గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ‘జరగండి జరగండి..’ సాంగ్‌కు ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ సాంగ్‌గా ‘రా మచ్చా మచ్చా..’ రాకకు రంగం సిద్ధమైంది. లార్జర్ దేన్ లైఫ్ చిత్రాలతో ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే స్టార్ డైరెక్టర్ శంకర్.. తనదైన స్టైల్లో గేమ్ చేంజర్ సెకండ్ సాంగ్‌ను చిత్రీకరించారు.
మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీత సారథ్యంలో రూపొందిన ‘రా మచ్చా మచ్చా..’ సాంగ్ ప్రోమోను సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 30న పాట రిలీజ్ అవుతుంది. ఇండియన్ సినీ హిస్టరీలో నెవ్వర్ బిఫోర్ అనేలా ఎన్నో గొప్ప సినిమాలు, పాటలను చిత్రీకరించిన స్టార్ డైరెక్టర్ శంకర్ మరోసారి తన మార్క్‌ను గేమ్ చేంజర్‌లో సెకండ్ సాంగ్ చిత్రీకరణలో చూపించబోతున్నారు. ఏకంగా 1000కి పైగా జానపద కళాకారులు ఈ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి డాన్స్ చేయటం విశేషం. అది కూడా భిన్నత్వానికి ఏకత్వమైన మన దేశంలోని ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు.. ఇందులో భాగమవటం విశేషం. ఈ సాంగ్ చిత్రీకరణకు సంబంధించిన విశేషాల గురించి డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రత్యేకంగా మాట్లాడారు.
స్టార్ డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ ‘‘గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌తో కలిసి గేమ్ చేంజర్ సినిమాకు వర్క్ చేయటం హ్యాపీగా ఉంది. నేను రామ్ చరణ్ కోసం ఓ ఇంట్రడక్షన్ సాంగ్ కావాలని తమన్‌ను అడిగాను. డిఫరెంట్‌గా చేద్దామని ఇద్దరం అనుకున్నాం. చాలా సేపు డిస్కషన్ చేసుకున్నాం. ఒకరి సలహాలను ఒకరు విన్నాం. ఆంధ్రప్రదేశ్‌లో సంస్కృతులను బేస్ చేసుకుని పాటను చేస్తే బావుంటుందనిపించింది. దానిపై చాలా రీసెర్చ్ చేశాం. ఏపీలో గుసాడి, కొమ్ము కోయ, తప్పెట గుళ్లు వంటి జానపద నృత్యాలను పాటలో భాగం చేయాలనుకున్నాను. అలాగే ప్రేక్షకులకు వీటితో పాటు ఇంకా బెస్ట్ ఇవ్వాలనిపించింది. అందులో భాగంగా వెస్ట్ బెంగాల్‌కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిను గుమ్రా, రానప్ప, పైకా, దురువ వంటి వాటితో పాటు కర్ణాటకు చెందిన హలారి. ఒక్కలిగ, గొరవర, కుణిత వంటి నృత్య రీతులను కూడా భాగం చేయాలనుకుని చాలా రీసెర్చ్ చేసి చేశాం. దీని వల్లు పాట చాలా గ్రాండియర్ లుక్‌తో రావటమే కాదు, సౌండింగ్ కూడా ఇది వరకు ఎన్నడూ విననంత కొత్తగా వచ్చింది. తమన్‌తో మాట్లాడిన తర్వాత తను రెండు రోజులు అన్నీ సంస్కృతులను షూట్ చేశారు. పాట ఒక సెలబ్రేషన్‌లా ఉంటుంది. రామ్ చరణ్ అద్భుతమైన డాన్సర్. గణేష్ ఆచార్యగారు ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు. చరణ్ అయితే ఓ బీజీఎంను సింగిల్ షాట్‌లో పూర్తి చేయటం విశేషం. ఇది చరణ్ ఫ్యాన్స్, సినీ లవర్స్‌కు ఓ ట్రీట్‌లా ఉంటుంది. లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ పాటను సూపర్బ్‌గా రాశారు. దిల్ రాజు, శిరీష్‌గారు చాలా సపోర్ట్‌గా నిలిచారు’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ మాట్లాడుతూ ‘‘గేమ్ చేంజర్‌లోని రా మచ్చా మచ్చా సాంగ్‌లో అన్నీ సంస్కృతులను చూపించటం ఐ ఫీస్ట్‌లా ఉంటుంది. శంకర్‌గారు చాలా హుక్ లైన్స్ రాశారు. చివరకు రా మచ్చా మచ్చా.. అనే లైన్‌ను సెలక్ట్ చేసుకున్నారు. పాటను స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు ఎంజాయ్ చేస్తారు. సెప్టెంబర్ 30న పాట రిలీజ్ కానుంది’’ అన్నారు.
శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో…
తెలుగు చిత్ర నిర్మాతల మండలి 2026 ఎన్నికలలో మన ప్యానల్, ప్రోగ్రెసివ్ ప్యానల్ పోటీ చేయగా మన ప్యానల్ నుండి…
v‘మా రాముడు అందరివాడు’ దమ్మున్న సినిమా : హీరో శ్రీరామ్ ‘మా రాముడు అందరివాడు’ చిత్రంలోని ఫాదర్ అండ్ సన్…
ఖాట్మండు, 31 ఆగస్టు 2026: నేపాల్-టిబెట్ సరిహద్దులో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల తర్వాత మొదటిసారిగా బహిరంగంగా స్పందించిన సద్గురు, ఈ సున్నితమైన ప్రాంతంలో సంభవించే విపత్తులను ఎదుర్కొనేందుకు హిమాలయ దేశాల మధ్య మరింత సహకారం అవసరమని పిలుపునిచ్చారు. ఆదివారం ఖాట్మండులో జరిగిన “ఇన్ సాలిడారిటీ విత్ నేపాల్” కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ ప్రతిపాదన చేశారు. అలాగే నేపాల్ ప్రధానమంత్రి విపత్తు సహాయ నిధికి ₹1 కోటి విరాళాన్ని ప్రకటించారు.నేపాల్ ఆకస్మిక వరదల విషాదంలో వేలాది మంది గల్లంతయ్యారు, పలువురు మరణించి ఉంటారని భావిస్తున్నారు. విపత్తు సంభవించిన సమయంలో సరిహద్దులోని చైనా వైపు ఉన్న గైరాంగ్ (Gyirong) ఇమ్మిగ్రేషన్ కేంద్రం వద్ద ఉన్న ఈశా సేక్రెడ్ వాక్స్ కైలాష్ యాత్రకు చెందిన 77 మంది యాత్రికులు, నేపాల్ వైపు ఉన్న ముగ్గురు ఈశా వాలంటీర్ల ఆచూకీ ఇంకా తెలియరాలేదు.భారత్, చైనా, పాకిస్తాన్, నేపాల్ మరియు భూటాన్ దేశాలతో కూడిన ఐదు దేశాల హిమాలయ బోర్డును ఏర్పాటు చేయాలని సద్గురు ప్రతిపాదించారు. అందరికీ ఉమ్మడిగా ఉన్న ఈ పర్వత వ్యవస్థ విషయంలో రాజకీయ సరిహద్దులకు అతీతంగా ఆలోచించాలని ఆయా దేశాలకు పిలుపునిచ్చారు.“పర్వతాలకు మీ రాజకీయ అనుబంధాలు తెలియవు. మీరు మాట్లాడే భాష లేదా ఇతర విషయాలతో వాటికి సంబంధం లేదు. వీటిని ఒకే పరిపాలనా విభాగంగా నడపలేకపోయినా, కనీసం సంప్రదింపులైనా ఒకే వేదికగా జరగాలి. మనం చేసే పనులలో సమన్వయం ఉండాలి, ఎందుకంటే హిమాలయాలు భూమిపై అత్యంత అద్భుతమైన, మహోన్నతమైన ప్రకృతి సంపద. అదే సమయంలో, అవి ఎంతో సున్నితమైనవి కూడా,” అని సద్గురు స్పష్టం చేశారు.అటువంటి వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ, ఆయన ఇలా అన్నారు: “హిమాలయ పర్వత శ్రేణులు విస్తరించి ఉన్న ఈ దేశాలన్నింటితో కూడిన ఒక వేదిక తక్షణమే ఏర్పడాలి. రాజకీయ పాలనలు వేర్వేరుగా ఉన్నప్పటికీ, భవిష్యత్ తరాల కోసం కాపాడాల్సిన ఒక ప్రకృతి వనరుగా ఈ పర్వత శ్రేణులను చూడాలి. అలా కాకుండా, 'ఇది నేపాల్ సమస్య, వాళ్లే చూసుకుంటారులే' అని అనుకుంటూ పోతే, దీనికి ఎప్పటికీ పరిష్కారం దొరకదు.”ఈ విపత్తు తీవ్రత ఎవరూ ఊహించని రీతిలో ఉందని, ఇలాంటి సంక్షోభాన్ని నేపాల్ ఒక్కటే పరిష్కరించలేదని, అందరూ కలిసికట్టుగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.“ఒక భారీ హిమానీనదం (గ్లేసియర్)లో ముప్పాతిక వంతు మంచు శిఖరం నుండి నాలుగు వేల అడుగుల కిందకు పడిపోతుందని ఎవరూ ఊహించలేదు. ఎవరూ ఇలాంటిది లెక్కించలేరు. కానీ ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి, మనం దీనిపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇది నేపాల్ లాంటి చిన్న దేశం ఒక్కటే పరిష్కరించగలిగే సమస్య కాదు” అని సద్గురు అన్నారు.ఈ విపత్తుకు "దైవిక కారణాలు" లేదా "మార్మిక కోణాలు" ఆపాదించవద్దని ఆయన ప్రజలను కోరారు. ఇటువంటి వివరణలు మనుష్యుల బాధ తీవ్రతను తగ్గిస్తాయని ఆయన చెప్పారు. జీవితంలోని ఆధ్యాత్మిక అంశాలకు, భౌతిక నియమాల ప్రకారం జరిగే ప్రకృతి పరిణామాలకు మధ్య తేడాను గుర్తించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.“మనం ఇలాంటి వాటిపై సమయం వృధా చేయకూడదు. దైవత్వం అనేది వేరే కోణం. భౌతిక పరిణామాలు భౌతిక నియమాలకు లోబడి జరిగే ప్రకృతి ప్రక్రియలు. కాబట్టి తాత్విక వివరణలు, సిద్ధాంతాలు లేదా ఆధ్యాత్మిక కారణాలు చెబుతూ మనుషుల బాధలను చిన్నచూపు చూడకండి. 'ఇదంతా దేవుడి లీల' అనుకోకండి. ఇది పూర్తిగా ఒక భౌతిక సంఘటన మాత్రమే.”ప్రాణాలు కోల్పోయిన వారికి శాంతి చేకూరాలని, సహజ లేదా అసహజ మరణాలు పొందిన వారికి ఆహ్లాదకరమైన ఉత్తమ గతులను కల్పించేందుకు నిర్వహించే ప్రత్యేక ప్రక్రియ అయిన ‘కాలభైరవ కర్మ’ను సెప్టెంబర్ 3న కోయంబత్తూరులోని ఈశా యోగ కేంద్రంలో నిర్వహించనున్నట్లు సద్గురు ప్రకటించారు. పూర్తి కార్యక్రమాన్ని ఇక్కడ చూడవచ్చు: Join Sadhguru "In Solidarity with Nepal
భారతదేశంలోనే అతిపెద్ద స్ట్రీమింగ్ సర్వీస్ అయిన ప్రైమ్ వీడియో నుంచి రానున్న నూతన తెలుగు ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ 'జగమే…
→ ఈ రూ.50లో GST కూడా కలిపి ఉంటుంది.మల్టీప్లెక్స్‌లు / స్పెషల్ థియేటర్లు: టికెట్‌పై రూ.100 అదనంగా వసూలు చేయవచ్చు.→…