‘ఆయ్‌’.. ‘కమిటీ కుర్రోళ్ళు’ టీమ్స్ మధ్య ఆస‌క్తిక‌ర‌మైన క్రికెట్ యుద్ధం

Must Read

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ దిన‌దినాభివృద్ది చెందుతోంది. వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో సినిమాల‌ను రూపొందించ‌టానికి మ‌న మేక‌ర్స్ ఆస‌క్తి చూపిస్తున్నారు. సినిమా క‌థ‌, మేకింగ్ విష‌యాల్లోనే కాదు, ప్ర‌మోష‌న్స్ ప‌రంగానూ సినిమాల‌ను వినూత్నంగా ప్ర‌మోట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ్‌, క‌మిటీ కుర్రోళ్ళు సినిమా టీమ్స్ ప్రేక్ష‌కుల‌కు చేరువ‌కావ‌టానికి వినూత్న‌మైన ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌ను సిద్ధం చేశాయి.

సినిమా ప్ర‌మోష‌న‌ల్ ప్లానింగ్‌లో ఇదొక యూనిక్ పాయింట్‌. ఆయ్ సినిమా ఆగ‌స్ట్ 15న రిలీజ్ కానుంది. ఈ చిత్ర యూనిట్ ఆగ‌స్ట్ నెల‌లోనే రిలీజ్ కానున్న క‌మిటీ కుర్రోళ్ళు సినిమా టీమ్‌తో శుక్ర‌వారం క్రికెట్ ఆట‌లో పోటీ ప‌డ‌నుంది. ఆయ్ సినిమా నిర్మాత బ‌న్నీ వాస్‌.. క‌మిటీ కుర్రోళ్ళు చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల క్రికెట్ పోటీకి సిద్ధ‌మంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్ అవుతోంది. రెండు టీమ్స్ మ‌ధ్య జ‌ర‌గ‌బోయే క్రికెట్ మ్యాచ్‌కు సంబంధించి బ‌న్నీ వాస్‌, నిహారిక కొణిదెల మ‌ధ్య జ‌రిగిన స‌ర‌దా చాలెంజ్‌లు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. బ‌న్నీ వాస్ విసిరిన చాలెంజ్‌ను నిహారిక కొణిదెల స్వీక‌రించారు. క‌చ్చితంగా ఆయ్ టీమ్ మీద తమ క‌మిటీ కుర్రోళ్ళు టీమ్ విజ‌యం సాధిస్తుంద‌ని ఆమె న‌మ్మ‌కంగా ఉన్నారు.

జూలై 19 సాయంత్రం ఆరు గంట‌ల‌కు జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌లో నువ్వు గెలుస్తావా.. అంటే నువ్వు గెలుస్తావా అంటూ సాగిన చిట్ చాట్ స‌ర‌దాగా ఉంది. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే ఈ రెండు సినిమాలు గోదావ‌రి బ్యాక్ డ్రాప్‌తోనే తెర‌కెక్కాయి. క్రికెట్‌, మూవీ ల‌వ‌ర్స్‌ను ఈ మ్యాచ్ ఆక‌ట్టుకుంటుంద‌నటంలో సందేహం లేదు.

ఆయ్ సినిమా గురించి:

ఈ సీజ‌న్‌లో తిరుగులేని ఫ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆక‌ట్టుకోనుంది ఆయ్ చిత్రం. నార్నే నితిన్‌, న‌య‌న్ సారిక‌, రాజ్ కుమార్ క‌సిరెడ్డి, అంకిత్ కొయ్య త‌దిత‌రులు ఇందులో ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించారు. ఇండిపెండెన్స్ డే సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 15న ఈ చిత్రం విడుద‌ల కానుంది. అంజి కె.మ‌ణిపుత్ర ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. యండ్ అండ్ టాలెంటెడ్ ప్రొడ్యూస‌ర్‌ బ‌న్నీ వాస్‌, విద్యా కొప్పినీడి సినిమాను నిర్మిస్తున్నారు. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అర‌వింద్ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కిర‌ణ్ కుమార్ మ‌న్నె ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా స‌మీర్ క‌ళ్యాణి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. రామ్ మిర్యాల సంగీతాన్ని స‌మ‌కూరుస్తున్నారు.

క‌మిటీ కుర్రోళ్ళు సినిమా గురించి:

నిహారిక కొణిదెల స‌మర్ప‌ణ‌లోరూపొందుతోన్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రం సినీ ప్రేక్ష‌కుల హృద‌యాల‌ను మెప్పిస్తుంద‌ని చిత్ర యూనిట్ న‌మ్మ‌కంగా ఉంది. ఈ సినిమా కూడా ఆగ‌స్ట్‌లోనే రిలీజ్ కానుంది. సందీప్ స‌రోజ్‌, య‌శ్వంత్ పెండ్యాల‌, త్రినాథ్ వ‌ర్మ‌, ప్ర‌సాద్ బెహ‌రా, ఐశ్వ‌ర్య ర‌చిరాజు, మ‌ణికాంత ప‌రుశు, లోకేష్ కుమార్ ప‌రిమి, శ్యామ్ క‌ళ్యాణ్, ర‌ఘువ‌ర‌న్‌, శివ కుమార్ మ‌ట్ట‌, అక్ష‌య్ శ్రీనివాస్‌, శ‌ర‌ణ్య సురేష్, తేజ‌స్వి రావ్‌, విషిక‌, ష‌ణ్ముకి నాగుమంత్రి త‌దిత‌రులు సినిమాలో న‌టించారు. య‌దు వంశీ ద‌ర‌క్శ‌క‌త్వంలో    పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై   పద్మజ కొణిదెల,జయలక్ష్మి అడపాక ఈ చిత్రాన్ని నిర్మించారు.

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News