ఎన్టీఆర్  చిత్రానికి ‘దేవర’ టైటిల్ ఖరారు..

Must Read

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్  చిత్రానికి ‘దేవర’ టైటిల్ ఖరారు.. ఇన్‌టెన్స్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా నుంచి అప్ డేట్ కోసం ఆయ‌న అభిమానులు ఎంతో ఆతృత‌గా ఎదురు చూడ‌సాగారు. శ‌నివారం (మే 20) రోజున‌ తార‌క్ పుట్టిన‌రోజు కావ‌టంతో ఎన్టీఆర్‌30పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ సంద‌ర్భంలో ఆయ‌న‌ నెక్ట్స్ మూవీ ఎన్టీఆర్ 30 సినిమా టైటిల్‌ను ‘దేవర’గా ఖరారు చేస్తూ మేకర్స్ ఖరారు చేశారు. హై యాక్ష‌న్ డ్రామాగా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. 

‘దేవర’ సినిమా ఫస్ట్ లుక్ విషయానికి వ‌స్తే.. ఎన్టీఆర్ ర‌గ్డ్ లుక్‌తో పంచె క‌ట్టుకుని స్టైల్‌గా నిల‌బ‌డి ఉన్నారు. ఆ ఫ‌స్ట్ లుక్‌లో రా, ఇన్‌టెన్స్ క‌నిపిస్తోంది. ఇప్పుడు ఇంట‌ర్నెట్ అంతా ఈ లుక్ తుపానులా ట్రెండ్ అవుతోంది. దేవ‌ర అంటే దేవుడు అని అర్థం. పాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్ర‌రం యాక్ష‌న్ జోన‌ర్‌లో స‌రికొత్త బెంచ్ మార్క్‌ని క్రియేట్ చేయ‌నుంది. 

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో   ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్స్‌పై కొస‌రాజు హ‌రికృష్ణ‌, సుధాక‌ర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను ఏప్రిల్ 5 2024లో విడుదల చేస్తున్నారు. ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. 

అనిరుద్ ర‌విచంద‌ర్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ చిత్రానికి ఆర్‌.ర‌త్న‌వేలు సినిమాటోగ్ర‌ఫీ, సాబు సిరిల్ ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్‌, శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిటింగ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.

Latest News

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’

ధ‌నుష్‌, కృతి స‌న‌న్ సూప‌ర్బ్ కెమిస్ట్రీతో ఆక‌ట్టుకుంటోన్న ‘అమ‌ర‌కావ్యం’ (తేరే ఇష్క్ మై) ట్రైల‌ర్‌.. హిందీతో పాటు త‌మిళ‌, తెలుగులోనూ థియేట‌ర్స్‌లో సంద‌డి చేస్తోన్న‌సినిమా ధనుష్, కృతి...

More News