“తల్లి మనసు” షూటింగ్ పూర్తి

రచిత మహాలక్ష్మి, కమల్ కామరాజు, సాత్విక్, సాహిత్య ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం “తల్లి మనసు”.
ముత్యాల మూవీ మేకర్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య సమర్పణలో ఆయన తనయుడు ముత్యాల అనంత కిషోర్ నిర్మాతగా తొలిసారి సినీరంగంలోకి అడుగుపెట్టి నిర్మిస్తున్న చిత్రమిది. .పలువురు ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో విశేష అనుభవం గడించిన వి.శ్రీనివాస్ (సిప్పీ) దీని ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు.

ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్మాత ముత్యాల అనంత కిషోర్ మాట్లాడుతూ, “సన్నివేశాలకు అనుగుణంగా హైదరాబాద్ లోని వివిధ లొకేషన్స్ లో టాకీ, క్లైమాక్స్, పాటలతో సహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేశాం. సినిమా ప్రారంభోత్సవం రోజున ఏదైతే సింగిల్ షెడ్యూల్ లో ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేస్తామని చెప్పామో…అందుకు తగ్గట్టు సింగిల్ షెడ్యూల్లో షూటింగ్ పూర్తి చేశాం..మంచి కథ, కథనాలు ఈ చిత్రానికి ప్రధాన బలమైతే, అందుకు సరిపోయే ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు మరో బలం. మనసు ను కట్టి పడేసే అద్భుత చిత్రంగా దీనిని మలిచాం. మా నాన్నగారి పర్యవేక్షణలో దర్శకుడు అద్భుతంగా సినిమాను తీశారు. మేము అనుకున్నట్లే చాలా బాగా వచ్చింది. తొలి ప్రయత్నం లోనే ఒక మంచి సినిమా తీసినందుకు ఆనందంగా ఉంది. షూటింగ్ సకాలం లో పూర్తి కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి” అని చెప్పారు.

చిత్ర సమర్పకులు ముత్యాల సుబ్బయ్య మాట్లాడుతూ, “ఓ మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలన్న తపనతో మా అబ్బాయి నిర్మాతగా చేస్తున్న చిత్రమిది. వాస్తవిక జీవితానికి అద్దంపట్టేవిధంగా ఉంటుంది. అందుకే నా వైపు నుంచి మా అబ్బాయి నిర్మాతగా తీసేందుకు ప్రోత్సహించా” అని అన్నారు.

దర్శకుడు వి.శ్రీనివాస్ (సిప్పీ) మాట్లాడుతూ, “ఓ మధ్య తరగతి తల్లి చుట్టూ తిరిగే కుటుంబ కథతో, పలురకాల భావోద్వేగాలు , ఆ తల్లి సంఘర్షణల నేపథ్యంలో ఈ చిత్రాన్ని మలిచాం” అని చెప్పారు.

ఈ చిత్రంలోని ఇతర ముఖ్య పాత్రలలో , రఘుబాబు, శుభలేఖ సుధాకర్, సాహిత్య, వైష్ణవి, దేవిప్రసాద్, ఆదర్శ్ బాలకృష్ణ, శాంతకుమార్, గౌతం రాజు, దేవిశ్రీ, జబర్దస్త్ ఫణి తదితరులు తారాగణం.

ఈ చిత్రానికి మూల కథ: శరవణన్, కదా విస్తరణ: ముత్యాల సుబ్బయ్య, మరుధూరి రాజా, మాటలు: నివాస్, పాటలు: భువనచంద్ర, సంగీతం: కోటి, డి.ఓ.పి: ఎన్.సుధాకర్ రెడ్డి, ఎడిటింగ్: నాగిరెడ్డి, ఆర్ట్: వెంకటేశ్వరరావు, సమర్పణ: ముత్యాల సుబ్బయ్య, నిర్మాత: ముత్యాల అనంత కిషోర్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వి.శ్రీనివాస్ (సిప్పీ) .

Tfja Team

Recent Posts

తెలుగు మ్యూజికల్ డ్రామా ‘జగమే సంగీతం’ ట్రైలర్‌.. మనసుని హత్తుకునే మాటలు, మ్యూజిక్

భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…

6 days ago

సింగిల్ స్క్రీన్ థియేటర్లు: టికెట్‌పై రూ.50 అదనంగా వసూలు చేయవచ్చు.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.

→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…

7 days ago

పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం

వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో…

7 days ago

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:

‘ఇరుముడి’కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆనందంతో కళ్లు చెమర్చాయి. ఇంత పెద్ద సక్సెస్ అందించిన ప్రేక్షకులకు థాంక్యూ:…

7 days ago

సెప్టెంబర్ 4న విడుదలకు సిద్దంగా ‘మా రాముడు అందరివాడు’

ఫ్యామిలీ, సోషల్, యాక్షన్, రొమాన్స్, మైథలాజికల్ టచ్ ఇస్తూ అనుముల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అనుముల లక్ష్మణరావు, పల్లకొండ శ్రీరాములు…

7 days ago

పాన్ ఇండియా సినిమాలు తీస్తున్న డైరెక్టర్లందరికీ ఇది ఒక పాఠం — ఇరుముడి చూసి నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది!

ఇరుముడి సినిమా కలెక్షన్స్ చూస్తుంటే అసలు నమ్మశక్యం కాని విధంగా ఉన్నాయి. సినిమా చరిత్రలో ఇలాంటి కలెక్షన్స్, ఇలాంటి జనసందోహం…

1 week ago