యాక్టర్ వెంకట్ చేతుల మీదుగా ‘రుద్రాక్షపురం’ టీజర్ విడుదల

Must Read

ధీక్షిక సమర్పణలో మ్యాక్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై మణి సాయితేజ, వైడూర్య, పవన్ వర్మ రేఖ తారాగణంగా.. ఆర్.కె. గాంధీ దర్శకత్వంలో కొండ్రాసి ఉపేందర్ నిర్మిస్తున్న చిత్రం ‘రుద్రాక్షపురం 3 కి.మీ.’.

పక్కా యాక్షన్ థ్రిల్లర్ ఓరియంటెడ్‌ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మేకర్స్ తాజాగా టీజర్‌‌ని విడుదల చేశారు. టాలెంటెడ్ యాక్టర్ వెంకట్ ఈ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

టీజర్‌లో.. ‘ఏదో సాధించాలని వెళుతున్నారు.. అనుకోకుండా చావు ఎదురైంది. భయంతో పరుగులు తీస్తే అది వెంటపడింది. చస్తే సమాధికి, బతికితే ఇంటికి.. తిరగబడితే జయం నిశ్చయం అయింది. జయం నిశ్చయం’ అంటూ పవర్ ‌ఫుల్ వాయిస్ ఓవర్‌లో టీజర్ నడవగా.. ఆ వాయిస్‌కి అనుగుణంగా అదిరిపోయే యాక్షన్‌తో ఈ టీజర్‌ ఉంది. యాక్షన్ థ్రిల్లర్‌కి కావాల్సిన కంటెంట్ ఇందులో పుష్కలంగా ఉందనేలా టీజర్‌‌ని కట్ చేశారు.

ఈ టీజర్ విడుదల చేసిన అనంతరం హీరో వెంకట్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో హీరోలుగా నటించిన మణి సాయితేజకు, పవన్ వర్మకు, డైరెక్టర్ ఆర్.కె.గాంధీగారికి, మీడియా సూపర్ హీరోస్ సురేష్ కొండేటి, వీరబాబు, అప్పాజీగార్లకి.. ఇంకా చిత్రయూనిట్ మొత్తానికి నా శుభాకాంక్షలు. టీజర్ చూశాను. చాలా బాగుంది. మంచి యాక్షన్‌తో కూడిన థ్రిల్లర్ ఇదని అనిపించింది. అందరూ ఈ సినిమాని థియేటర్లలో చూసి విజయవంతం చేయండి. మరొక్కసారి నా బెస్ట్ విశెష్‌ని చిత్రయూనిట్‌కి తెలియజేస్తున్నానని అన్నారు.

చిత్ర దర్శకుడు ఆర్.కె. గాంధీ మాట్లాడుతూ.. ‘‘మా ‘రుద్రాక్షపురం 3 కి.మీ.’ చిత్ర టీజర్‌ని ఆవిష్కరించిన హీరో వెంకట్‌గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాలో ఆయన కూడా ఓ మెయిన్ రోల్ చేయాల్సి ఉంది. కానీ.. ఆయన బిజీగా ఉండటం కారణంగా కుదరలేదు. ఆయన చేయాల్సిన పాత్రని సురేష్ కొండేటిగారు చేశారు. ఇప్పుడు వెంకట్‌గారి చేతులు మీదుగా ఈ టీజర్ విడుదలవడం చాలా సంతోషంగా ఉంది. జూన్ 23న సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ప్రమోషన్స్ కోసం సాంగ్స్, ట్రైలర్ అన్నీ రెడీ అవుతున్నాయి. ఈ సినిమాని థియేటర్లలో చూసి.. ఆశీర్వదించాలని కోరుతున్నాను..’’ అని అన్నారు.

‘సంతోషం’ సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ‘శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి’ సినిమా అప్పటి నుంచి వెంకట్‌తో మంచి పరిచయం ఉంది. మా ఫ్యామిలీకి ఫ్రెండ్. అలాంటిది వెంకట్‌గారు చేయాల్సిన పోలీస్ ఆఫీసర్ పాత్ర నాకు రావడం చాలా అదృష్టంగా ఫీలవుతున్నాను. దర్శకుడు గాంధీ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయన నన్ను కలిసి ఇలా పాత్ర చేయాలి అని అడగగానే.. ముందు గెటప్ చూద్దాం.. బాగుంటే తప్పకుండా చేస్తానని చెప్పాను. గెటప్ ఓకే అవడంతో.. ఈ సినిమాలో పోలీస్ అధికారి పాత్రలో తొలిసారి యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించాను. వెంకట్‌గారు చేయాల్సిన పాత్ర అంటే ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటుందో తెలిసిందే. ఆయన చేతుల మీదుగా ఈ టీజర్ విడుదల కావడం చాలా సంతోషంగా అనిపించింది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నానని తెలిపారు.

పీఆర్వో ధీరజ్ అప్పాజీ మాట్లాడుతూ.. అతి త్వరలో అగ్ర దర్శకుడయ్యే లక్షణాలు దర్శకుడు గాంధీలో ఉన్నాయి. అతని దర్శకత్వంలో వెంకట్ హీరోగా ఓ సినిమా ఉండబోతుంది. ఇక ‘రుద్రాక్షపురం 3కి.మీ’ విషయానికి వస్తే.. ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్న నిర్మాత ఉపేందర్‌గారి అబ్బాయికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.

పీఆర్వో వీరబాబు మాట్లాడుతూ.. ఈ సినిమాలో నాకో మంచి పాత్రని ఇచ్చిన గాంధీగారికి, నిర్మాతలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు.

చిత్ర హీరో సాయి మణితేజ మాట్లాడుతూ.. టీజర్ విడుదల చేసిన వెంకట్‌గారికి ధన్యవాదాలు. ఈ సినిమాలో అనుకోకుండా నేను హీరోగా చేయడం జరిగింది. ఫస్ట్ లుక్‌ని ప్రకాశ్ రాజ్‌గారు విడుదల చేసిన తర్వాత.. హీరో ఇంకా ఫైనల్ కాలేదు. అప్పుడు నేను దర్శకుడు గాంధీగారికి కనిపించడంతో.. ఆయన ఈ సినిమాలో హీరో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారు. చాలా మంచి పాత్ర ఇచ్చి ఎంకరేజ్ చేసిన దర్శకుడు గాంధీగారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని అన్నారు. మరో నటుడు పవన్ వర్మ మాట్లాడుతూ.. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.

నిర్మాత కొండ్రాసి ఉపేందర్ మాట్లాడుతూ.. ఈ సినిమా టీజర్‌ని విడుదల చేసిన వెంకట్‌గారికి ధన్యవాదాలు. ఆయనతో నాకు తెలియని బంధం ఉంది. నా మ్యారేజ్ అయిన కొత్తలో నా భార్యతో కలిసి చూసిన మొట్టమొదటి చిత్రం ఆయన నటించిన చిత్రమే. అందుకే ఆయనలానే నా బిడ్డని హీరోని చేయాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు నా కుమారుడిని హీరోగా ఈ సినిమాతో పరిచయం చేయడం, చిత్ర టీజర్‌ని వెంకట్‌గారు విడుదల చేయడం.. దైవ సంకల్పంగా భావిస్తున్నాను. ఈ సినిమా కోసం గాంధీగారు చాలా కష్టపడ్డారు. మంచి అవుట్‌ఫుట్ వచ్చింది. నేను ఆల్రెడీ సినిమా చూశాను. ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు.

మణి సాయితేజ, పవన్ వర్మ, వైడూర్య, రేఖ, వీరబాబు, నాగమహేశ్, ధీరజ్ అప్పాజీ, సురేష్ కొండేటి, శ్రీవాణి, సునంద, అజయ్ రాహుల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
సినిమాటోగ్రఫీ: ఎం. నాగేంద్ర కుమార్
సంగీతం: గంటాడి కృష్ణ, ఎమ్.ఎల్. రాజా జయసూర్య బొంపెం
పాటలు: జయసూర్య బొంపెం ,ఎం ఎల్ రాజ, గంటాడి కృష్ణ
స్టంట్స్: బాజి, స్టార్ మల్లి, థ్రిల్లర్ మంజు
ఎడిటింగ్: డి. మల్లి
పీఆర్వో: వీరబాబు,
నిర్మాతలు: కొండ్రాసి ఉపేందర్,
కథ, స్ర్కీన్‌ప్లే, డైలాగ్స్, దర్శకత్వం: ఆర్.కె. గాంధీ

Latest News

ప్రాంతీయ విపత్తుల నివారణకు 5 దేశాల హిమాలయ బోర్డు ఏర్పాటుకు సద్గురు పిలుపు; నేపాల్ ప్రధాని విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళం ప్రకటన

ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్”  కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal

More News