‘ఓసారైనా చూడవే ఉండిపోవే ఉండిపోవే..
వింటావా నా మాటనే ఉండిపోవే ఉండిపోవే..
మనసే ఇరుకై నలిగా నేనే
గదిలో నువ్వు లేక
నిదుర కుదురు చెదిరిపోయే
నువ్విలా వదిలాక’
అంటూ దూరమైన భార్యపై తన ప్రేమను వ్యక్తం చేస్తున్న భర్త మనసులోని బాధ, ప్రేమ ఏంటో తెలుసుకోవాలంటే ‘జనక అయితే గనక..’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 12న విడుదల చేస్తున్నారు.
బలగం వంటి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి మరోసారి అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ‘జనక అయితే గనక’ విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నువ్వే నాకు లోకం…’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాటను కృష్ణకాంత్ రాయగా.. కార్తీక్ పాడారు.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘మా ఇంటి…
యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీ ‘లెనిన్’ శరవేగంగా రూపొందుతోంది. ఈ సినిమాపై మంచి అంచనాలు…
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్,…
గత ఏడాది బ్లాక్ బస్టర్ మూవీ ‘సైయారా’ కాంబో మళ్లీ మన ముందుకు రావటానికి సమాయత్తమవుతోంది. సైయారా అద్భుత విజయంతో…
ఎమ్మెస్ రాజు అంటే ఒక బ్రాండ్. సుమంత్ ఆర్ట్స్ పతాకంపై ఆయన నిర్మించిన "శత్రువు, దేవి, మనసంతా నువ్వే, ఒక్కడు,…
అలనాటి నటి, గాయని, నిర్మాత కృష్ణవేణమ్మ జీవితాన్ని గ్రంధస్తం చెయ్యడం ఎంతో సంతోషంగా ఉందని, ఆమె జీవితం నేటి తరానికి…