ఓ అమ్మాయిని ఎవరో దారుంగా చంపేసుంటారు. ..ఆ హత్యను ఎవరు చేశారని పోలీస్ ఆఫీసర్స్ దర్యాప్తు చేస్తుంటారు. నవీన్ చంద్రను అనుమానిస్తుంటారు. మరో వైపు ఓ హంతకులు ముఠా … హత్యలు చేయటానికి పథకాలు రచిస్తుంటుంది. అసలు చనిపోయిన అమ్మాయి ఎవరు? హంతకుల ముఠాకి, నవీన్ చంద్రకు ఏంటి సంబంధం? అనే విషయం తెలుసుకోవాలంటే ‘తగ్గేదే లే’ సినిమా చూడాల్సిందే అని అంటున్నారు మేకర్స్. శుక్రవారం ఈ సినిమా ట్రైలర్‌ను హీరో నిఖిల్ విడుదల చేసి ఎంటైర్ టీమ్‌కి అభినందనలు తెలిపారు.సీట్ ఎడ్జ్ మూమెంట్స్‌తో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ‘తగ్గేదే లే’. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
యువ కథనాాయకుడు నవీన్ చంద్ర లీడ్ రోల్‌లో నటిస్తోన్న ఈ చిత్రాన్ని ‘దండుపాళ్యం’ ఫేమ్ శ్రీనివాస్ రాజు తెరకెక్కిస్తుున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఇంట్రెస్టింగ్ టీజర్, నైనా గంగూలీ నర్తించిన స్పెషల్ సాంగ్‌కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌తో సినిమాపై ఉన్న ఆసక్తి మరింతగా పెరిగింది. వెంకట్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించిన విజువల్స్.. చరణ్ అర్జున్ మ్యూజిక్ మరింత క్యూరియాసిటీని పెంచుతున్నాయి.దివ్యా పిళ్లై, అనన్య సేన్ గుప్తా హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో నాగబాబు, డానీ కుట్టప్ప, రవి కాలే, మకరంద్ దేశ్ పాండే, అయ్యప్ప పి.శర్మ, నవీన్ చంద్ర, పూజా గాంధీ, రాజా రవీంద్ర, రవి శంకర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. త్వరలోనే సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది.