‘మహావీరుడు’ ఏసియన్ సినిమాస్ ద్వారా తెలుగులో విడుదల

Must Read

వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో శివ కార్తికేయన్‌.. ప్రస్తుతం మడోన్‌ అశ్విన్‌ దర్శకత్వంలో చేస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మహావీరుడు’. ఈ చిత్రాన్ని శాంతి టాకీస్‌ పతాకంపై అరుణ్‌ విశ్వ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శివ కార్తికేయన్‌ కు జోడిగా అదితి శంకర్ నటిస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మహావీరుడు తెలుగు రైట్స్ ని ఏసియన్ సినిమాస్ సొంతం చేసుకుంది. ఏసియన్ సినిమాస్  ద్వారా ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో విడుదల కానుంది.  

ఈ చిత్రానికి విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ అందిస్తుండగా భరత్ శంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కుమార్ గంగప్పన్ ఆర్ట్ డైరెక్టర్.



‘మహావీరుడు’ జూలై 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది

తారాగణం: శివ కార్తికేయన్‌, అదితి శంకర్
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం – మడోన్ అశ్విన్
నిర్మాత – అరుణ్ విశ్వ
విడుదల: ఏసియన్ సినిమాస్
డీవోపీ – విధు అయ్యన్న
సంగీతం – భరత్ శంకర్
ఎడిటర్ – ఫిలోమిన్ రాజ్
ఆర్ట్ డైరెక్టర్ – కుమార్ గంగప్పన్
పీఆర్వో: వంశీ శేఖర్

Latest News

సినీ ప్రముఖుల చేతుల మీదుగా‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ టీజర్, ట్రైలర్ లాంచ్

తెలుగు సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి బ్యూటీఫుల్ యూత్ ఫుల్ లవ్ స్టోరీ రాబోతోంది. మోహన్ సిద్ధి, మహన్, శృతి శంకర్ హీరోహీరోయిన్లుగా, రమేష్ చెరుకూరు దర్శకత్వంలో, సావిత్రమ్మ...

More News