార్ అయిపోతాడు. బార్బరికుడికి త్రిబాణాస్త్రం ఉన్నట్టు నాకు మూడు అస్త్రాలున్నాయి. ఒకటి డీఓపీ రమేష్, రెండు ఫ్యూజన్ బాండ్, మూడు ఎడిటర్ మార్తాండ్ కే వెంకటేష్. ఈ మూడు అస్త్రాలతో నేను ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాను’ అని అన్నారు.

సత్యం రాజేష్ మాట్లాడుతూ.. ‘బార్బరిక్ చిత్రం చాలా బాగుంటుంది. నాకు మంచి పాత్ర వచ్చింది. దీని మీద ఎంత బడ్జెట్ పెట్టారో కూడా ఊహించలేరు. మినీ బాహుబలిలా ఉంటుంది. వశిష్ట, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్, యష్న అద్భుతంగా నటించారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత రాజేష్ అందరికీ సపోర్ట్‌గా నిలిచారు. సత్యరాజ్ గారు ఏ ఏజ్ యాక్టర్‌లతో నటిస్తే ఆ ఏజ్ యాక్టర్‌లా మారిపోతారు. ఆయనతో నటించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

హీరోయిన్ సాంచి రాయ్ మాట్లాడుతూ.. ‘బార్బరిక్ టీజర్ అందరికీ నచ్చుతుంది. ఇది నాకు ఫస్ట్ తెలుగు సినిమా. నాకు ఇక్కడ అనంతమైన ప్రేమ లభిస్తుందని ఆశిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. ఈ సినిమా పెద్ద హిట్ కాబోతోంది’ అని అన్నారు.

నటుడు క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. ‘బార్బరిక్ సినిమా చాలా కొత్తగా ఉండబోతోంది. ఇందులో నేను దేవ్ అనే పాత్రను పోషించాను. కొత్త దర్శక, నిర్మాతలకు మారుతి గారు బ్యాక్ బోన్‌లా నిలిచారు. కంటెంట్‌తో వస్తున్న సినిమా ఇది. ఈ మూవీ అందరికీ నచ్చుతుంది. ఇంఫ్యూజన్ బ్యాండ్ ఇచ్చిన పాటలు, ఆర్ఆర్ అద్భుతంగా ఉంటుంది. మున్ముందు మరిన్ని అప్డేట్లతో రాబోతున్నామ’ని అన్నారు.

ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ మాట్లాడుతూ.. ‘త్రిబాణధారి బార్బరిక్ టీజర్ అద్భుతంగా ఉంది. మారుతి గారు మాకు పరిచయమైన దగ్గర్నుంచి ఆయన సినిమా ఆడియో మా ద్వారానే రిలీజ్ అవుతున్నాయి. ఇంఫ్యూజన్ బ్యాండ్ మంచి సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

తారాగణం: సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయ భాను, సత్యం రాజేష్, క్రాంతి కిరణ్, VTV గణేష్, మొట్టా రాజేంద్ర

సాంకేతిక బృందం

బ్యానర్ : వానర సెల్యూలాయిడ్
రచన & దర్శకత్వం : మోహన్ శ్రీవత్స
నిర్మాత : విజయపాల్ రెడ్డి అడిదల
సమర్పణ : మారుతీ టీమ్ ప్రోడక్ట్
ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రాజేష్
లైన్ ప్రొడ్యూసర్ : సురేష్
డీఓపీ : కుశేందర్ రమేష్ రెడ్డి
సంగీతం : ఇన్ఫ్యూజన్ బ్యాండ్
ఎడిటర్ : మార్తాండ్ కె వెంకటేష్
ఆర్ట్ డైరెక్టర్ : శ్రీనివాస్ పున్నాస్
ఫైట్స్ : రామ్ సుంకర
కాస్ట్యూమ్ డిజైనర్ : మహి డేరంగుల
PRO : సాయి సతీష్

Tfja Team

Recent Posts

Love Reddy is trending nationwide on Amazon Prime

"Love Reddy" is a film jointly produced by Geetans Productions, Seheri Studio and MGR Films…

22 hours ago

అమోజాన్ ప్రైమ్ లో నేషనల్ వైడ్ ట్రెండింగ్ అవుతున్న “లవ్ రెడ్డి”, ఆహాలోనూ స్ట్రీమింగ్ అవుతున్న మూవీ

గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం "లవ్ రెడ్డి" . అంజన్ రామచంద్ర,…

22 hours ago

Teaser Of Varun Sandesh’s Mysterious Crime Thriller Constable

The film Constable, starring Varun Sandesh in the lead role, is directed by Aryan Subhan…

23 hours ago

వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ టీజర్ ఉత్కంఠభరితంగా ఉంది.. ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన

క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌లకు ఆడియెన్స్ ఎప్పుడూ మొగ్గు చూపుతూనే ఉంటారు. అలాంటి ఓ ఇంటెన్స్ జానర్ మూవీతో వరుణ్…

23 hours ago

ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మా రామ్ చరణ్ బంగారం.. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’.…

1 day ago

Grand Teaser Launch Event of “Raju Gari Dongalu”

The movie Raju Gari Dongalu, featuring Lohith Kalyan, Rajesh Kunchada, Joshith Raj Kumar, Kailash Velayudhan,…

2 days ago